గుడిపూడి శ్రీహరి

గుడిపూడి శ్రీహరి సినిమా జర్నలిస్టు, విశ్లేషకులు. ఆయన 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని ఆయన రచించారు.

జీవిత విశేషాలు సవరించు

ఆయన ఎం.ఎ(గణితశాస్త్రం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు గణితశాస్త్రం, భౌతిక శాస్త్రాలను బోధించేవారు. ఆ తరువాత ఆయన జర్నలిజం వైపు దృష్టి సారించారు. ఆయన 1969 నుండి ద హిందూ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుదరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ వరదల కారణంగా అవి పోయినవి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం, రివ్యూ వ్రాయడం ఆయన చేసిన కృషికి నిదర్శనం.

సినిమాలలో అభిరుచి సవరించు

1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక డ్రామాలలో పాల్గొనేవారు. భారతదేశం లో సినిమా ఆ సమయంలో పరిణమించింది. ధియేటర్ వాతావరణం అందంగా రంజకమైన ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్ళ, మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు. ఆ కాలంలో ఆయన నాగయ్య సినిమాలైన "త్యాగయ్య", "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో సి.హెచ్.నారాయణరావు ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం ఉన్న కాలంలొ ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఆయనకు ఇష్టమైన సినిమా మాయా బజార్.

అవార్డులు సవరించు

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'పత్రికా రచన' లో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[1]

మరణం సవరించు

86 ఏళ్ల గుడిపూడి శ్రీహరి అనారోగ్యంతో హైదరాబాదులోని తన నివాసంలో 2022 జులై 4న అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు.[2] 2021 న‌వంబ‌రులో త‌న శ్రీ‌మ‌తి ల‌క్ష్మి మృతి చెందారు. ఆయ‌న‌కు కుమారుడు శ్రీ‌రామ్, ఓ కుమార్తె ఉన్నారు.

మూలాలు సవరించు

  1. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  2. "Gudipudi Srihari: సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత". web.archive.org. 2022-07-05. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు సవరించు