గుడిలో సెక్స్ (పుస్తకం)

గుడిలో సెక్స్ ఆరుద్ర రాసిన విశ్లేషణా గ్రంథం.[1]

గుడిలో సెక్స్
"గుడిలో సెక్స్" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఆరుద్ర
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ బుక్స్
విడుదల: 2000
పేజీలు: 126

దేవాలయాలలో పాతిక ముప్పయి మంది దంపతులు స్వామి వారికి అమ్మ వారిని కన్యాదానం చేయడం సహజం. కాని ఒకే ఒక్క దేవతను ఇంతమంది కన్యాదానంచేయడంలో అంతరార్థం అనే ప్రశ్నకు పూర్వకాలంలో గుడిలో జరిగే సెక్స్ కు ఇది ప్రత్యాయమని ఆరుద్ర అన్నారు. దీనిని విశదీకరించడానికి గుడిలో సెక్స్ గ్రంథం రాశాడు. అతిప్రాచీనమైన సింధూనాగరికత కాలంనుంచి సమాజాన్ని పరిశీలించి, ఆచార వ్యవహారాలను గుడి కోణంనుండి విశ్లేషించారు. సాహిత్యపరంగా వేదాలనుంచి కూడా సాక్ష్యాలు సేకరించారు. మనుస్మృతిని , కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని , ఖజురహో కామశిల్పాలను, శాస్త్రీయ దృష్టి కలిగిని ఊర్మిళ అగర్వాల్, జార్జి థాంప్సన్ రచనలను విశ్లేషించి, గుడిలోపలే సెక్స్ కార్యం చెయ్యాలి కాబట్టి గుడిలోపలా, బైట సెక్స్ బొమ్మలున్నాయని నిరూపించారు. [2]

మూలాలు

మార్చు
  1. "సంభాషణలకు ముగింపు మాటలు -పిన్నమనేని మృత్యుంజయరావు".[permanent dead link]
  2. మేడిపల్లి రవికుమార్ (2007). ఆరుద్ర. సాహిత్య అకాదెమీ. ISBN 81-260-2333-3.