గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా)

గుడ్ ఫెల్లాస్ 1995, సెప్టెంబర్ 9న మార్టిన్ స్కోరెస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం. నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో తదితరులు నటించారు. ప్రపంచ ప్రసిధ్ధ 100 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు ఆరు ఆస్కార్ అవార్డు నామినేషన్లు దక్కడంతోపాటు, అయిదు బ్రిటిష్ అకాడమీ పురస్కారాలను గెలుచుకుంది.

గుడ్ ఫెల్లాస్
గుడ్ ఫెల్లాస్ సినిమా పోస్టర్
దర్శకత్వంమార్టిన్ స్కోరెస్
స్క్రీన్ ప్లేనికోలస్ పిలెగ్గీ, మార్టిన్ స్కోరెస్
నిర్మాతఇర్విన్ వింక్లెర్
తారాగణంరాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్సీ, లోరేన్ బ్రాకో, పాల్ సొర్వినో
ఛాయాగ్రహణంమైకేల్ బల్హాస్
కూర్పుథెల్మా స్కూన్మేకర్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్
విడుదల తేదీs
సెప్టెంబరు 9, 1990 (47వ వెనీస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం)
సెప్టెంబరు 19, 1990 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
145 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్25 మిలియన్ డాలర్లు[2]
బాక్సాఫీసు46.8 మిలియన్ డాలర్లు[3]

ఈస్ట్ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్నవారికి అక్కడి లుచాస్ గ్యాంగ్ అంటే భయం. చిన్నవాడైన హెన్రీకి మాత్రం ఆ గ్యాంగ్ అంటే చాలా ఇష్టం. తనుకూడా ఆ గ్యాంగ్‌ మాదిరిగా నేరాలు చేయాలనుకుంటుంటాడు. ఆ ప్రయుత్నంలోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ‘క్యాపో’ అనే లోకల్ గ్యాంగ్ కు చెందిన అరన పాలీ, జేమ్స్, టామీలను కలుస్తాడు. అంతా కలిసి దోపిడీలు చేస్తూ, ఆ డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. అటుతరువాత మాదకద్రవ్యాల వ్యాపారంలోకి కూడా అడుగుపెడతారు. ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన బిల్లీ స్టువార్ట్‌ను టామీ తన హత్యచేయడంతో ముగ్గురూ కలిసి ఈ శవాన్ని దాచేస్తారు. ఓ గాంబ్లర్ ను చంపేశారన్న కారణంగా హెన్రీ, టామీలకు పదేళ్ల జైలు శిక్షపడుతుంది. జైలులో వాళ్లు మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెడతారు. బయటికొచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి మళ్లీ దోపిడీలు చేస్తారు. ఈలోగా టామీ హత్య చేయబడడంతో నేరసామ్రాజ్యానికి దూరంగా ఉండాలని హెన్రీ నిర్ణయించుకుంటాడు. మాదకద్రవ్యాల కేసులో పోలీసులకు అప్రూవల్‌గా మారిపోతాడు. అయితే,ఎఫ్‌బీఐకి భయపడి హెన్రీ భార్య జెనైస్ డబ్బును పారేస్తుంది. హెన్రీ మళ్లీ జీరో అయిపోతాడు.

నటవర్గం

మార్చు
  • రాబర్ట్ డి నీరో
  • రే లియోట్టా
  • జో పెస్సీ
  • లోరేన్ బ్రాకో
  • పాల్ సొర్వినో
  • ఫ్రాంక్ సివేరో
  • ఫ్రాంక్ విన్సెంట్
  • టోనీ డారో
  • మైక్ స్టార్
  • చక్ లో
  • ఫ్రాంక్ డిలియో
  • శామ్యూల్ ఎల్. జాక్సన్
  • కేథరీన్ స్కోర్సెస్
  • డెబి మజార్
  • మైఖేల్ ఇమ్పెరియోలి
  • టోనీ సిరికో

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: మార్టిన్ స్కోరెస్
  • నిర్మాత: ఇర్విన్ వింక్లెర్
  • స్క్రీన్ ప్లే: నికోలస్ పిలెగ్గీ, మార్టిన్ స్కోరెస్
  • ఆధారం: నికోలస్ పిలెగ్గీ రాసిన ‘వైజ్ గై’ పుస్తకం
  • ఛాయాగ్రహణం: మైకేల్ బల్హాస్
  • కూర్పు: థెల్మా స్కూన్మేకర్
  • పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్

వసూళ్ళు

మార్చు

25 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 46.8 మిలియన్ డాలర్లు వసూళు చేసింది.[4]

ఇతర వివరాలు

మార్చు
  1. గ్యాంగ్‌స్టర్ కావాలనుకున్న ఒక వ్యక్తి జీవితంలోని ఎత్తూపల్లాలను ఇందులో ఆవిష్కరించడం జరిగింది.
  2. ఇందులోని హీరో మొదటి నుంచీ చివరి వరకూ దుర్మార్గుడుగానే ఉంటాడు.
  3. క్రైమ్ జానర్‌లో తీసిన సినిమాలకు, ఈ సినిమా ఒక మంచి రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది.

మూలాలు

మార్చు
  1. "Goodfellas (18)". British Board of Film Classification. September 17, 1990. Retrieved 7 March 2019.
  2. Thompson, David; Ian Christie (1996). "Scorsese on Scorsese". Faber and Faber. pp. 150–161.
  3. "Goodfellas". Box Office Mojo. Retrieved 7 March 2019.
  4. సాక్షి (25 January 2015). "క్రైమ్ తరహా సినిమాలు ఎవరు తీసినా ఇదే రిఫరెన్స్". Archived from the original on 7 March 2019. Retrieved 7 March 2019.

ఇతర లంకెలు

మార్చు