గుత్తా మోహన్ రెడ్డి
గుత్తా మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేశాడు.
గుత్తా మోహన్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 1985 | |||
తరువాత | ఎన్.టి.రామారావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | నల్గొండ నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 - 1983 | |||
ముందు | చకిలం శ్రీనివాసరావు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 ఉర్మడ్ల,చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
మతం | హిందూ మతం |
జననం, విద్యాభాస్యం సవరించు
గుత్తా మోహన్ రెడ్డి 1950లో తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, ఉర్మడ్ల గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం సవరించు
గుత్తా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి గడ్డం రుద్రమ దేవిపై రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశాడు. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలకు పోయారు.
గుత్తా మోహన్ రెడ్డి 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు, అక్కడ ఎన్టీఆర్ నల్లగొండతో పాటు మూడు చోట్ల పోటీ చేసి విజయం సాధించి నల్లగొండ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో తిరిగి జరిగిన ఉప ఎన్నికల్లో గుత్తా మోహన్ రెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గడ్డం రుద్రమ దేవి చేతిలో ఓడిపోయాడు.[1]
మూలాలు సవరించు
- ↑ Prime9News. "మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అరెస్ట్". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.