గునుగు పువ్వు కు గ్రీకు పదం కూలియోస్. ఈ మొక్క 40-200 సెం. మీ ఎత్తువరకు పెరుగుతుంది. ఇండోనేషియా , భారత దేశంలో గునుగు ఆకును ఆకుకూరగా తీసుకుంటారు. ఇది గడ్డిజాతికి చెందిన పువ్వు. గునుగు పువ్వు ఆఫ్రికా మొక్క . తదుపరి ఈ మొక్క , కలుపు మొక్కగా సాగు నుండి తప్పించుకునే విధంగా వ్యాపించింది.ప్రారంభములో దీని పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది, కాని విత్తనాలు వేసిన 6 - 7 వారాల తరువాత పుష్పించే అవకాశం ఉంది. గునుగ పువ్వు వచ్చిన 12 - 14 వారాల తరువాత, 80 - 90 రోజుల తరువాత విత్తనాల కోసం పండించవచ్చు . ఉష్ణమండల, సమశీతోష్ణ మండలాల్లో పెరుగగలదు . ఉష్ణోగ్రతలు 25 - 30 ° c పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది.ఇది 1,500 - 2,500 మిమీ పరిధిలో సగటు వార్షిక వర్ష పాతం అవసరము.[1] గునుగుపువ్వు ను ఇంగ్లీష్ లో సిల్వర్ స్పైక్డ్ కాక్స్ కాంబ్, సిల్వర్ స్పైక్డ్ కాక్ కాంబ్, క్వాయిల్ గడ్డి, హిందీ లో సాఫెడ్ ముర్గా,మలయాళం లో చెరుచిరా, కోజిపూవు( కొంతమంది పన్నై కీరై), అని ,తమిళములో పన్నైపూ, మాకిలిక్కరై పిలుస్తారు. మన దేశములో కేరళ రాష్టం లోని అలప్పుజ, కాసరగోడ్, కొల్లం, మలప్పురం, పాలక్కాడ్, కన్నూర్, కోజికోడ్, త్రిస్సూర్, ఇడుక్కి, వయనాడ్ , జిల్లాలలో పెరుగుతుంది.[2]

గునుగు పువ్వు

బతుకమ్మ పండుగలో మార్చు

తెలంగాణలో బతుకమ్మను పండుగలో బతుకమ్మను తయారుచేయడంకోసం గునుగు పువ్వును వాడుతారు. బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది.

వినియోగం మార్చు

గునుగు ఆకును మందులలో కూడా వాడుతారు.[3] గునుగు మొక్క సాధారణమైన వ్యాధులలో మధుమేహం , నోటి పుండ్లు, ముక్కులో రక్త స్రావం తగ్గడానికి వాడతారు.[4] దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఈ పువ్వును చర్మం పై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదు.  [5]

గునుగు గింజ రక్తస్రావ నివారిణి. పరాన్న జీవులని చంపుతుంది. రక్త విరేచనాలు, రక్తస్రావం, అతిసారాన్ని అరికడుతుంది. కంటి వ్యాధులు, కంటి శుక్లాలకి రక్తపోటుకి దీన్ని మందుగా వాడుతారు. గ్లకోమా ఉన్న వాళ్లు మాత్రం వా డకూడదు. ఇది క్రిమి సంహారిణి.

మూలాలు మార్చు

  1. "Celosia argentea - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-10-19. Retrieved 2020-10-19.
  2. "Celosia argentea argentea". India Biodiversity Portal. Retrieved 2020-10-19.
  3. Tang, Ying; Xin, Hai-liang; Guo, Mei-li (2016-11-01). "Review on research of the phytochemistry and pharmacological activities of Celosia argentea". Revista Brasileira de Farmacognosia (in ఇంగ్లీష్). 26 (6): 787–796. doi:10.1016/j.bjp.2016.06.001. ISSN 0102-695X.
  4. Nindavani, Ramesh (2020-07-27). "TOWARDS A BETTER UNDERSTANDING OF AN UPDATED ETHNOPHARMACOLOGY OF CELOSIA ARGENTEA L." (PDF). innovareacademics.in/journal/ijpps/Vol5Suppl3/7421.pdf.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Team, TV9 Telugu Web (2019-09-28). "Names Of Flowers Used In Bathukammaబతుకమ్మలో ఉపయోగించే పువ్వులు.. ప్రత్యేకతలేంటో తెలుసా..? - Health Benefits Of The Flowers Used In The Festival Of Bathukamma". TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు