గుఫీ పెయింటల్
గుఫీ పెయింటల్ (4 అక్టోబర్ 1944 - 5 జూన్ 2023) ఇతనిని సరబ్జీత్ సింగ్ పెయింటల్ అహ్లువాలియా అని కూడా పిలుస్తారు. ఇతను మహాభారతం సీరియల్ లో శకుని మామ గా ప్రసిద్ధి చెందాడు.[2] ఇతను భారతీయ నటుడు, కాస్టింగ్ డైరెక్టర్.
నట జీవితం
మార్చుఇతను 4 అక్టోబర్ 1944లో తర్న్ తరణ్ జిల్లా, పంజాబ్ లో జన్మించాడు, మొదట్లో ఇంజనీర్‌గా శిక్షణ పొందాడు, ఆ తరువాత 1962లో చైనా-ఇండో యుద్ధం సమయంలో భారత సైన్యంలో చేరాడు. సరిహద్దులో రాంలీలా అనే జానపద నాటకం వేస్తున్నప్పుడు అందులో సీతగా నటించాడు,[3] అక్కడ నుండి అతనికి నటనపై ఆసక్తి పెరిగి బొంబాయికి వెళ్ళాడు. 1969లో, గుఫీ మోడలింగ్ చేస్తూ, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు, వివిధ సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అతని సోదరుడికి కూడా దర్శకత్వం వహించాడు. బిఆర్ చోప్రా, అతని కుమారుడు రవి చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్ శకుని పాత్ర ద్వారా అత్యంత ప్రసిద్ధి పొందాడు, అంతేకాకుండా పెయింటల్ శకుని వేషంతోనే సహారా సమయ్ అనే వార్తా ఛానెల్‌లో రాజకీయ చర్చా కార్యక్రమానికి యాంకర్ గా చేసాడు. ఇతను శ్రీ చైతన్య మహాప్రభు చిత్రానికి దర్శకత్వం వహించాడు.[4] 2010లో మహాభారత సీరియల్ సహనటుడు అయిన పంకజ్ ధీర్ స్థాపించిన అభినయ్ యాక్టింగ్ అకాడమీ ఫెసిలిటీ హెడ్‌గా నియమించబడ్డాడు.[5]
మరణం
మార్చు5 జూన్ 2023న గుండె సంబంధిత సమస్యలతో ముంబై ఆసుపత్రిలో మరణించాడు.[6][7]
ఫిల్మోగ్రఫీ
మార్చుచలనచిత్రాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్రలు |
---|---|---|
1975 | రఫూ చక్కర్ | సలీం |
1978 | డిల్లగి | గణేష్ |
1978 | దేశ్ పరదేశ్ | |
1994 | సుహాగ్ | అక్షయ్ కుమార్ మేనమామ |
1995 | మైదాన్-ఈ-జంగ్ | మామ్జీ |
1997 | దావా | మంగళ్ సింగ్, వన్ పీస్ కతియావాడి ఘోడో |
2000 | ది రివెంజ్: గీతా మేరా నామ్ | |
2006 | ఘూమ్ | విజయ్ దీక్షిత్ బాస్ |
2013 | మహాభారతం ఔర్ బార్బరీక్ | శకుని |
2014 | సామ్రాట్ & కో. | దినేష్ దాస్ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1986 | బహదూర్ షా జాఫర్ | డిడి నేషనల్ | |
1988–1990 | మహాభారతం | శకుని | డిడి నేషనల్ |
1988–1990 | కానూన్ | జస్టిస్ రఘునాథ్ | డిడి మెట్రో |
1992 | సౌదా | డిడి నేషనల్ | |
1997–2001 | ఓం నమః శివాయ | శకుని | డిడి నేషనల్ |
1998–1999 | అక్బర్ బీర్బల్ | ముల్లా దో ప్యాజా | డిడి నేషనల్ |
2001 | సిఐడి (భారత టీవీ సిరీస్) | చందర్ | ఎపిసోడ్ 195, 196 |
2002 | ష్ .. కోయి హే | డాక్టర్ జార్కోస్ | స్టార్ ప్లస్ |
2003 | మేజిక్ మేకప్ బాక్స్ | బ్రితారీ | జీ టీవీ |
2011–2012 | ద్వారకాధీశ్ భగవాన్ శ్రీ కృష్ణ్ | శకుని | ఇమాజిన్ టీవీ |
2012–2013 | మిసెస్. కౌశిక్ కి పాంచ్ బహుయేన్ | బ్రిజ్‌భూషణ్ భల్లా | జీ టీవీ |
2013 | భారత్ కా వీర్ పుత్ర్ - మహారాణా ప్రతాప్ | హుమాయున్ | సోనీ టీవీ |
2016–2018 | కర్మఫల్ దాత శని | విశ్వకర్మ | కలర్స్ టీవీ |
2018 | కర్ణ సాంగిని | కృపాచార్య | స్టార్ ప్లస్ |
2019–2023 | రాధా కృష్ణ | విశ్వకర్మ | స్టార్ భారత్ |
2021–2022 | జై కనియా లాల్ కీ | విశ్వకర్మ | స్టార్ భారత్ |
మూలాలు
మార్చు- ↑ "Guftagoo with Gufi Paintal". Retrieved 16 November 2019 – via YouTube.
- ↑ "Gufi Paintal Funeral: Mahabharat's Shakuni Mama Laid To Rest. Late Actor Receives State Salute". TimesNow. 2023-06-05. Retrieved 2023-06-06.
- ↑ "एक्टर बनने से पहले आर्मी में थे 'शकुनि मामा' गूफी पेंटल, चीन के बॉर्डर पर बनते थे सीता". Navbharat Times. Retrieved 2023-06-06.
- ↑ "Times Music : Shri Chaitanya Mahaprabhu". web.archive.org. 2008-03-09. Archived from the original on 2008-03-09. Retrieved 2023-06-06.
- ↑ "Akshay at Pankaj Dheer's acting academy". web.archive.org. 2010-04-12. Archived from the original on 2010-04-12. Retrieved 2023-06-06.
- ↑ Staff, Hamari Baat (2023-06-05). "Gufi Paintal the Shakuni Mama is sadly no more, he was 79". Hamaribaat.com - News From India And The World ! ! !. Retrieved 2023-06-06.
- ↑ Andhra Jyothy (5 June 2023). "బాలీవుడ్‌లో మరో విషాదం.. గుఫి పైంటాల్ కన్నుమూత". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.