గుమ్మెత
గుమ్మెత లేదా గుమ్మెట ఒక మట్టి కూజా లాంటిది. దీనికి డక్కి, బుడికె అని కూడా వ్యవహరిస్తారు. కూజా అడుగు భాగం తీసేసి అక్కడ చర్మాన్ని వేస్తారు. కూజా మూతి వైపు ఖాళీగా వుంటుంది. దీనిని మెడకు తగిలించు కొని చర్మం వున్న వైపున చేతితో కొడుతు సందర్భాను సారం... రెండో చేత్తో మూతి వైపున మూస్తూ తెరుస్తూ వుంటే ఒక వింత శబ్దం వస్తుంది. దీనిని ఎక్కువగా బుర్ర కథ, ఒగ్గుకత చెప్పేవారు మాత్రమే వాడుతారు. దీనికి ప్రక్కవాద్యాలు తంబుర తప్పక వుండాలి. కొంత మంది బిచ్చగత్తెలు దీనిని ఒక్కదానినే వాయిస్తూ... పాట పాడుతూ భిక్షాటన చేస్తుంటారు.
బుర్రకథలో గుమ్మెట ఒక ప్రధాన వాద్యము. ఇది కాశ్మీరులో కనిపించే తుంబక్, మధ్యప్రాచ్యంలో కనిపించే డంబెక్ లేదా డర్బూకాకు దగ్గరి సంబంధమున్న వాద్యము. కానీ వీటి పరిణామంలో ఏవైనా సంబంధమున్నదో లేదా ఇవి వేర్వేరుగా ఉద్భవించాయో కచ్చితంగా తేల్చిచెప్పేందుకు ఆధారాలు లేవు.[1] గుమ్మెత యొక్క ప్రసక్తి ఆముక్తమాల్యద వంటి అనేక మధ్యయుగపు కావ్యాలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "GUMMETA (a.k.a. Dakki, Budike) - by David Courtney". Archived from the original on 2013-01-18. Retrieved 2013-07-15.