గురునానక్ జయంతి

గురు నానక్ జయంతి మొదటి సిక్కు గురువు గురు నానక్ జన్మదినమును పండుగగా జరుపుకునే రోజు.[1] ఈ పండుగను గురు నానక్ ప్రకాష్ ఉత్సవ్, గురు నానక్ దేవ్ జీ గుర్పురబ్ అని కూడా పిలుస్తారు. అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరైన గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపకులు.[2] సిక్కుమతంలో చాలా పవిత్రమైన పండుగలలో గురు నానక్ జయంతి ముఖ్యమైనది . [3]

గురునానక్ జయంతి సందర్భమున అలంకరింపబడ్డ పంజాబ్ హర్మీందర్ సాహిబ్ గురు ద్వారా సమీపంలో అకాల్ తఖ్త్
లంగర్ భోజన దృశ్యం

సిక్కు మతంలో ఎక్కువగా జరుపుకునే ఉత్సవాలు 10 మంది గురువుల వార్షికోత్సవాలకు సంబంధించినవే్. ఈ గురువులు సిక్కుల నమ్మకాలను రూపొందించడానికిముఖ్య కారకులుు. గుర్పురాబ్ అని పిలువబడే వారి పుట్టినరోజులు ప్రార్థనలతో కూడిన వేడుకలు.

సిక్కు మతం స్థాపకుడైన గురు నానక్ 1469 లో కార్తీక పౌర్ణమి రోజున జన్మించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజును ప్రపంచమంతటా ప్రార్థనలతో ఈ పర్వదినమును వేడుకగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలో గెజిటెడ్ సెలవుదినం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, దిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో గురు నానక్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా జరుపుకుంటారు. అలాగే కెనడా, బ్రిటన్, పాకిస్తాన్ లో సిక్కు వారు ఎక్కువగా నివసించే ప్రదేశాలలో కూడా ఈ పండుగ జరుపుకుంటారు.

గుర్పురబ్ రోజు వేడుకలు తెల్లవారుజామున నాలుగింటికి ప్రారంభమవుతాయి. [4][5] ఈ సమయాన్ని అమృత్ వెలా అని పిలుస్తారు. ఆసా-కి-వార్ (ఉదయం శ్లోకాలు) పాడటంతో జయంతి వేడుకలు మొదలవుతుంది. [4] [5] తరువాత కథ, కీర్తనలు (సిక్కు శాస్త్రలలోని శ్లోకాలు). [5] ఆ తరువాత గురుద్వారాల వద్ద వాలంటీర్లు ప్రత్యేక సమాజ భోజనం లంగర్ ఏర్పాటు చేస్తారు. ఈ ఉచిత మత భోజనం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే లింగం, కులం, వర్గం, మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సేవ, భక్తి భావముతో ఆహారం అందజేయడమే. [6]

మూలాలు మార్చు

  1. Singh Purewal, Pal. "Birth Date of Guru Nanak Sahib" (PDF). Purewal's Page. Pal Singh Purewal. Archived (PDF) from the original on 22 February 2015. Retrieved 16 June 2017.
  2. "Happy Gurpurab 2020: Guru Nanak Jayanti Wishes Images, Status, Quotes, Wallpapers, Messages, Photos". The Indian Express (in ఇంగ్లీష్). 2020-11-30. Retrieved 2020-11-30.
  3. "Guru Nanak Jayanti 2019: History, significance and traditions". Hindustan Times. Archived from the original on 14 December 2019. Retrieved 5 May 2020.
  4. 4.0 4.1 "GURPURBS". Archived from the original on 1 June 2009.
  5. 5.0 5.1 5.2 "What's your point?". Sikhpoint.com. Archived from the original on 22 September 2019. Retrieved 12 November 2019.
  6. "Guru Purab". Archived from the original on 24 December 2011. Retrieved 26 December 2011.