గూడూరి సీతారాం తెలంగాణలోని తొలితరం కథారచయిత. తెలంగాణ యాసలో, భాషలో కథలు రాసిన సీతారాం 1953-1965 వరకు సుమారు 80 కథల వరకు రాశాడు.

గూడూరి సీతారాం
జననంజూలై 18, 1936
హనుమాజీపేట్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా
మరణంసెప్టెంబర్ 25, 2011
ప్రసిద్ధితొలితరం కథారచయిత

జననం మార్చు

గూడూరి సీతారాం 1936, జూలై 18న కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల దగ్గరలోని హనుమాజీపేట్ లో జన్మించాడు.[1]

రచనా ప్రస్థానం మార్చు

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి కి బాల్యమిత్రుడైన సీతారాం 1960, జనవరి 1న మొదటి కథను రాశాడు. తను నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, తాను అనుభవించిన జీవితం, ఫ్యూడల్‌ భూస్వాముల దౌర్జన్యాలు, పల్లె బతుకు, గ్రామ పెత్తందార్ల పెద్దరికం, రజాకార్ల సంఘటనలు మొదలైనవి సీతారాం రచనలు చేయడానికి దోహదం చేశాయి.[2]

అప్పటికాలంలో గ్రాంధిక భాషలో పుస్తకాలు ఎక్కవగా ఉండేవి. వ్యవహారిక భాషలో దొరకడం తక్కువ. దాంతో, నిత్య జీవితంలో ఉపయోగించే భాషలో రచనలు చేస్తే అందరికీ అర్థమవుతుందన్న ఉద్దేశ్యంతో ఆ మాండలికంలో రచనలు చేశాడు. అనేక గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు.

రచించిన కథలు[3] మార్చు

  1. నారిగాని బతుకు
  2. పెళ్లి ప్రేమ
  3. మారాజు
  4. రంగడు
  5. రాజమ్మ రాజరికం
  6. లచ్చి (1957)[4]
  7. అరిగొచ్చిన యెర్రిబాగులోడు
  8. జరంపడి
  9. బస్సచ్చింది
  10. పోలీసుల చేతిలో తన్నులు తిని
  11. మీకూ ఖర్చుపెట్టడం వస్తుందా?
  12. మేడిపండు

మరణం మార్చు

2011, సెప్టెంబర్ 25న మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. ఈనాడు ప్రతిభ. "భూమిక". Archived from the original on 20 మే 2017. Retrieved 4 June 2017.
  2. తెలుగు వన్ ఇండియా. "కథలురాయడం అపూర్వం: గూడూరి సీతారాం". telugu.oneindia.com. Retrieved 4 June 2017.
  3. కథానిలయం. "రచయిత: గూడూరి సీతారాం". kathanilayam.com. Retrieved 4 June 2017.
  4. నమస్తే తెలంగాణ. "గూడూరి సీతారాం 'లచ్చి' కథ". Retrieved 4 June 2017.
  5. తెలుగు వెబ్ వరల్డ్. "GREAT TELUGU WRITER - SRI GUDURI SITARAM GARU - A BRIEF PROFILE". teluguwebworld.blogspot.in. Archived from the original on 31 మే 2017. Retrieved 4 June 2017.