సిరిసిల్ల

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలంలోని పట్టణం
  ?సిరిసిల్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.68 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) రాజన్న సిరిసిల్ల జిల్లా
జనాభా
జనసాంద్రత
83,186[2] (2011 నాటికి)
• 3,239/కి.మీ² (8,389/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిరిసిల్ల పురపాలకసంఘం


సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో సిరిసిల్ల పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్స్‌టైల్ టౌన్ అని కూడా పిలుస్తారు. 40,000 పవర్ లూమ్‌లతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్ గా ఉంది.[4] విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది.

భౌగోళికం

మార్చు

ఈపట్టణం 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[5] దీని సగటు ఎత్తు 322 మీటర్లు (1056 అడుగులు). దీనికి ఉత్తరాన 130 కి.మీ.ల దూరంలో సికింద్రాబాద్, పశ్చిమాన 40 కి.మీ.ల దూరంలో కరీంనగర్, ఉత్తరాన 35 కి.మీ.ల దూరంలో సిద్దిపేట, తూర్పున 56 కి.మీ.ల దూరంలో కామారెడ్డి ఉన్నాయి. ఇక్కడికి 10 కి.మీ.ల దూరంలో చారిత్రాత్మకమైన వేములవాడ ఆలయ పట్టణం ఉంది.

విద్యుత్ సరఫరా

మార్చు

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.[3]

నీటి వసతి

మార్చు

సిరిసిల్ల పట్టణముకీ అనుకోని మానేరుడ్యామ్ ఉండడం వలన నీటికి కొరతలేకుండా ఉంది. బోరు బావులద్వారా కూడా నీరు అంతుంది.

రవాణా వ్యవస్థ

మార్చు

వేములవాడ వెళ్లే మార్గంలో ఉండడంతో 24 గంటల బస్సు సదుపాయం ఆటోల సదుపాయం కూడా ఉంది. రాష్ట్ర రహదారి సిరిసిల్ల పట్టణం గుండా వెళుతుంది.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

విద్య

మార్చు

ఈ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. 2021లో మహిళల కోసం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించబడింది. ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది, ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాకుండా పట్టణంలో అనేక ప్రైవేట్ డిగ్రీ, సాంకేతిక సంస్థలు ఉన్నాయి.

ప్రభుత్వ వైద్య కళాశాల

మార్చు

సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. పట్టణంలోని రెండో బైపాస్‌ రోడ్డులో 30 ఎకరాల్లో కళాశాల నిర్మాణం జరిగింది. 2023 సెప్టెంబరు 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ-పురపాలక-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించాడు.[6] 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[7][8]

విశేషాలు

మార్చు
  • సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
  • డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
  • వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
  • 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[3]
  • ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన రాజన్న సిరిపట్టు, సిరిచందన పట్టు చీరలు ఈ సిరిసిల్ల పట్టణంలోనే తయారవుతున్నాయి.[9][10]

విగ్రహాలు

మార్చు
  • కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: ఇక్కడి మానేరు న‌ది స‌మీపంలోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని 2022 సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుమార్, నాఫ్కెబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.[11][12]
  • సర్దార్ సర్వాయి పాపన్న: శాంతినగర్‌ మొదటి బైపాస్‌రోడ్డులో నర్సింగ్‌ కళాశాల ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి 2023, ఆగస్టు 3న భూమిపూజ జరిగింది.[13] మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని ఆగస్టు 18న రాష్ట్ర ఐటీ-పురపాలక శాఖామంత్రి కేటీఆర్, పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.[14] ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.[15]

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  3. 3.0 3.1 3.2 "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Archived from the original on 4 మార్చి 2021. Retrieved 5 May 2021.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-05. Retrieved 2021-05-05.
  5. Falling Rain Genomics, Inc – Siricilla[permanent dead link]
  6. telugu, NT News (2023-09-15). "Minister KTR | మోదీ స‌హ‌క‌రించుకున్నా.. జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-18. Retrieved 2023-09-25.
  7. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-25.
  8. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-25.
  9. "Rajanna Siripattu sarees weave magic in New Zealand". The New Indian Express. 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-10-14.
  10. "'సిరిచందన' సౌగంధం". EENADU. 2022-10-09. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.
  11. "తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్‌ బాపూజీ". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
  12. telugu, NT News (2022-09-27). "కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పోరాటం మ‌రువ‌లేనిది : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
  13. "సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ". Sakshi. 2023-08-04. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.
  14. "KTR: పాపికొండలు, కోనసీమను తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి: కేటీఆర్‌". EENADU. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.
  15. telugu, NT News (2023-08-18). "Minister KTR | సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో, మతానికి సంబంధించిన వారు కాదు : కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు మెయిన్; 2014, ఫిబ్రవరి-28; 11వ పేజీ.

ఇవి కూడా చూడండి

మార్చు