గెటల్సుడ్ ఆనకట్ట
గెటల్సుడ్ ఆనకట్ట జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీజిల్లాలోని ఒర్మాంజీలో ఉన్న సువర్ణలేఖ నదిపై నిర్మించిన ఆనకట్ట.[1] 1971లో ప్రారంభించబడిన ఈ ఆనకట్ట రాంచీ, రాంగడ్ జిల్లాలలోని ప్రజలకు ఒక ప్రసిద్ధ విహారయాత్ర స్థలంగా మారింది. రుక్కా ప్రాంతంలోని స్థానిక ప్రజలకు చిన్నస్థాయి మత్స్య సేకరణకు ఉపయోగపడుతుంది. రాంచి వాసుల తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ఆనకట్ట యొక్క ప్రధాన లక్ష్యం. అంతే కాకుండా, పారిశ్రామిక అవసరాలకోసం, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఈ ఆనకట్ట ఉపయోగపడుతుంది.
గెటల్సుడ్ ఆనకట్ట (రుక్కా ఆనకట్ట) | |
---|---|
దేశం | భారతదేశం |
ప్రదేశం | ఒర్మాంజీ, రాంచీ, జార్ఖండ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 23°27′24″N 85°33′19″E / 23.45667°N 85.55528°E |
స్థితి | వాడుకలో ఉంది |
ప్రారంభ తేదీ | 1971 |
యజమాని | జె.ఎస్.ఈ.బి |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | కాంక్రీట్ గురుత్వాకర్షణ ఆనకట్ట |
నిర్మించిన జలవనరు | సువర్ణలేఖ నది |
Height | 116 అడుగులు (35 మీటర్లు) |
జలాశయం | |
ఉపరితల వైశాల్యం | 717 కి.మీ2 (277 చ. మై.) |
సాధారణ ఎత్తు | 1954 అడుగులు (596 మీటర్లు) |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | జె.ఎస్.ఈ.బి |
టర్బైన్లు | 2 x 65 MW Francis-type |
Installed capacity | 130 MW |
ప్రదేశం
మార్చుచోటా నాగపూర్ పీఠభూమి యొక్క ఈశాన్య సరిహద్దులో ఉన్న ఈ ఆనకట్ట, రుక్కా బ్లాకులో ఉండడం వల్ల దీనిని రుక్కా ఆనకట్ట అని కూడా పిలుస్తారు. ఇది రాంచీ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, రాంగఢ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ముఖ్యాంశాలు
మార్చు717 కి.మీ.ల పరీవాహక ప్రదేశంతో ఉన్న ఈ ఆనకట్ట 1,954 అడుగుల పూర్తి రిజర్వాయర్ స్థాయిని కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు తగినంత నీరు రాగానే ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయబడుతుంది. వివిధ పండుగలరోజున రాంచీ, రాంఘర్ ప్రజలు ఇక్కడి వేడుకలను జరుపుకుంటారు. దీని చుట్టుపక్కల అనేక విహార ప్రాంతాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 30 June 2018.