గెల
దాదాపుగా ఏక కాండం చెట్లకు కాసే కాయలతో పాటు ఉన్న పన్నెలు పన్నెలతో పాటు ఉన్న కాడ ఈ మొత్తాన్ని కలిపి గెల అని అంటారు.
కొన్ని ఏక కాండం చెట్లకు కాసే గెలలకు పన్నెలు లేకపోయినప్పటికి దానిని గెల గానే పరిగణిస్తారు. ఉదాహరణకు తాటి చెట్టుకు కాసే గెలకు పన్నెలు లేక పోయినప్పటికి దానిని గెల అనే పిలుస్తారు.
గెలకు ఉన్న కాడ గట్టిగా ఉంటుంది. దీనిని చెట్టు నుంచి వేరు చేయడానికి పదునైన కత్తితో బలంగా కోయవలసి ఉంటుంది.
గెల ఎక్కువ కాయలతో లేక బరువైన కాయలతో ఉండుట వలన గెల బరువుగా ఉంటుంది.
అరటి చెట్టుకు కాసే గెలను అరటి గెల అని ఆంటారు.
ఈతచెట్టుకు కాసే గెలను ఈతగెల అని అంటారు.
జాగ్రత్తలు
మార్చుఅరటి గెల బరువుగా ఉంటుంది కింద పడితే కాయలు చెడిపోతాయి కనుక పైనుంచి కింద పడకుండా జాగ్రత్తగా కోయవలసి ఉంటుంది.
టెంకాయ చెట్టు, తాటిచెట్టు గెలలను కోసేటప్పుడు కాయలు లేదా గెలలు పైన పడితే చాలా ప్రమాదం అందువలన అవి పైన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.