గైతి హసన్ Gaiti Hasan (జననం 1956 నవంబరు 19) మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, న్యూరోసైన్స్, సెల్ సిగ్నలింగ్ రంగాలలో పరిశోధనలు చేసిన ఒక భారతీయ శాస్త్రవేత్త.  ఆమె ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఎ) లో  ఫెలోగా ఉన్నారు.[1]  2013 నుండి ఆమె బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్.సి.బి.ఎస్)లో సీనియర్ ప్రొఫెసర్ గా సేవలందిస్తోంది.

జీవితం మార్చు

హసన్ చిన్నతనంలో అలీఘర్ లో విద్యాభ్యాసం జరిగింది. గైతీ హసన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రములోలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్సీ) 1976 సంవత్సరంలో పట్టాను పొందారు. ఆమె లైఫ్ సైన్సెస్ లో ఎమ్మెస్సీ చేసింది, తరువాత న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి 1980 సంవత్సరంలో ఎంఫిల్, ఆ తరువాత ఆమె "ట్రిపనోసోమా బ్రూసి రైబోసోమల్ ఆర్ ఎన్ ఎ జన్యువులపై అధ్యయనాలు" పై 1983 సంవత్సరంలో డాక్టరేట్ ( పిహెచ్ డి) కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పొందింది. ఆమె తన వృత్తిని మాలిక్యులర్ బయాలజీ యూనిట్, టిఐఎఫ్ఆర్, ముంబై (1983 89) లో విజిటింగ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ గా ప్రారంభించింది. ఆమె 1989 లో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (టిఐఎఫ్ఆర్) వ్యవస్థాపక సభ్యురాలిగా మారింది. హసన్ అమెరికాలోని బ్రాండీస్ విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగానికి విజిటింగ్ సైంటిస్ట్ (1990-92). ఆమె నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్ సిబిఎస్), టిఐఎఫ్ ఆర్, బెంగళూరు (1992-94)లో ఫెలోగా తిరిగి వచ్చింది. గైతి హసన్ 1994-98 సంవత్సరాలలో రీడర్ గా, 1998-2004 సంవత్సరాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా, (2005-2012 సంవత్సరాలలో ప్రొఫెసర్ గా, ప్రస్తుతం ఆమె ఎన్ సిబిఎస్ లో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.[2]

అవార్డులు మార్చు

హసన్ ఇన్లాక్స్ ఫౌండేషన్ నుండి స్కాలర్ షిప్ [3] ఒక బ్రిటిష్ ఓవర్సీస్ రీసెర్చ్ స్టూడెంట్ అవార్డ్, వెల్కమ్ ట్రస్ట్ నుండి ఫెలోషిప్, రాక్ఫెల్లర్ బయోటెక్నాలజీ కెరీర్ ఫెలోషిప్ పొందినది. 2006 సంవత్సరంలో బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఫెలోగా, 2007లో ఆసియా-పసిఫిక్ మాలిక్యులర్ బయాలజీ నెట్ వర్క్ లో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) లో ఫెలోగా కూడా ఉన్నారు.[4]

ప్రచురణలు మార్చు

గైతి హసన్ రచనలు సుమారు 82 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించారు.[5]

మూలాలు మార్చు

  1. "Indian Academy of Sciences". fellows.ias.ac.in. Retrieved 2022-04-22.
  2. "Gaiti Hasan | Indian National Science Academy | India". OMICS International (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
  3. "Inlaks Shivdasani Foundation". web.archive.org. 2015-04-03. Archived from the original on 2015-04-03. Retrieved 2022-04-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "INSA :: Indian Fellow Detail". www.insaindia.res.in. Retrieved 2022-04-22.
  5. "Gaiti Hasan's Publons profile". publons.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
"https://te.wikipedia.org/w/index.php?title=గైతి_హసన్&oldid=3611073" నుండి వెలికితీశారు