గొట్టిపాటి కొండపనాయుడు

గొట్టిపాటి కొండపనాయుడు భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత. అతను కావలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యునిగా 1972 నుండి 1978 వరకు పనిచేసాడు.[1]

గొట్టిపాటి కొండపనాయుడు

ప్రాథమిక జీవితం మార్చు

గొట్టిపాటి కొండపనాయుడు గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలి తాలూకా చింతలపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.

రాజకీయ జీవితం మార్చు

కొండపనాయుడు గారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1956లో గట్టుపల్లి పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ జీవితం ఆరంభించారు. అదే పంచాయతీకి 1959, 1964, 1970లలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1959-62, 1962-64 చిన క్రాక పంచాయతీ సమితి అధ్యక్షునిగా, 1964-70, 1970-72 వింజమూరు పంచాయతీ సమితి అధ్యక్షునిగా, 1964-70 కాలంలో నెల్లూరు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షునిగా, 1964-70 నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంఘం సభ్యునిగా,1972-78 కాలంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యునిగా సేవలందించాడు.

ఆచార్య ఎన్.జి.రంగా గారి శిష్యుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన కొండపనాయుడు గారు 1967లో కావలి నియోజకవర్గం నుంచి తన తరుపున స్వతంత్ర అభ్యర్థిగా గొట్టిపాటి సుబ్బానాయుడు బరిలో నిలిపి గెలిపించారు. 1972లో తానే స్వయంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి విజయం సాధించడం జరిగింది. సోమశిల ఉత్తర కాలువ సాధన కోసం అనేక పోరాటాలు చేసి సాధించాడు. ఈ కాలువకు గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం నామకరణం చేసింది. ఈరోజు ఉత్తర కాలువ క్రింద ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో ఉన్న వేల ఎకరాలు సాగు కిందకి వచ్చాయి.[2]

వ్యక్తిత్వం మార్చు

రాజకీయ జీవితంలో పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్న తన అభిమానులను మాత్రం కంటికి రెప్పలా చూసుకునేవారు . ఎడ్లబండ్లపై, సైకిల్‌రిక్షాలపై, అనుచరుల ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యేవారు . తన సొంత పంచాయతీలో వైద్యశాల, వసతిగృహాలు, రోడ్ల అభివృద్ధి, పశువైద్యశాల ఏర్పాటు చేయించగలిగాడు. అంతేకాక పలుగ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి మంచి పేరు సాధించాడు. తన రాజకీయ పయనంలో సొంత ఆస్తులు కరగతీసుకున్నాడే తప్ప సంపాదించిందేమీ లేదు. తన వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచడం జరిగింది. గొట్టిపాటి స్వార్థరాజకీయాలకు దూరంగా ఉన్నారనే పేరుంది. నేటికీ ఆయన అభిమానులు కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో ఉండి రాజకీయాలు చేస్తున్నారు.

మరణం మార్చు

గొట్టిపాటి కొండపనాయుడు గారు 2002 లో మరణించారు .

రచనలు మార్చు

  • మనం-మనదేశం
  • ఆంధ్రప్రదేశ్ దర్శిని
  • దేశ దర్శిని
  • నెల్లూరు దర్శిని

మూలాలు మార్చు

  1. "Kavali Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Kavali, Andhra Pradesh". Elections in India. Archived from the original on 2021-10-08. Retrieved 2021-10-08.
  2. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-09-24. Retrieved 2021-10-08.