కావలి

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండల పట్టణం

కావలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పట్టణం. ఇది ప్రముఖ విద్యా, వస్త్ర వ్యాపారకేంద్రం. గ్రేడ్ 1 మున్సిపాలిటీ

పట్టణం
Map
నిర్దేశాంకాలు: 14°54′44″N 79°59′40″E / 14.91228°N 79.99437°E / 14.91228; 79.99437Coordinates: 14°54′44″N 79°59′40″E / 14.91228°N 79.99437°E / 14.91228; 79.99437
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంకావలి మండలం
విస్తీర్ణం
 • మొత్తం61.09 km2 (23.59 sq mi)
జనాభా వివరాలు
(2011)[2][1]
 • మొత్తం90,099
 • సాంద్రత1,500/km2 (3,800/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8626 Edit this on Wikidata )
పిన్(PIN)524201 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తిసవరించు

పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలి గాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి"గా వాడుకలోనికి వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయింది.

ఇంకో కథనం ప్రకారం, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమతమ సరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇతు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటులు సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద "కావలి" అనే పేరు ఏర్పడింది.[3]

చరిత్రసవరించు

 
కావలి పట్టణం

1950 ప్రాంతంలో మరల జరిగిన సర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ (village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ (విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ.లు ఉన్నారు. సుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. వీటికి నలుగురు తహసీల్దారులున్నారు.

కావలి ప్రకాశం జిల్లాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ ఉన్నత పాఠశాల). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.

భౌగోళికంసవరించు

కావలికి తూర్పు వైపున సముద్రము 7 కి.మీ. దూరంలో ఉంది.

జనగణన వివరాలుసవరించు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పోరేషన్ (నగరం) తర్వాత మొదటి అతి పెద్ద పట్టణం. జనాభా సుమారు లక్షా ఇరవై వేలు. వారిలో పురుషుల సంఖ్య 52%, స్ట్రీలు 48%. వారిలో అక్షరాస్యత శాతం 72% ఇది జాతీయ నిష్పత్తి 59.5 కంటే ఎక్కువ. పురుషుల శాతం 78%, స్త్రీల సంఖ్య 65%. కావలి జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపువారే.

పరిపాలనసవరించు

కావలి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలుసవరించు

రహదారి మార్గముసవరించు

చెన్నై - కలకత్తా NH-16 జాతీయ రహదారికి సమీపంలో, నెల్లూరు - ఒంగోలు పట్టణాల మధ్య ఉంది.

రైలు మార్గముసవరించు

చెన్నై - కలకత్తా రైలుమార్గంలో గూడూరు-విజయవాడ జంక్షనుల మధ్య, దేశంలోనే రద్దీ అయిన రైలు మార్గములో ఉన్న ఒక ప్రధాన స్టేషను.

విద్యా సౌకర్యాలుసవరించు

కావలిలో 5 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి.పదుల సంఖ్య లో డిగ్రీ మరియు ఇంటర్ కాలేజ్ లు వున్నాయ్...

అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక మరియు హైస్కూల్స్ వున్నాయ్

ఆర్ధిక స్థితిగతులుసవరించు

ఇది జిల్లాలో ఒక ముఖ్య వస్త్రవ్యాపార కేంద్రం.

రియల్ ఎస్టేట్, రొయ్యలు చేపల సాగు, ఆహార రంగం వేగం గ అభివృద్ధి చెందాయి

దేవాలయాలుసవరించు

  1. కావలి గ్రామ దేవత కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, సర్వాయపాళెంలలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి.
  2. పురాతనమైన బ్రమరాంబా సమేత మల్లీశ్వరాలయం
  3. లక్ష్మీకాంత స్వామి ఆలయం, అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము ఉన్నాయి.
  4. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం, మద్దూరుపాడు.

చిత్రమాలసవరించు

ప్రముఖ వ్యక్తులుసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. http://www.census2011.co.in/data/town/802990-kavali.html.
  3. ఈనాడు నెల్లూరు; 2014,జూన్-16; 4వ పేజీ.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కావలి&oldid=3793157" నుండి వెలికితీశారు