గొట్టేటి దేముడు

గొట్టేటి దేముడు విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన విశాఖపట్నం జిల్లా లోని వెలగలపాలెం లో 1966 జూన్ 1 న జన్మించారు. ఆయన తండ్రి పేరు మల్లయ్య. బి.ఎ వరకు చదివారు. ఆ తరువాత సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. రెండుసార్లు చింతపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. ఆయన భార్య పేరు చెల్లమ్మ.[2]

ఆయన ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సమాఖ్యకు అధ్యక్షునిగానూ, గిరిజన ఆలిండియా ఆర్గనైజేషన్ కు ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఆయన పార్టీ యొక్క స్టేట్ కౌన్సిల్ లో సభ్యునిగా కూడా పనిచేసారు. ఆయన బాక్సైట్ గనుల త్రవ్వకం నకు వ్యతిరేక పోరాటం చేసారు. ఆయన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 2015 సెప్టెంబరు 12 న కొయ్యూరులో నిర్వహించిన గిరిజన సదస్సులో వక్తగా హాజరైనారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పోలీసువారు బాక్సైట్ మైనింగ్ సమస్యను ప్రస్తావించడానికి అనుమతి లేదని మద్యలో ప్రసంగాన్ని ఆపివేసారు[3].

ఆయన అనేక సార్లు అస్వస్థతకు గురైనారు. కొన్ని సంవత్సరముల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనపుడు అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి హైదరాబాదులో మంచి చికిత్సా సౌకర్యాలను కల్పించారు.

అస్తమయం

మార్చు

ఆయన గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ 2015 అక్టోబరు 26 న మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[4][5]

మూలాలు

మార్చు
  1. మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత
  2. Profile of Goddeti Demudu of Paderu Constituency
  3. Former Chintapalli MLA Goddeti Demudu passes away
  4. "ex-chintapalli-legislator-goddeti-demudu-is-no-more". Archived from the original on 2015-10-28. Retrieved 2015-10-28.
  5. The Hindu (26 October 2015). "Former Chintapalli MLA Goddeti Demudu passes away" (in Indian English). Archived from the original on 14 అక్టోబరు 2021. Retrieved 14 October 2021.

ఇతర లింకులు

మార్చు