విశాఖపట్నం జిల్లా
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. ఇచ్చిన కారణం: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన మార్పులు చేయాలి. (ఏప్రిల్ 2022) |
విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఒక జిల్లా. జిల్లా కేంద్రం విశాఖపట్నం. ఇది పూర్తిగా పట్టణ జిల్లా, విస్తీర్ణం పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లా.
విశాఖపట్నం | |
---|---|
![]() | |
![]() | |
Country | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ప్రధాన కేంద్రం | విశాఖపట్నం |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,048 కి.మీ2 (405 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 19,59,500 |
• సాంద్రత | 1,900/కి.మీ2 (4,800/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | +91 0( ) |
18 వ శతాబ్దంలో ఈ ప్రాంతం బ్రిటిషు వారి అధీనంలో ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. ఇంకొంతభాగం 1979 జూన్ 1 న విజయనగరం జిల్లాలో భాగమైంది. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని ప్రాంతాలు అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.
ఈ జిల్లాలో బౌధ్ధమతం వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరం, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. Map
జిల్లా చరిత్రసవరించు
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతపు ప్రస్తావన సా.శ.పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, సా.శ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.
సా.శ. 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగదేశం ఉండేది. ఆ కళింగదేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్టణం ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశం అనే (త్రిలింగదేశం, తెలుగుదేశం) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహిలు, మొగలులు, హైదరాబాదు నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది.[2]
కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 18 వ శతాబ్దంలో ఈ ప్రాంతం బ్రిటిషు వారి అధీనంలో ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. 1941 ఏప్రిల్ 6న జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి అయితే ప్రాణనష్టం జరగలేదు.
1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని ప్రాంతాలు అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.[1][3]
భౌగోళిక స్వరూపంసవరించు
ప్రధాన నదులుసవరించు
రెవెన్యూ డివిజన్లు, మండలాలుసవరించు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత, జిల్లాను రెండు రెవిన్యూ డివిజన్లు, 11 మండలాలుగా విభజించారు.[4]
మండలాలుసవరించు
విశాఖపట్నం (పట్టణ) మండలాన్ని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మధార మండలాలుగా 2022 లో జిల్లాల సవరణలో భాగంగా విభజించారు.
- భీమునిపట్నం రెవెన్యూ డివిజను
- విశాఖపట్న రెవెన్యూ డివిజను
రాజకీయ విభాగాలుసవరించు
లోకసభ నియోజక వర్గాలుసవరించు
శాసనసభ నియోజకవర్గాలుసవరించు
- ఉత్తర విశాఖపట్నం
- గాజువాక
- తూర్పు విశాఖపట్నం
- దక్షిణ విశాఖపట్నం
- పశ్చిమ విశాఖపట్నం
- పెందుర్తి (పాక్షిక) (మిగతా భాగం అనకాపల్లి జిల్లా లో వుంది)
- భీమిలి
స్థానిక సంస్థలుసవరించు
మహా విశాఖ నగరపాలక సంస్థసవరించు
విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. దీనిని 1978 జూన్ 17 నాడు విశాఖపట్నం అర్బన్ డవలప్మెంట్ అధారిటీ (VUDA (వుడా) గా, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టం 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. నగర పాలన విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్సవరించు
ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1920, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టం, 1955 ఆధారంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి. జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం 1968 (లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
విద్యా సౌకర్యాలుసవరించు
ఆంధ్రవిశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల.
వైద్య సౌకర్యాలుసవరించు
పర్యాటక ఆకర్షణలుసవరించు
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్, భీముని పట్టణం వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణంలోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ, తాటి దోనెలలో కొందకర్ల ఆవలో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
చిత్రమాలికసవరించు
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "విశాఖపట్నం జిల్లా జాలస్థలి". కలెక్టరు, విశాఖపట్నం జిల్లా. Archived from the original on 2019-11-05. Retrieved 2019-11-05.
- ↑ "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.
- ↑ "Visakhapatnam district - District handbook of statistics" (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.
Wikimedia Commons has media related to Visakhapatnam district. |