గొడుగు
గొడుగు (ఆంగ్లం Umbrella) ఎండ, వానల నుండి మనల్ని రక్షించుకొనే అవసరమైన సాధనము. ఎండనుండి రక్షించడానికి గతంలో ఎక్కువగా నల్లని గొడుగులు మాత్రమే ఉండేవి. ఇప్పుడివి రంగురంగులలో అందంగా తయారవుతున్నాయి. కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు, పిల్లలు రంగుల గొడుగులు ఇష్టపడతారు. పల్లెల్లో తాటాకులతో గొడుగులు తయారుచేస్తారు.

చరిత్రసవరించు
భారతదేశంలోసవరించు
మహాభారతంలో గొడుగు గురించిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. జమదగ్ని విలువిద్యలో ఆరితేరినవాడు. ఆయన భార్య రేణుక ఆయన వేసిన బాణాలను అతి తక్కువ సమయంలోనే తిరిగి తెచ్చి ఇచ్చేది. కానీ ఒకసారి మాత్రం బాణాలను తెచ్చేందుకు ఒక రోజంతా వెచ్చించవలసి వచ్చింది. ఎండవేడిమి వల్లనే అలా జరిగిందని ఆమె భర్తకు నివేదించింది, అందుకు ఆగ్రహించిన జమదగ్ని సూర్యుడివైపు ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. సూర్యుడు తన పొరపాటును మన్నించమనీ అందుకు పరిహారంగా ఒక గొడుగునూ స్వీకరించమనీ కోరుతాడు.[2]
ఉపయోగాలుసవరించు
- ఉష్ణదేశాలలో మండుటెండలో నీడనిచ్చి సూర్యకిరణాలనుండి రక్షిస్తాయి.
- మంచు, వర్షంలో మనం తడిసిపోకుండా రక్షిస్తాయి.
- సూర్యకిరణాల వల్ల చర్మం నల్లబడకుండా కాపాడుతుంది.
- అప్పుల వాల్లకు మన ముఖం కనబడకుండా గొడుగు చాల ఉపయోగ పడుతుంది.
- పెళ్ళిల్లో కూడా గొడుగుకు చాల ప్రాముఖ్యత ఉంది. పెళ్ళి కొడుకును వేదిక మీదికి తీసుకు రావడానికి గొడుగు పట్టి అతన్ని వేదికమీదికి తీసుక వస్తారు. ఇది ఒక సంప్రదాయము.
జీవశాస్త్రంలోసవరించు
- కొన్ని రకాల చెట్లు, శిలీంద్రాలు గొడుగు ఆకారంలో ఉంటాయి.
ఛాయాచిత్రకళలోసవరించు
ఛాయాచిత్రకళలో దీనిని రిఫ్లెక్టరు అంటారు. ఇది ఒక గొడుగు మాదిరిగా కనిపించి ప్రత్యేకమైన పరికరం. ఇది మెరిసే ఉపరితలాన్ని కలిగి కాంతిని పరావర్తనం చెందించి వస్తువుమీద కేంద్రీకరించేటట్లు చేస్తుంది.
క్రీడలలోసవరించు
పారాచూట్ ఆరుబయట క్రీడలలో ఒక విశిష్టమైన క్రీడ, గాలిలో ప్రయాణించే చాలామంది ప్రాణాలను కాపాడే పరికరం.
మూలాలుసవరించు
- ↑ "Parts of an Umbrella" Archived 2017-07-24 at the Wayback Machine, Carver Umbrellas, February 28, 2007
- ↑ Pattanaik, Devdutt (2003). Indian Mythology. p. 16. ISBN 0892818700.