గొడే సూర్యప్రకాశరావు
గొడే సూర్యప్రకాశరావు (1788-1841) గోడె సంస్థానం లోని పెదజగ్గరాయని కుమరుడు. అతను అనకాపల్లి జమీందారు. అతను గొప్ప సాహిత్య పోషకుడు.అతను సంస్కృతాంద్రములందే కాక ఆంగ్లం నందు గొప్ప పాండిత్యం కలవాడు. పాశ్చాత్య సీమలలో ప్రచలితమైన వాస్తు శాస్త్రం, వృక్షలతాది దోషదశాస్త్రములు విశేషాభినివేశముతో పరిశీలించినవాడు.
ఆంగ్లభాషా నిఘంటు మర్యాదల ప్రకారం సంస్కృతాంధ్రములకు చక్కని నిఘంటువును కూర్చవలసినదిగా అతను తమ అధ్యాపకుడైన శ్రీనివాసాచార్యులకు అభ్యర్తించాడు. దేశ భాషోద్ధారకుడైన, శిష్యుడైన, పోషకుడైన అతని కోర్కెను మన్నించి నిఘంటువునందలి చాలా భాగములను పూతి చేసి చివరి నాలుగయి దక్షరములు రాయవావలసి ఉండగా శ్రీనివాసాచార్యులు మరణించిరి. శ్రీనివాసాచార్యుని పుత్రులు పసివారు. దీనిని పూర్తిచేయు పండితులు కనిపించనందున మిక్కిలి చింతించుచూ 1841లో మరణించాడు.
అతని భార్య జానకయ్యమ్మ. తన భర్త తలపెట్టిన ఉద్యమమును కొనసాగించుటకు నిర్ణయించి శ్రీనివాసాచార్యులవారి కుమారులగు వేంకట రంగాచార్యులు, రామానుజాచార్యులును నియమించి మిగిలిన నిఘంటు భాగాన్ని పూర్తి చేయిందింది. ఇది "సర్వ శబ్దసంబోధిని" అను పేరుతో ప్రచురితమైంది.
అతను అక్కినేపల్లి నృసింహ కవి రచించిన ఓఘవతీ పరిణయము అను నాలుగాశ్వసముల ప్రబంధమునకు సూర్యప్రకాశరావు కృతి భర్త.
పదమూడు జిరాయితీ గ్రామములు, మూడు శ్రోత్రియములు గల అనకాపల్లి సంస్థానము 1802 లో విజయనగరము రాజాగారి వలన కుంపిణీ వారి ఏలుబడిలో ఖరీదు చేయబడినవి. 1810లో సూర్యప్రకాశరావు దీనిని ఖరీదు చేసెను. అతను 1820లో ఏడు జిరాయితీ గ్రామములను, రెండు శ్రోత్రియములను కలిగి, నక్కపల్లి ఎస్టే?టులో నొక భాగమయిన కొరుపోలును, 1822లో చీపురుపల్లి ఎస్టేటులోని నాలుగు ఖండములలో మొదటి ఖండములోని భరణికమును, 1830లో ఎనిమిది జిరాయితీ గ్రామములను, రెండు శ్రోత్రియములను గల మునగపాకను, 1835లో తొమ్మిది జిరాయితీ గ్రామములు గల శ్రీరామపురమును ప్రభుత్వం వారి వేలంలో ఖరీదు చేసాడు. [1]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర సంస్థానములు: సాహిత్య పోషణము (సాహిత్య అకాడమీ బహుమతి పొందిన రచనము) : రచయిత:డా. తూమాటి దోణప్ప,ఎం.ఏ పి.హెచ్.డి