ప్రధాన మెనూను తెరువు

అనకాపల్లి

ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలం లోని పట్టణం
అనకాపల్లి సమీపంలో ప్రఖ్యాత అంశాలు

అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పట్టణం.[1] విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, ఉక్కునగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి కొబ్బరి వ్యాపారానికి మరియు బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.

పట్టణం స్వరూపం, జన విస్తరణసవరించు

అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉంది. అక్షాంశ రేఖాంశాలు17.68° N 83.02° E[2]. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.

 
పట్టణంలో ఒక వీధి
 
పట్టణంలో రావు గోపాల రావూ కళాక్షేత్రం

2001 జనాభా లెక్కల ప్రకారం అనకాపల్లి జనాభా 84,523. ఇందులో ఆడు, మగ వారు సమానంగా (50%) ఉన్నారు. అక్షరాస్యత 67% ఉంది (జాతీయ సగటు 59.5%). ఇక్కడ మగవారిలో 54%, ఆడువారిలో 46% అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 10% వరకు ఆరు సంవత్సరాల లోపు వయసున్నవారు.

చరిత్రసవరించు

ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.

ప్రముఖులుసవరించు

చర్చిలుసవరించు

 • BALL's Home Church
 • Andhra Baptist Church
 • Lutheran Church
 • R C M Church

ఆలయాలుసవరించు

 
అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం
 
పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం
 • అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాతి కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాదికి ము౦దుగా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[3]
 • 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
 • అనకాపల్లి పట్టణానినకి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.[4]
 • అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
 • పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని దేవీపురంలో శ్రీచక్రాకృతిలో విర్మించబడిన రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి చెందినది.[5]
 • మరి కొన్ని ఆలయాలు
  • కమాక్షి ఆలయము
  • గౌరీ పరమేశ్వరాలయము
  • పెదరామస్వామి ఆలయం
  • చిన్నరామస్వామి ఆలయం
  • వెంకటేశ్వరస్వామి ఆలయం.
  • సంతోషీమాత ఆలయం
  • కన్యకా పరమేశ్వరి ఆలయం
  • కాశీ విశ్వనాధ స్వామి ఆలయం
  • భోగ లింగేశ్వర ఆలయం.
  • గాంధీ నగరం వెంకటేశ్వరస్వామి ఆలయం.
  • మరిడీమాంబ ఆలయం.

విద్యా సంస్థలుసవరించు

 • B.J.M Educational Institutions
 • A.M.A.L. (అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి) కాలేజి
 • ఆదినారాయణ మహిళా కళాశాల
 • దాడి వీరునాయుడు డిగ్రీ కాలేజి
 • కొణతల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సు
 • హిమశేఖర్ డిగ్రీ మరియు పి.జి.కాలేజి
 • సాయి కుల్వంత్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజి
 • దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ
 • సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజి
 • సంయుక్త డిగ్రీ కాలేజి, పాఠశాల
 • శ్రీకన్య జూనియర్ కాలేజి
 • A.M.A.A. (అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ఆదినారాయణ) ఇంగ్లీషు మీడియమ్ స్కూలు
 • మునిసిపల్ గవరపాలెం ఉన్నత పాఠశాల
 • మునిసిపల్ ఉన్నత పాఠశాల
 • మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల
 • సంయుక్త ఉన్నత పాఠశాల
 • D.A.V. పబ్లిక్ స్కూలు
 • డైమండ్స్ కాన్వెంట్
 • గుడ్ షెఫర్డ్ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల
 • డా.ఎమ్.వి.వి. సత్యనారాయణ మెమోరియల్ గురజాడ పబ్లిక్ స్కూలు
 • J.M.J. ఉన్నత పాఠశాల
 • ప్రశాంతి నికేతన్
 • బొడ్డెడ గంగాధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంటరాక్టివ్ లెర్నిగ్
 • J.L. ఇంగ్లీషు మీడియమ్ స్కూలు
 • మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ముత్రాసి కాలని
 • దాడి సత్యనారాయణ కాలేజి ఆఫ్ Education (బి.ఇడి)

వ్యవసాయం, నీటి వనరులుసవరించు

ఈ ప్రాంతంలో వరి, చెరకు, కొబ్బరి ముఖ్యమైన పంటలు.

పరిశ్రమలు, వ్యాపారంసవరించు

 
రైల్వే స్టేషను
 • ఆనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది.[ఆధారం చూపాలి]
 • అనకా పల్లి సమీపంలో 'వెలగపూడి స్టీల్ మిల్స్' అనే ఉక్కు పరిశ్రమ ఉంది.[6]
 • అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో 'అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం' ఉంది.
 • చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.
 • విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (సుమారు 15 కి.మీ.)

వైద్య సదుపాయాలుసవరించు

 • ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.[7]

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవిన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.2013 వ సంవత్సరంలో అనకాపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడింది

 
విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లె రెవెన్యూ డివిజన్ (పచ్చ రంగులో)

అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు లోక్ సభ

 • 1952 లంకా సుదరం, మల్లుదొర (?)
 • 1957,1962 మరియు 1967 - మిస్సుల సూర్యనారాయణ మూర్తి.
 • 1971, 1977 మరియు 1980 - ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు
 • 1984 - పి.అప్పల నరసింహం
 • 1989 మరియు 1991 - కొణతల రామకృష్ణ
 • 1996 - చింతకాయల అయ్యన్నపాత్రుడు
 • 1998 - గుడివాడ గురునాధరావు
 • 1999 - గంటా శ్రీనివాసరావు
 • 2004 - పప్పల చలపతిరావు
 • 2009 - సబ్బమ్ హరి

రాజ్యసభ

 • 1953-62 విల్లూరి వెంకట రమణ

= అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నియోజక వర్గం కూడా. పూర్తి వ్యాసం అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

పర్యాటక కేంద్రాలుసవరించు

 
అనకాపల్లిలోని శారదా నదిపై రైల్వే బ్రిడ్జి
 • దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం, తంతడి బీచిలు అందమైనవి.
 • ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,86,937 - పురుషులు 92,727 - స్త్రీలు 94,210
జనాభా (2001) - మొత్తం 1,76,822 - పురుషులు 88,044 - స్త్రీలు 88,778

మూలాలు, వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అనకాపల్లి&oldid=2494665" నుండి వెలికితీశారు