గొర్లె కిరణ్‌కుమార్
గొర్లె కిరణ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
గొర్లె కిరణ్‌కుమార్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 నుండి ప్రస్తుతం | |||
ముందు | కిమిడి కళా వెంకటరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఎచ్చెర్ల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 పాతర్లపల్లి గ్రామం, రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | పరిమళ | ||
బంధువులు | గొర్లె శ్రీరాములనాయుడు | ||
సంతానం | తమన్ వర్థన్ నాయుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుగొర్లె కిరణ్‌కుమార్ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఎం.కామ్ వరకు చదువుకున్నాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుగొర్లె కిరణ్‌కుమార్ పెదనాన్న మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్ గొర్లె శ్రీరాములనాయుడు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. కిరణ్ కుమార్ కు 2009లో ఎమ్మెల్యేగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో చేజారింది. ఆయన 2012లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరాడు, ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు చేతిలో 4,741 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[3]గొర్లె కిరణ్‌కుమార్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు పై 18711 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]ఆయన 13 జూన్ 2019న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశాడు.[6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Etcherla Constituency Winner List in AP Elections 2019". www.sakshi.com. Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
- ↑ Sakshi (18 March 2019). "శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Sakshi (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ సాక్షి (8 April 2019). "అవకాశమిస్తే... అభివృద్ధి చేస్తా." Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
- ↑ The Hindu (23 May 2019). "YSRCP makes inroads into Srikakulam district" (in Indian English). Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
- ↑ సాక్షి (24 May 2019). "ప్రజా విజయ 'కిరణం'". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
- ↑ Sakshi (13 June 2019). "శాసనసభకు ఎన్నికైన మేము..." Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.