గోకుల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మథుర జిల్లాలోని ఒక పట్టణం

గోకుల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మథుర జిల్లాలోని ఒక పట్టణం. మధురకు ఆగ్నేయంగా 15 కిలోమీటర్లు (9.3 మై.) దూరంలో ఉంది. భాగవత పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గోకులంలో గడిపాడు.[1]

గోకుల్
గోకుల్ లోని దేవాయలం
గోకుల్ లోని దేవాయలం
గోకుల్ is located in Uttar Pradesh
గోకుల్
గోకుల్
ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతం
Coordinates: 27°27′N 77°43′E / 27.45°N 77.72°E / 27.45; 77.72
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామథుర జిల్లా
Elevation
163 మీ (535 అ.)
జనాభా
 (2001)
 • Total4,041
Demonymగోకుల్ వాసి
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationయుపి-85

భౌగోళిక శాస్త్రం

మార్చు

ఈ పట్టణం సముద్రమట్టానికి సగటున 163 మీటర్లు (535 అ.) ఎత్తులో ఉంది. 

గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గోకుల్ ప్రాంతంలో 4041 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 55% మంది, స్త్రీలు 45% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 60%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 68% కాగా, స్త్రీల అక్షరాస్యత 49%గా ఉంది. జనాభాలో 18% మంది 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]

ఆసక్తికరమైన ప్రదేశాలు

మార్చు

మహాప్రభు శ్రీమద్ వల్లభాచార్య బైఠక్జీ

మార్చు

శ్రీ వల్లభాచార్య మహాప్రభు గోకుల్, పురుషోత్తముడు శ్రీ కృష్ణుడు లీల చేసిన ప్రదేశాలను తిరిగి కనుగొన్నాడు. అక్కడ బైఠక్జీ అనే రెండు చోట్ల (1. గోవింద్‌ఘాట్ 2. బడి భీతర్ బైఠక్) శ్రీమద్ భగవత్ పారాయణ చేశాడు.

రాజా ఠాకూర్ దేవాలయం

మార్చు

వల్లభ సంప్రదాయ పుష్టిమార్గ్‌లోని ప్రముఖ దేవాలయం. గుసాయిజీకి నిలయంగా ఉంది. స్వయం ప్రకటిత దైవుడైన శ్రీ నవనిట్లాల్ నివసించిన ప్రదేశమిది.

మూలాలు

మార్చు
  1. "Gokul-Lord Krishna's Childhood". greatholidayideas. Archived from the original on 2019-04-12. Retrieved 2022-11-06.
  2. . "India - Census, Standards & Statistics".
"https://te.wikipedia.org/w/index.php?title=గోకుల్&oldid=4055286" నుండి వెలికితీశారు