గోపీనాథము వేంకటకవి

గోపీనాథము వేంకటకవి (1820-1892) ఒక తెలుగు కవి.[1] ఇతడు రచించిన గోపీనాథ రామాయణము ప్రసిద్ధమైనది.

గోపీనాథము వేంకటకవి
జననం1820
మరణం1892
వృత్తిరచయిత, కవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గోపీనాథ రామాయణము

జీవిత విశేషాలు మార్చు

ఈకవి వైదికబ్రాహ్మణుడు; నెల్లూరిమండలములోని కావలి తాలూకాలోని లక్ష్మీపుర గ్రామవాసి. ఇతడు శ్రీ వేంకటగిరి సంస్థానమునందు ఆస్థాన కవీశ్వరుడుగా నుండి ప్రసిద్ధి కెక్కినవాడు. ఆ కాలపు కవులలో నితడు బహుమహాగ్రంథములను రచియించిన వాడు. భాస్కర రామాయణాదులు వాల్మీకి విరచిత మూలగ్రంథానుసారముగా నుండలేదని మూలగ్రంథములో నున్నదానికంటె ఎక్కువకాని తక్కువకాని లేకుండునట్లు సరిగా వాల్మీకి రామాయణము అంతయు ఇతడు పద్యకావ్యముగా జేసెను., నితడు బ్రహ్మకైవర్త పురాణములోని కృష్ణజన్మఖండము నెనిమిదాశ్వాసముల పద్యకావ్యముగాను, మాఘకవి కృత మయిన శిశుపాలవధను నాలుగాశ్వాసముల పద్యకావ్యముగాను, శ్రీ భగవద్గీత ను తెలుగులో రచియించి మెప్పించి వేంకటగిరి సంస్థానాధీశ్వరులచే నొక అగ్రహారమును పొందెను. ఇతని కవిత్వము మొత్తముమీద సలక్షణమై అతికఠినమై హృద్యముగా నుండును.

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. కందుకూరి వీరేశలింగం పంతులు (1911). ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము. రాజమండ్రి: హితకారిణీ సమాజము. p. 255.