గోబ్లిన్ మోడ్ ( goblin mode ) పదాన్ని 2022 ఏడాది మేటి పదం ( వర్డ్ ఆఫ్ ది ఇయర్ ) గా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువును ప్రచురించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2022 డిసెంబర్ 5వ తేదీన ప్రకటించింది.[1] 'గోబ్లిన్ మోడ్' అనే పదం వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. తన గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమది. అపరిశుభ్రత, బద్ధకం, దురాశ ను గోబ్లిన్ మోడ్ అంటారు.[2] ఒక ఏడాదిలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే చర్చించబడే పదాన్ని ఆ ఏడాది పదంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువు ప్రకటిస్తుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ప్యానెల్ నిపుణులే పదాన్ని నిర్ణయిస్తారు. కానీ 2022 సంవత్సరం ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు.

మూలాలు మార్చు

  1. "Oxford word of the year 2022 revealed as 'goblin mode'". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-12-05. Retrieved 2023-03-12.
  2. "'Goblin Mode' is Oxford's Word of the Year for 2022. What does it mean?". The Indian Express (in ఇంగ్లీష్). 2022-12-06. Retrieved 2023-03-12.