2022
2023గ్రెగోరియన్ కాలెండరు సాధారణ సంవత్సరము. 2023 నూతన సంవత్సరం శనివారంతో ప్రారంభం అవుతుంది.
సంఘటనలు
మార్చుజనవరి 2022
మార్చు- జనవరి 2
- ఘోరమైన నిరసనల మధ్య సూడాన్ ప్రధాని అబ్దల్లా హమ్డోక్ రాజీనామా చేశారు.
- జనవరి 5 - 2022 కజఖ్ అశాంతికి ప్రతిస్పందనగా కజకిస్తాన్‌లో దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ప్రధాన మంత్రి అస్కర్ మామిన్ మంత్రివర్గం రాజీనామా చేయగా, అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్ మాజీ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ను తొలగించారు
- జనవరి 7 - కోవిడ్-19 మహమ్మారి : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 300 మిలియన్లను దాటింది.
- జనవరి 9 - ఫిబ్రవరి 6 - 2021 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ కామెరూన్లో జరుగుతుంది, సెనెగల్ వారి మొదటి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది .
- జనవరి 10 - పంది గుండె మానవుడికి మొదటి సారిగా గుండె మార్పిడి విజయవంతమైంది.
- జనవరి 15 - టోంగాలోని జలాంతర్గామి అగ్నిపర్వతం విస్పోటనం చెందింది.
- జనవరి 18 - అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను $68.7 బిలియన్లకు కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.ఈ డీల్ చరిత్రలో ఒక టెక్ కంపెనీకి అతిపెద్ద కొనుగోలు.
- జనవరి 19 – 2022 బార్బాడియన్ సాధారణ ఎన్నికలు : బార్బడోస్ లేబర్ పార్టీ బార్బడోస్ అసెంబ్లీలోని మొత్తం 30 స్థానాలను వరుసగా రెండవసారి గెలుచుకుంది.
- మడగాస్కర్, మలావి, మొజాంబిక్లలో తుఫాను కారణంగా 11 మంది మరణించారు.
- బుర్కినా ఫాసోలో జరిగిన తిరుగుబాటు అధ్యక్షుడు రోచ్ కబోరేను అధికారం నుండి తొలగించింది.దేశంలోని ఇస్లామిక్ మిలిటెంట్ల కార్యకలాపాలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడమే తిరుగుబాటుకు కారణమని బుర్కినాబే మిలిటరీ పేర్కొంది.
- జనవరి 28 – కోవిడ్-19 మహమ్మారి: ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే టీకాల సంఖ్య 10 బిలియన్లకు మించిపోయింది.
- జనవరి 29 – 2022 ఇటాలియన్ అధ్యక్ష ఎన్నికలు : ఇటలీ అధ్యక్షుడిగా సెర్గియో మట్టరెల్లా తిరిగి ఎన్నికయ్యారు.
ఫిబ్రవరి 2022
మార్చు- ఫిబ్రవరి 3 –అబూ ఇబ్రహీం అల్-హషిమి అల్-ఖురాషి వాయవ్య సిరియాలో US ప్రత్యేక దళాలు జరిపిన తీవ్రవాద వ్యతిరేక దాడిలో చంపబడ్డాడు.
- ఫిబ్రవరి 4 - 20 - 2022 వింటర్ ఒలింపిక్స్ చైనాలోని బీజింగ్‌లో జరిగాయి.
- ఫిబ్రవరి 8 - COVID-19 మహమ్మారి : ధ్రువీకరించబడిన కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు నమోదయ్యాయి.
- ఫిబ్రవరి 13 – 2022లో జర్మన్ అధ్యక్షుడిగా ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్మీర్ మళ్లీ ఎన్నికయ్యారు.
- ఫిబ్రవరి 14 - కెనడా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ యాక్ట్‌ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
- ఫిబ్రవరి 21: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.
- ఫిబ్రవరి 23: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంను 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు.
- ఫిబ్రవరి 24:ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రకటన.
మార్చి 2022
మార్చు- మార్చి 1
- 2022 ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర: అత్యవసర ఐక్యరాజ్యసమితి సమావేశంలో సభ్యదేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ, బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి.
- మార్చి 2
- 2022 ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో ఉక్రెయిన్‌లోని పెద్ద నగరమైన ఖెర్సన్ నల్ల సముద్రపు ఓడరేవును స్వాధీనం చేసుకుంది.
- 2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో ఉక్రెయిన్ నుండి ఇతర దేశాలకు లక్షమందికి పైగా శరణార్థులు పారిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదించింది.
- మార్చి 4
- ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో "నకిలీ వార్తలను" వ్యాప్తి చేసినందుకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుందని కొత్త చట్టం బెదిరించడంతో BBC, CNN, అనేక ఇతర విదేశీ వార్తా సంస్థలు రష్యాలో తమ రిపోర్టింగ్‌ను నిలిపివేసాయి.
- మార్చి 5
- 2022 ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది.
- COVID-19 మహమ్మారి : COVID-19 నుండి ప్రపంచ మరణాల సంఖ్య 6 మిలియన్లను అధిగమించింది.
- మార్చి 8
- 2022 ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ఇంధన దిగ్గజం షెల్ ప్రకటించింది.
- మార్చి 19 - 2022 తూర్పు తైమూర్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్ ఓటింగ్ జరిగింది.
ఏప్రిల్ 2022
మార్చు- ఏప్రిల్ 13 - కోవిడ్-19 మహమ్మారి : ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించబడిన కేసుల సంఖ్య 500 మిలియన్లకు నమోదయ్యంది.
- ఏప్రిల్ 20 – 2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నుండి రష్యన్, బెలారసియన్ ఆటగాళ్లు నిషేధించబడ్డారు.
- ఏప్రిల్ 24 – 2022 ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల రెండవ రౌండ్ జరిగింది, ప్రస్తుత ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి ఎన్నికయ్యారు.
మే 2022
మార్చుజూన్ 2022
మార్చు- జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం.
జూలై 2022
మార్చుఆగస్టు 2022
మార్చుసెప్టెంబరు 2022
మార్చుఅక్టోబరు 2022
మార్చు- అక్టోబరు 30 - గుజరాత్‌లోని మోర్బీ తీగల వంతెన ప్రమాదం సంభవించింది.
నవంబరు 2022
మార్చుడిసెంబరు 2022
మార్చుమరణాలు
మార్చుజనవరి - జూన్
మార్చు- జనవరి 3: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)
- జనవిరి 5: నీల్ నాంగ్కిన్రిహ్, భారతీయ సంగీత పియానిస్ట్. (జ.1970)
- జనవరి 8: ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965)
- జనవరి 11: టీవీ నారాయణ, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కారగ్రహీత. (జ.1925)
- జనవరి 14: మల్లాది చంద్రశేఖరశాస్త్రి, ప్రముఖ పండితుడు, పురాణ ప్రవాచకుడు. (జ.1925)
- జనవరి 21: అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941)
- జనవరి 22: థిచ్ నాట్ హన్హ్, వియత్నామీస్ థియాన్ బౌద్ధ సన్యాసి, శాంతి కార్యకర్త. (జ.1926)
- జనవరి 23: ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930)
- జనవరి 24: కడప ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1945)
- జనవరి 28: ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959)
- జనవరి 29: ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. (జ.1926)
- జనవరి 31: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (జ. 1953)
- ఫిబ్రవరి 2: గారపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు. శాసనసభ సభ్యుడు. మాజీమంత్రి.
- ఫిబ్రవరి 5: చందుపట్ల జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి.జె.పి. నాయకుడు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. (జ.1935)
- ఫిబ్రవరి 6: లతా మంగేష్కర్, గాన కోకిల. (జ. 1929)
- ఫిబ్రవరి 7: ప్రవీణ్ కుమార్ సోబ్తీ, హ్యామర్, డిస్క్‌త్రో క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. (జ.1947)
- ఫిబ్రవరి 8: నిమ్మకాయల శ్రీరంగనాథ్, సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు. (జ.1942)
- ఫిబ్రవరి 10: టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924)
- ఫిబ్రవరి 12: పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1950)
- ఫిబ్రవరి 14: ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1944)
- ఫిబ్రవరి 16: నేతి పరమేశ్వర శర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, పరిశోధకుడు. (జ.1928)
- ఫిబ్రవరి 16: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు. (1953)
- ఫిబ్రవరి 17: ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944)
- ఫిబ్రవరి 21: మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు. (జ.1972)
- ఫిబ్రవరి 22: దీప్ సిద్ధూ, మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. (జ.1984)
- ఫిబ్రవరి 24: ఇమ్మడి లక్ష్మయ్య, వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1930)
- మార్చి 4: షేన్ వార్న్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1969)
- మార్చి 4, రాడ్ మార్ష్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను వికెట్ కీపర్‌గా జట్టులో బాగా స్థిరపడ్డాడు. (జ.1947)
- మార్చి 12: కందికొండ యాదగిరి, సినీ గీత రచయిత, కవి, కథకుడు. (జ.1973)
- మార్చి 14: అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953)
- మార్చి 21: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (జ.1950)
- మార్చి 19: మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931)
- మార్చి 23: ఆర్.సి. లహోటి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ.1940)
- మార్చి 23: మడేలిన్ ఆల్బ్రైట్, అమెరికన్ దౌత్యవేత్త, రాజకీయ శాస్త్రవేత్త. (జ.1937)
- మార్చి 24: అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964)
- మార్చి 28: పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935)
- ఏప్రిల్ 15: జీ.వి. శ్రీరామరెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. (జ.1945)
- ఏప్రిల్ 19: తాతినేని రామారావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1938)
- ఏప్రిల్ 21: దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్. (జ.1938)
- ఏప్రిల్ 28: సలీం గౌస్, భారతీయ నటుడు, థియేటర్ డైరెక్టర్, మార్షల్ ఆర్టిస్ట్. (జ.1952)
- ఏప్రిల్ 29: తర్సామీ సింగ్ సైనీ, గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు. (జ.1967)
- మే 7: మోహన్ జునేజా, కన్నడ సినీ నటుడు. (జ.1967)
- మే 8: మహేంద్ర రాజ్, భారతీయ నిర్మాణ ఇంజనీర్, డిజైనర్. సాలార్ జంగ్ మ్యూజియంతో సహా దేశంలోని అనేక భవనాల నిర్మాణ రూపకల్పనకు సహకరించాడు. (జ.1924)
- మే 10: శివకుమార్ శర్మ, భారత సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు. (జ.1938)
- మే 14: ఆండ్రూ సైమండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. (జ.1975)
- మే 28: ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943)
- మే 31: కెకెగా పరిచితుడైన కృష్ణకుమార్ కున్నత్, భారతీయ గాయకుడు. (జ.1968)
- జూన్ 5: మెండు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు.
- జూన్ 6: కొల్లా శ్రీకృష్ణారావు, తెలుగు పద్య కవి, సాహితీవేత్త, పత్రికాసంపాదకుడు.
- జూన్ 9: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (జ. 1949)
- జూన్ 15: త్రినాథ్ రావ్ భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు. (జ.1953)
- జూన్ 27: అంబికా రావు, మలయాళ చలనచిత్ర నటి, సహాయ దర్శకురాలు. (జ.1964)
- జూన్ 28: పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1929)
జూలై - డిసెంబర్
మార్చు- జూలై 6: గౌతంరాజు, తెలుగు సినిమా ఎడిటర్. (జ.1954)
- జూలై 8: షింజో అబే, జపాన్ మాజీ ప్రధాని. (జ.1954)
- జూలై 7: గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత.
- జూలై 7: పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954)
- జూలై 14: ఇవానా ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. (జ.1949)
- జూలై 15: ప్రతాప్ పోతేన్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. (జ.1952)
- జూలై 18: భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940)
- జూలై 23: కార్టూనిస్ట్ పాప ఈనాడు పత్రికలో కార్టూన్లు గీసిన మొదటి తరం కార్టూనిస్టు. (జ.1944)
- జూలై 24: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940)
- ఆగష్టు 1: కె.జె.సారథి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత. (జ.1942)
- ఆగష్టు 5: భీమపాక భూపతిరావు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే.
- ఆగష్టు 12: అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963)
- ఆగష్టు 29: అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950)
- ఆగష్టు 30: మిఖాయిల్ గోర్బచెవ్, చివరి సోవియట్ యూనియన్ నాయకుడు. (జ.1931)
- సెప్టెంబర్ 2: మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936)
- సెప్టెంబర్ 8: ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926)
- సెప్టెంబర్ 9: గన్ను కృష్ణమూర్తి, తెలంగాణ కవి, రచయిత, విమర్శకుడు. (జ.1945)
- సెప్టెంబర్ 10: బి. బి. లాల్, పురాతత్వ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1921)
- సెప్టెంబర్ 11: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940)
- సెప్టెంబర్ 13: జీన్ లూక్ గొడార్డ్, ఫ్రెంచ్-స్విస్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినీ విమర్శకుడు. (జ.1930)
- సెప్టెంబరు 18: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (జ. 1948)
- సెప్టెంబర్ 24: గుజ్జుల నర్సయ్య భారతీయ విద్యావేత్త, విశ్రాంత ఆచార్యుడు. (జ.1942)
- అక్టోబర్ 1: తులసీ తాంతీ, భారతీయ వ్యాపారవేత్త. (జ. 1958)
- అక్టోబర్ 10: ములాయం సింగ్ యాదవ్, భారతీయ రాజకీయవేత్త, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు. (జ.1939)
- అక్టోబర్ 15: కాట్రగడ్డ మురారి, తెలుగు సినిమా నిర్మాత. (జ.1944)
- అక్టోబర్ 16: దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934)
- అక్టోబర్ 18: కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు.
- అక్టోబర్ 26: ఇస్మాయిల్ ష్రాఫ్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1960)
- అక్టోబర్ 30: తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు
- అక్టోబర్ 31: జేజే ఇరానీ, భారతీయ పారిశ్రామికవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1936)
- నవంబర్ 2: చల్లా భగీరథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. (జ.1976)
- నవంబరు 3: కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు.
- నవంబరు 3: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932)
- నవంబర్ 15: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1943)
- నవంబరు 17: జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928)
- నవంబర్ 18: తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944)
- నవంబర్ 19: మదన్, తెలుగు సినీ దర్శకుడు.
- డిసెంబర్ 3: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)
- డిసెంబర్ 23 :కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935)
- డిసెంబర్ 24: తునీషా శర్మ, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. (జ.2002)
- డిసెంబర్ 25: తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944)
- డిసెంబర్ 28: శ్రీభాష్యం విజయసారథి, సంస్కృత కవి, పండితుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1936)
- డిసెంబర్ 28: సిరిసిల్ల రాజేశ్వరి, తెలంగాణకు చెందిన వికలాంగ కవయిత్రి.
- డిసెంబరు 29: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940)
- డిసెంబర్ 31: పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ XVI, క్రైస్తవుల మత గురువు, మాజీ పోప్. (జ.1927)