గోరుగోళ్లు
గోరుగోళ్లు అనేది కాలి లేక చేతి వేళ్ళ గోళ్ళను కత్తిరించుకునేందుకు ఉపయోగించే సాధనం. ఇది మంగలి సామానులో ఒకటిగా ఉండేది. మంగలి వాళ్ళు వెనకటికి గోళ్ళు తీయడానికి ఉపయోగించేవారు. ఇది ఒక ప్రాంతీయ పదము. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉపయోగించేవారు. దీనిని గోరుగిల్లు, గోరుగల్లు అనికూడా అంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న గోరుగోళ్లు (నెయిల్ క్లిపర్స్, బొమ్మ చూడండి ) ఎవరికి వారే తమ గోళ్ళను కత్తిరించుకునే అవకాశం కలిగిస్తున్నాయి.
గోరుగిల్లు (snipper) ఇది చాల పురాతనమైన పరికరము. రైతులు దీనిని వాడుతారు. తమలపాకు తోటలలో రైతులు దీనితో తమల పాకులను కోస్తారు. సామాన్యంగా తమలపాకులను గోరుతో గిల్లి తీయగలిగినంత మెత్తగానే వుంటాయి. కానీ గంటలతరబడి అల గోరుతో తమలపాకులను గోరుతోనే కోయలేరు. కనుక బొటన వ్రేలు పరిమాణంలో వుండే ఒక ఇనుపరేకు పరికరాన్ని బొటన వ్రేలుకు తగిలించుకొని దాని సాయంతో తమలపాకులను కోస్తారు. కనుక గోరుకు నెప్పివుండదు. దీనినే గోరుగిల్లు అని అంటారు.