గోరుమర జాతీయ ఉద్యానవనం
గోరుమర జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురు జిల్లాలోని మల్బజార్ నగరానికి సమీపంలో ఉంది. ప్రధానంగా ఖడ్గమృగాలకు ఇది నెలవు. 2009 సంవత్సరానికి ఈ పార్కు, సంరక్షిత స్థాలాల్లో అతుత్తమమైనదిగా, భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖచే గుర్తింపు పొందింది.[1]
గోరుమర జాతీయ వనం গোরুমারা জাতীয় উদ্যান | |
---|---|
Location | జల్పాయిగురి జిల్లా, పశ్చిమ బెంగాల్ |
Nearest city | మాల్‌బజార్, మైనాగురి జల్పాయిగురి |
Coordinates | 26°42′N 88°48′E / 26.7°N 88.8°E |
Established | 1949 (WLS), 1994 (NP) |
Governing body | భారత ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం |
ముర్తీ నది, రైదాక్ నదుల వరద మైదానాల్లో ఈ పార్కు ఉంది. పార్కు గుండా ప్రవహించే ప్రధానమైన నది జైధాకా. ఇది బ్రహ్మపుత్రా నదికి ఉపనది. ఈ పార్కు జల్దాపారా జాతీయ వనానికి, చప్రమరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికీ చాలా దగ్గరలో ఉంది. ఈ జాతీయ వనం 79.99 చ.కి.మీ. లలో విస్తరించి ఉంది.
మొదట 1949 లో ఈ ఉద్యానవనం వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది కానీ1994 లో ఈ సంరక్షణ కేంద్రాన్ని జాతీయ ఉద్యనవనంగా మార్చారు.
శీతోష్ణస్థితి
మార్చునవంబరు ఫిబ్రవరిల మధ్య ఈ వనంలో ఉష్ణోగ్రత 10 నుండి 21 oC ఉంటుంది. మార్చి ఏప్రిల్ లలో 24-27 oC మధ్య, మే అక్టోబరుల మధ్య 27-37 oC వరకూ ఉంటుంది. సగటు వర్షపాతం 382 సెం.మీ.
సంరక్షణ స్థితి
మార్చుఖద్గమృగాల సంరక్షణ ఈ జాతీయ వనం ప్రధాన ఉద్దేశం. అయితే, వేటాడే పెద్ద జంతువులు లేనందున శాకాహార జంతువుల జనాభా బాగా పెరిగిపోయి జీవ సంతులనం దెబ్బతింది. ఖడ్గమృగాల ఆడ మగల నిష్పత్తి 3:1 గా ఉండాల్సింది పోయి 1:1 గా మారింది. మగ ఖడ్గమృగాలు పెరిగిపోయి, వాటి మధ్య యుద్ధాలకు మరణాలకూ దారితీసింది. గౌర్‌ల సంఖ్య కూడా పెరిగిపోయి, పచ్చిక మేయడం ఎక్కువైపోయింది.
1970 1980 ల్లో జంతువుల వేట ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయి, గోరుమర అత్యంత సురక్షితంగా మారింది. అయితే వనం చుట్టుపట్ల రైలు ప్రమాదాల వలన జంతువులు మరణించడం జరిగేది. 2006 మేలో ఒకే రోజున మూడు వేరువేరు ప్రమాదాల్లో మూడు ఏనుగులు మరణించాయి. వనం అధికారులు, రైల్వేలతో కలిసి దీని నివారణకు చర్యలు తీసుకున్నారు [1]
మూలాలు
మార్చు- ↑ http://www.telegraphindia.com/1100410/jsp/siliguri/story_12323738.jsp Centre says Gorumara best among the wild