గోల్డ్(III)క్లోరైడ్

గోల్డ్ (III) క్లోరైడ్ లేదా గోల్డ్ ట్రైక్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్థం.బంగారం, క్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన రసాయన సమ్మేళన పదార్థం. గోల్డ్(III)క్లోరైడ్ అణుసంకేత ఫార్ములా Au2Cl6. కొన్ని సార్లు దీనిని AuCl3గా పెర్కొనేదరు. గోల్డ్ (III)క్లోరైడ్ పదంలోని III(రోమన్ సంఖ్య) సంయోగ పదార్థంలోని బంగారం పరమాణువు యొక్క +3ఆక్సీకరణ స్థాయిని సూచిస్తున్నది. సాధారణ గోల్డ్ (III)క్లోరైడ్ అనునది సాధారణముగా లభ్యమగు గోల్డ్ క్లోరైడ్. +1 ఆక్సీకరణ స్థితిలో బంగారమున్న గోల్డ్ క్లోరైడ్ ను గోల్డ్(I)క్లోరైడ్ AuCl) అంటారు. బంగారాన్ని అక్వారిజియా(aqua regia)లో కరిగించగా ఏర్పడిన క్లోరోఆరిక్ ఆమ్లాన్ని(HAuCl4). గోల్డ్ క్లోరైడ్ లేదా ఆమ్ల గోల్డ్ ట్రైక్లోరైడ్ అంటారు. గోల్డ్ (III) క్లోరైడ్ లేదా గోల్డ్ ట్రైక్లోరైడ్ అమితంగా అర్ద్రాతాకర్షణ(hygroscopic )కలిగిన రసాయన సంయోగపదార్థం. నీటిలో బాగా కరుగు గుణం కల్గిఉన్నది. అలాగే ఇథనాల్ లో కరుగుతుంది. కాంతి ప్రభావానికి లోనయినను, లేదా 160 °C వద్ద వియోగం చెందును.

గోల్డ్(III)క్లోరైడ్
పేర్లు
IUPAC నామము
Gold(III) trichloride
ఇతర పేర్లు
Auric chloride
Gold trichloride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13453-07-1]
పబ్ కెమ్ 26030
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30076
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య MD5420000
SMILES [Cl-]1.[Cl-]2.[Cl-]([Au+3]1)2
ధర్మములు
AuCl3
(exists as Au2Cl6)
మోలార్ ద్రవ్యరాశి 303.325 g/mol
స్వరూపం Red crystals (anhydrous); golden, yellow crystals (monohydrate)
సాంద్రత 4.7 g/cm3
ద్రవీభవన స్థానం 254 °C (489 °F; 527 K) (decomposes)
68 g/100 ml (cold)
ద్రావణీయత soluble in ether, slightly soluble in liquid ammonia
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic
కోఆర్డినేషన్ జ్యామితి
Square planar
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Irritant
R-పదబంధాలు R36/37/38
S-పదబంధాలు S26 S36
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Gold(I) chloride
Silver(I) chloride
Platinum(II) chloride
Mercury(II) chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

అనార్ద్ర గోల్డ్ ట్రైక్లోరైడ్ రసాయన పదార్థం ఎర్రటి స్పటికాలుగా ఉండును.ఒక జలాణువు(మొనో హైడ్రేటేడ్)కలిగిన అనార్ద్ర గోల్డ్ ట్రైక్లోరైడ్ బంగారు లేదా పసుపురంగు స్పటిక రూపంలో ఉండును.అనార్ద్ర గోల్డ్ ట్రైక్లోరైడ్ అణుభారం 303.325 గ్రాములు/మోల్.సాధారణ ఉష్ణోగ్రత(25 °C)వద్ద గోల్డ్ ట్రైక్లోరైడ్ సాంద్రత 4.7గ్రాములు/సెం.మీ3. గోల్డ్ (III) క్లోరైడ్ ద్రవీభవన స్థానం 254 °C (489 °F; 527K) ఈ ఉష్ణోగ్రతవద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును.

ద్రావణీయత

మార్చు

నీటిలో గోల్డ్ ట్రైక్లోరైడ్ కరుగును.100 మి.లీ నీటిలో 68గ్రాములు గోల్డ్ ట్రైక్లోరైడ్ కరుగుతుంది.ఇథర్ లో కరుగుతుంది.అమ్మోనియాలో స్వల్పంగా కరుగుతుంది.

అణు నిర్మాణం

మార్చు

గోల్డ్ (III) క్లోరైడ్ ఘన, ఆవిరి/వాయు స్థితిలో క్లోరైడ్ బ్రిడ్జిడ్ డైమర్(chloride-bridged)సౌష్టవాన్ని ప్రదర్శించును. గోల్డ్ (III) క్లోరైడ్ యొక్క అణునిర్మాణం అయోడిన్ (III) క్లోరైడ్‌ను పోలి ఉంది.

ఉత్పత్తి

మార్చు

180 °C వద్ద బంగారపు రజను పై క్లోరిన్ వాయువును ప్రసరింపచెయ్యడం ద్వారా గోల్డ్(III) క్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు[1] .

2Au + 3Cl2 → 2AuCl3

Au3+ speciesను క్లోరైడులతో చర్య జరిపించి టెట్రా క్లోరోఆరేట్ (tetrachloroaurate)ను ఉత్పత్తిచేసి, తరువాత దీని ఆమ్లం,క్లోరోఆరిక్ ఆమ్లాన్నివేడి చేసి హైడ్రోజన్ క్లోరైడ్‌ను తొలగించి ఉత్పత్తి చెయ్యుదురు. ఆక్వారిజియా ఆమ్లంతో బంగారాన్ని చర్య జరిపించడం వలన కూడా గోల్డ్(III)క్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు

Au(s) + 3 NO−3(aq) + 6 H+(aq) Au3+(aq) + 3 NO2(g) + 3 H2O(l)
Au3+(aq) + 3 NOCl(g) + 3 NO−3(aq) → AuCl3(aq) + 6 NO2(g)
AuCl3(aq) + Cl(aq) AuCl−4(aq)

2 HAuCl4(s) → Au2Cl6(s) + 2 HCl(g)

రసాయన చర్యలు

మార్చు

గోల్డ్ (III) క్లోరైడ్ నీటితో సంపర్కం పొందటంవలన/చర్య జరపడం వలన అసిడిక్ హైడ్రేట్స్, కంజుగేటేడ్ క్షారము[AuCl3(OH)] ఏర్పడును.ఇలాఏర్పడిన[AuCl3(OH)]ను Fe2+తో క్షయికరణ కావించడం వలన,ద్రవాణంలోబంగారం అవక్షేపంగా ఏర్పడును.

అనార్ద్ర (Anhydrous) AuCl3 సంయోగ పదార్థం 160 °C వద్ద AuCl గా వియోగం చెందును.ఇలాఏర్పడిన AuCl అధిక ఉష్ణోగ్రత వద్ద డిస్ ప్రపోర్షనేసన్(disproportionation =ఏక కాలంలో ఆక్సీకరణ ఆతరువాత క్షయికరనాచెందుట)వలన బంగారం, AuCl3ను ఏర్పరచును.

AuCl3 → AuCl + Cl2 (>160 °C)
3 AuCl → AuCl3 + 2 Au (>420 °C)

గోల్డ్ (III) క్లోరైడ్ ఒక లేవిస్ ఆమ్లం(Lewis acidic), అందువలన సంక్లిష్ట సమ్మేళనాలనుఏర్పరచును.ఇది హైడ్రో క్లోరిక్ ఆమ్లంతో చర్యజరిపి క్లోరోఆరిక్ ఆమ్లాన్ని ఏర్పరచును(HAuCl4)

HCl + AuCl3 (aq) → H+ + [AuCl4]

పొటాసియం క్లోరైడ్ వంటి ఇతర క్లోరైడ్ రసాయనాలు AuCl3ను AuCl4గా మార్చును.సజల గోల్డ్ (III) క్లోరైడ్ సజల క్షారాలతో (సోడియం హైడ్రాక్సైడ్)వంటి చర్య వలన Au(OH)3ను అవక్షెపముగా ఏర్పరచును.ఇలా ఏర్పడిన, Au(OH)3 అధిక సోడియం హైడ్రాక్సైడ్లో కరగడం వలన సోడియం ఆరేట్(NaAuO2)ను ఏర్పరచును.NaAuO2) ను నెమ్మదిగా వేడి చేసిన ఇది బంగారం, గోల్డ్ (III)ఆక్సైడ్(Au2O3)గా వియోగం చెందును. గోల్డ్ (III) క్లోరైడ్ ఇతర గోల్డ్ సంయోగ పదార్థం ల ఉత్పత్తికి ప్రారంభ పదార్థం. గోల్డ్ (III) క్లోరైడ్ పొటాషియం సైనైడ్తో రసాయన చర్య వలన, నీటిలో కరుగు K[Au(CN)4] ఏర్పడును.

AuCl3 + 4 KCN → K[Au(CN)4] + 3 KCl

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Egon Wiberg; Nils Wiberg; A. F. Holleman (2001). Inorganic Chemistry (101 ed.). Academic Press. pp. 1286–1287. ISBN 0-12-352651-5.