గోల్ఫ్
గోల్ఫ్ అనేది క్లబ్ అనే పేరుగల బ్యాటు, బంతితో ఆడే ఒక క్రీడ. ఈ ఆటలో ఒక పెద్ద మైదానంలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. క్లబ్ సహాయంతో బంతిని వీలైనన్ని తక్కువ సార్లు కొట్టడం ద్వారా రంధ్రాల్లో పడేలా చేయాలి. బంతితో ఆడే ఇతర ఆటల్లాగా గోల్ఫ్ కు ప్రామాణికమైన స్థలం (కోర్టు) ఉండదు. ఈ ఆటను గోల్ఫ్ కోర్స్ అనే పెద్ద పెద్ద మైదానాల్లో ఆడతారు. ఈ కోర్సుల్లో 18 లేదా 9 హోల్స్ (రంధ్రాలు) ఉంటాయి. ఆటగాడు అతి తక్కువ స్ట్రోక్స్ లో బంతిని హోల్ లో పడేలా చేయాలి. దీనినే స్ట్రోక్ ప్లే అంటారు. ఈ క్రీడ ఆధునిక రూపానికి చెందిన మూలాలు 15వ శతాబ్దంలో స్కాట్లాండ్ లో ఉన్నాయి.
అత్యున్నత పాలక సంస్థ | The R&A USGA IGF |
---|---|
మొదటిసారి ఆడినది | 15వ శతాబ్దం, స్కాట్లాండ్ సామ్రాజ్యం |
లక్షణాలు | |
సంప్రదింపు | No |
రకం | పచ్చిక బయలు |
ఉపకరణాలు | గోల్ఫ్ బంతి, గోల్ఫ్ క్లబ్, టీ |
పదకోశం | Glossary of golf |
Presence | |
ఒలింపిక్ | 1900 వేసవి ఒలింపిక్స్, 1904 వేసవి ఒలింపిక్స్, 2016 వేసవి ఒలింపిక్స్,[1] 2020[2] |
మూలాలు
మార్చు- ↑ "Olympic sports of the past". Olympic Movement. Retrieved 29 March 2009.
- ↑ Associated Press file (9 October 2009). "Golf, rugby make Olympic roster for 2016, 2020". cleveland.com. Retrieved 23 September 2010.