గోవర్ధన్ లాల్ ఓజా

భారత న్యాయమూర్తి

గోవర్ధన్ లాల్ ఓజా లేదా జి. ఎల్. ఓజా ఒక భారతీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, స్వాతంత్ర్యోద్యమకారుడు.[1]

గోవర్ధన్ లాల్ ఓజా
జననం12 డిసెంబర్ 1924
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య సమరయోధుడు,న్యాయమూర్తి

ప్రారంభ జీవితం

మార్చు

ఓజా 12 డిసెంబర్ 1924లో బ్రిటిష్ ఇండియాలోని ఉజ్జయినిలో జన్మించాడు. అతని తండ్రి శ్రీ జమ్నాలాల్జీ ఓజా ఒక సామాజిక కార్యకర్త. ఓజా ఉజ్జయినిలోని ప్రభుత్వ మాధవ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించాడు. ఇతను విద్యార్థి జీవితంలోనే విద్యార్థి రాజకీయాలు, మహాత్మా గాంధీ నేతృత్వంలోని క్విట్ ఇండియా ఉద్యమంలలో చురుకుగా పాల్గొన్నాడు. అతను భారత స్వాతంత్ర్యం సమయంలో హోల్కర్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలంటూ ఆ రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో చేరాడు.[1]

వృత్తి జీవితం

మార్చు

ఓజా 1948లో ఇండోర్ కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. అతను 1952 డిసెంబర్లో బర్మాలోని రంగూన్‌లో జరిగిన ఆసియా సోషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యాడు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ విషయాలపై సాధన చేశాడు. ఓజా చురుకైన రాజకీయ కార్యకర్త, బెంచ్‌కి ఎదగడానికి ముందు ఇండోర్‌లో వివిధ ముఖ్యమైన, రాజకీయ కేసులలో పనిచేశాడు. అతను 1968 జూలై 29న జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. తర్వాత 1984 జనవరి 3న మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. 1984 డిసెంబర్లో అదే హైకోర్టుకు శాశ్వత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అతను 1985 అక్టోబరు 29న భారత సర్వోన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 11 డిసెంబర్ 1989న పదవీ విరమణ చేశాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Chief Justice & Judges". supremecourtofindia.nic.in. Retrieved 15 November 2018.
  2. "Name of Chief Justice". Retrieved 15 November 2018.
  3. "Why Justice G.P.Singh-one of the Finest Judges in India-not elevated to SC; Justice Katju reveals the reason". LiveLaw.in. 30 July 2014. Retrieved 7 June 2019.