గోవిందప్ప వెంకటస్వామి

గోవిందప్ప వెంకటస్వామి (1918 అక్టోబర్ 1 – 2006 జూలై 7) భారతీయ నేత్రవైద్య నిపుణుడు, అంధత్వాన్ని నివారించడం కోసం కృషిచేసిన సామాజిక సేవకుడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నేత్రవైద్య సంస్థ అయిన అరవింద్ ఐ హాస్పిటల్ నిర్మాత.[1] లక్షలమంది కంటిచూపును తిరిగి తెచ్చిన అత్యున్నత నాణ్యత, అతి ఎక్కువమందికి మద్దతు ఇవ్వగలిగిన అతి తక్కువ ఖరీదైన డెలివరీ మోడల్ తయారుచేసిన వైద్యునిగా ప్రఖ్యాతిగాంచాడు. లాభాపేక్ష రహిత సంస్థగా నమోదైన అరవింద్ ఐ కేర్ సిస్టమ్ ప్రారంభం నుంచి 5 కోట్ల 50 లక్షల మంది రోగులకు వైద్యం అందించి, 68 లక్షల శస్త్రచికిత్సలు చేసింది.[2]

గోవిందప్ప వెంకటస్వామి
గోవిందప్ప వెంకటస్వామి
జననం
ముత్తుస్వామి వేణుగోపాల్

(1918-10-01)1918 అక్టోబరు 1
మరణం2006 జూలై 7(2006-07-07) (వయసు 87)
మదురై, తమిళనాడు, భారతదేశం

సంస్థ రోగుల్లో 50 శాతం మంది ఉచితంగానో, భారీ సబ్సిడీ రేట్లతోనో వైద్యం అందుకుంటారు. అందుకున్న వైద్యానికి డబ్బు చెల్లించడానికి కొందరు రోగులు సిద్ధపడతారు. వారి నుంచి వచ్చే మొత్తాలు సబ్సిడీకి ఉపయోగపడతాయి.

మూలాలు మార్చు

  1. Rosenberg, Tina (January 16, 2013). "A Hospital Network With a Vision". New York Times (in ఇంగ్లీష్). Retrieved 2018-09-28.
  2. Mehta, Pavithra; Shenoy, Suchitra (2012). Infinite Vision: How Aravind Because the World's Greatest Business Case for Compassion. India: Harper Collins India. pp. 289, 290. ISBN 9350292130.