గోసంగి కులం
గోసంగి కులం ఒక జానపదా కళాకారుల కులం. ఈ కులం వారు జీవనోపాధికై రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం లాంటి కథలను బుర్రకథలో రూపంలో చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలో పలుచోట్ల ఈ సాంస్కృతిక వ్యవస్థ కొనసాగుతోంది. వీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగానూ, రాయలసీమలో మధ్యమంగానూ, ఆంధ్రా ప్రాంతంలో తక్కువగానూ ఉన్నారు. తెలంగాణలో గోసంగి కులం పేరుతో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇంచుమించు లక్ష కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. రాయలసీమ, ఆంధ్రాలో వివిధరకాల ఆశ్రీత కులాలకు చెందిన పేర్లతో వీరు జీవనం కొనసాగిస్తున్నారు.
చరిత్రసవరించు
వందల ఏండ్ల నుంచి వీరు జానపద కళలను ప్రదర్శిస్తున్నారు. వీరికి స్థిర నివాసం లేదు. జీవనోపాధికి అనేక మార్గాలను ఏర్పాటుచేసుకోటం వీరి విద్య. వీరిలో ఐక్యత కూడా అంతంత మాత్రమే. వీరు బిచ్చమెత్తుకుని, పొట్ట పోసుకుంటూ అంటరానివారుగా పల్లెల్లో, పట్టణాల్లో కూడా బానిసలుగా బతుకుతున్నారు. వీరికి ప్రధానమైన వృత్తి లేదు. ఏ వృత్తిని అవలంబించినా భిక్షాటనం చేయడం పరిపాటి. గోసంగి కళాకారులను ‘గోసం వారని, గాసం వా రని, గోసికె వారని, గుడిసెల వారు అని, శారద కాండ్లు, కాటి పాపల వారని, బహురూపుల వారని, బాలసంతుల వారని, బుడిగె జంగాలని, బవనీల, బైండ్లవారని- ఇలా అనేక పేర్లతో వీరిని పిలువడం వ్యవహారం లో ఉంది. తాము ఏదైతే వృత్తిని స్వీక రించి జీవన ప్రధాన మార్గంగా చేసు కొని అడుక్కుంటారో వారిని అదే కుల స్థులుగా వ్యవహరించటం రివాజు. తాము జీవనం కొనసాగించే వృత్తినే కులంగా చెప్పుకుని జీవించడం వల న ఇప్పుడు ‘గోసంగి’ కులం వారు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వానికి వీరిని మొదటగా ఏ కులంలో చేర్చాలో తెలియలేదు. కొంతకాలం తర్వాత వీరిని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చింది. సమాజంలో వీరు గ్రామానికి దూరంగా చిన్న చిన్న గుడిసెలను వేసుకుని నివసిస్తారు. జానపద కళలను ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతారు. తమ సంతానానికి కూడా కళలను నేర్పించి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతుంటారు.
జానపద కళలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల, వీరు కళలకు దూరమై సాధారణ జన జీవనానికి అలవాటు పడ్డారు. వీరి అభివృద్ధి గురించి వీరి వేషభాషణాదులమీద గనిశెట్టి రాములు ‘చీకటి బ్రతుకుల్లో గోసంగిలు’ (2004) అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో గోసంగిలు వాడే కోడ్ భాషను మిర్యాల సాయులు చేసిన అనువాదంకూడా ఉంది.
వీరు ఏ చిన్న గొడవ వచ్చినా వాటిని పెద్దవి చేసుకొని పంచాయితీలు పెట్టుకుని పరిష్కారం చేసుకుంటారు.
తెలంగాణలో గనిశెట్టి రాములు, మిర్యాల సాయిలు, విభూతి శంకర్, ఇ.ఎం. గంగాధర్, గంగమల్లు, బాలయ్య, పోశెట్టి, సాయన్న, గంగయ్య అబ్బయ్య, మల్లయ్య, సదుల కిష్టయ్య రాములమ్మ, లక్ష్మి మొదలగు వారు గోసంగిల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిలో ముఖ్యులు. రాయలసీమలో మారయ్య, పెంటయ్య, రాసారి ఇస్తారె, ఆంధ్రాలో భూమయ్య, దశరథ్, కిషన్, రాజలింగం, పరశురాం, బుద్ధి రాజు, పంతుకుమార్ తదితరులు కూడా వీరి అభివృద్ధిలో కొనసాగుతున్నారు.
వర్గీకరణసవరించు
- కూచిపూడి
- చెంచు భాగోతం
- భామాకలాపం
- బుర్రకథ
- తోలుబొమ్మలాట
- వీరనాట్యం
- బుట్ట బొమ్మలు
- డప్పు
- తప్పెట గుళ్ళు
- కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం
- లంబాడీ
- బోనాలు
- ధింసా
- కోలాటం
- జ్యోతి నృత్యం
- అకథ (పందిరిపాలు )
- ఉరుము నృత్యం
- కత్తిసాము
- కర్రసాము
- కొమ్ము కథ
- కొమ్ము బూరలు
- కొమ్ముల నృత్యం లేదా రేలా
- గరగ
- గరిడి
- ఒగ్గు కథ
- గురవయ్యలు
- గొండ్లి నాట్యం
- గొల్ల సుద్దులు
- చెక్కభజన
- యక్షగానం
- చిందు యక్షగానం
- చెంచు భాగవతం
- చెక్కబొమ్మలాట
- జడకోలాటం (కులుకుభజన )
- జిక్కికి
- డప్పులు
- తంబుర (కడ్డీ తంత్రి )
- పగటి వేషాలు
- పల్లెసుద్దులు
- పులివేషాలు
- పెద్దపులి వేషం
- పొంబల వాయిద్యం
- మరగాళ్ళు
- రాయలసీమ కొరవయ్యలు
- లవకుశ
- వగ్గుడోళ్ళు
- వీధి బాగోతం
- వీరనాట్యం
- వీరభద్రులు
- కాళీమాత
- కలంకారీ
- కుర్రు నృత్యం
- సిద్ధి నృత్యం
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- తెలంగాణలో గనిశెట్టి రాములు, ‘చీకటి బ్రతుకుల్లో గోసంగిలు’ (2004) అనే ఒక పుస్తకం
- తెలుగువారి జానపద కళారూపాలు - కళప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి