గోస్తని నది

(గోస్తనీనది నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్తని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకుఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలో ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.

భీమిలీ వద్ద గోస్తని నది
గోస్తని నది పై తాటిపూడి ప్రాజెక్టు

గోస్తని నదిపై నిర్మించిన ప్రాజెక్టులు

మార్చు

తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద 1963-68 మధ్యకాలంలో[1] నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉంది. విజయనగరం జిల్లాలో15, 378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం, విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Irrigation profile of Vizianagaram district.Thatipudi Reservoir Project". Archived from the original on 2007-09-28. Retrieved 2008-08-08.