గౌరీ జి. కిషన్
గౌరీ జి. కిషన్ (జననం: ) భారతీయ సినీనటి. తమిళం, మలయాళం తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఆమె '96 (2018) తమిళ చిత్రంలో త్రిష పాత్ర జాను చిన్నప్పటి వెర్షన్ తో ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ చిత్రానికి తెలుగు రీమేక్ అయిన జాను లోనూ నటించి మెప్పించింది.[2]
గౌరీ గీత | |
---|---|
జననం | [1] అదూర్, కేరళ, భారతదేశం | 1999 ఆగస్టు 17
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | '96 (తమిళం), జాను (తెలుగు) |
తల్లిదండ్రులు |
|
బంధువులు | గోవింద్ జి. కిషన్ (సోదరుడు) |
వ్యక్తిగత జీవితం
మార్చుగౌరీ జి. కిషన్ తల్లి వైకోమ్‌కు చెందినది కాగా తండ్రి అదూర్, పతనంతిట్టకు చెందినవాడు. ఆమె మాతృభాష మలయాళం. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది. ఆమె 2020లో బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుండి ట్రిపుల్ మేజర్ (జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్) గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించింది.
కెరీర్
మార్చుగౌరీ జి. కిషన్ 12వ తరగతి చదువుతుండగా తమిళ భాషా చిత్రం '96 (2018)లో త్రిష పాత్ర జాను చిన్న పాత్రను పోషించింది.[2][3][4][5] ఈ చిత్రంలో ఆమె నటనకు సానుకూల సమీక్షలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి.[6][7][8] ఆమె 2019లో మార్గంకాళి (2019)తో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టింది.[9] అదే సంవత్సరం, ఆమె తన స్నేహితుడు సర్జానో ఖలీద్‌తో కలిసి గీత రచయిత వినాయక్ శశికుమార్ దర్శకత్వం వహించిన హాయ్ హలో కాదల్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.[10] ఆమె తెలుగు అరంగేట్రం చేసిన చిత్రం జాను (2020), ఇందులో జాను పాత్రను తిరిగి పోషించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.[11][12] మాస్టర్ (2021)లో కాలేజీ విద్యార్థినిగా నటించింది.[9][13] సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్‌తో కర్ణన్ చిత్రంలో కూడా ఆమె నటించింది. ఆమె రజిషా విజయన్, లక్ష్మి ప్రియా చంద్రమౌళితో పాటు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ఈలోగా కరోనా మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో ఆమె ఇంటి వద్దే మరియాద కన్నీర్ ఇల్లై అనే మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్‌ను చిత్రీకరించింది. ఇది సోనీ మ్యూజిక్ సౌత్ ద్వారా విడుదలైంది.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చు† | ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది |
Year | Title | Role (s) | Language (s) | Notes | Ref. |
---|---|---|---|---|---|
2018 | '96 | జానకి | తమిళం | తొలి చిత్రం - తమిళం | [4] |
2019 | మార్గంకాళి | జెస్సీ | మలయాళం | తొలి చిత్రం - మలయాళం | [14] |
2020 | జాను | జానకి | తెలుగు | తొలి చిత్రం - తెలుగు | [15] |
2021 | మాస్టర్ | సవిత | తమిళం | [16] | |
కర్ణన్ | పోజిలాల్ | తమిళం | [17] | ||
అనుగ్రహీతన్ ఆంటోని | సంజనా మాధవన్ | మలయాళం | [18] | ||
2022 | పుతం పుధు కాళై | కుయిలి | తమిళం | ఆంథాలజీ సిరీస్; విభాగం: ముగకవాస ముతం | [19] |
శ్రీదేవి శోభన్ బాబు† | తెలుగు | చిత్రీకరణలో ఉంది | [20] | ||
బిగినింగ్† | తమిళం | చిత్రీకరణలో ఉంది |
వెబ్ సిరీస్
మార్చుYear | Title | Role | Launguage | Stereaming platform | Notes | Ref. |
---|---|---|---|---|---|---|
2022 | పేపర్ రాకెట్ | చారు | తమిళం | జీ5 | డిజిటల్ అరంగేట్రం | [21] |
మ్యూజిక్ వీడియోలు
మార్చుYear | Album | Role | Composed By | Label | Language | Ref. |
---|---|---|---|---|---|---|
2019 | హాయ్ హలో కాదల్ | శృతి దాస్ | వినాయక్ శశికుమార్ | యూట్యూబ్ | మలయాళం | |
2020 | మారయ్యద కనీర్ ఇల్లై | జెన్ మార్టిన్ | సోనీ మ్యూజిక్ సౌత్ | తమిళం | ||
2021 | మాగిజిని | ఆమెనే | గోవింద్ వసంత | సరేగామ ఒరిజినల్స్ | తమిళం | [22] |
2022 | మొజిగల్ న్జన్ వారికల్ నీ | బాసిల్ వి ఎడపాడు | బిహైండ్ వుడ్స్ | మలయాళం |
అవార్డులు, నామినేషన్లు
మార్చుYear | Award | Category | Film | Result | Ref. |
---|---|---|---|---|---|
2018 | బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ | ఉత్తమ అరంగేట్రం | '96 | విజేత | [23] |
ఎడిసన్ అవార్డులు | నామినేటెడ్ | [24] | |||
వికటన్ అవార్డులు | నామినేటెడ్ | ||||
8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | నామినేటెడ్ | [25] | |||
2021 | 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటి - తెలుగు | జాను | నామినేటెడ్ | [26] |
2022 | ఎడిసన్ అవార్డులు | ఉత్తమ క్యారెక్టర్ రోల్ - ఫిమేల్ | కర్ణన్ | విజేత |
మూలాలు
మార్చు- ↑ "Gouri G Kishan on Instagram: "Feeling 21 and oh-so-loved 🥰 Thank you for all the lovely warm wishes on my birthday 💕 •17/08/99•"". Instagram (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
- ↑ 2.0 2.1 M.G, Gokul (5 November 2018). "Dazzling debut". Deccan Chronicle.
- ↑ "அந்த வாழ்த்து ரொம்ப சர்ப்ரைஸ் - கெளரி கிஷன் [That greeting is a big surprise – Gouri Kishan]". Vikatan (in తమిళము). 15 October 2018.
- ↑ 4.0 4.1 Anand, Shilpa Nair (27 October 2018). "A sweetheart called JANU". The Hindu.
- ↑ "தளபதி விஜய் பயங்கரமா கலாய்ப்பார், குழந்தைனு செல்லமா கூப்பிடுவார் [Thalapathy jokes around a lot and calls me a child in a charismatic manner] – 96 Gouri – Vijay – Vijaysethupathi". Vikatan (in తమిళము). 14 March 2020.
- ↑ "96 Movie Review {3.5/5}: 96 taps into nostalgia to leave us with a high that only happy associations with our past can evoke". The Times of India. 4 October 2018.
- ↑ K., Janani (4 October 2018). "96 Movie Review: Vijay Sethupathi and Trisha shine in poignant love story". India Today.
- ↑ "'96' fame Gouri clicks a selfie with Suraj Venjarammoodu". The Times of India. 26 February 2019. Retrieved 1 July 2020.
- ↑ 9.0 9.1 "Thalapathy 64: Gouri Kishan roped in for Thalapathy Vijay's film with Lokesh Kanagaraj – Times of India". The Times of India. 30 October 2019.
- ↑ "Sharing screen space with Vijay sir is a dream come true: Gouri – Times of India". The Times of India. 3 March 2020.
- ↑ "Jaanu Movie Review {3.5/5}: This is not a feel-good film because it's much heftier than that". The Times of India. 7 February 2020.
- ↑ "Jaanu review: Samantha Akkineni, Sharwanand honour the memory of 96". Indian Express. 8 February 2020.
- ↑ "Singles' guide for Indians to navigate new rules of dating in 2020". The News Minute. 3 December 2020.
- ↑ Mathews, Anna (20 July 2019). "Margamkali song is a sweet, romantic number – Times of India". The Times of India.
- ↑ "Gouri Kishan to play a role in Jaanu – Times of India". The Times of India. 8 January 2020.
- ↑ Anandapriya, S. (16 March 2020). "விஜய் சார் என்னைக் 'கொழந்த'னு கூப்பிடுவார்; ஏன்னா?!" - 'மாஸ்டர்' கௌரி கிஷன் [Vijay sir would call me kid, why? - 'Master' Gouri Kishan]". Vikatan (in తమిళము).
- ↑ "'96' and 'Master' actress joins Dhanush's film – Times of India". The Times of India. 19 February 2020.
- ↑ Soman, Deepa (24 November 2019). "Gouri Kishan: I was happy Vijay sir recognised me on set, though I have done only one film – Times of India". The Times of India.
- ↑ Praveen Sudevan (14 January 2022). "'Putham Pudhu Kaalai Vidiyaadhaa…' review: Three hits and two misses in this anthology of hope". The Hindu.
- ↑ "Gouri Kishan to make Telugu debut with Sushmita Konidela's Sridevi Shoban Babu". New Minute. 21 August 2021.
- ↑ "Paper Rocket to stream on Zee5 from this date". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-07-21.
- ↑ "'Magizhini,' first Tamil LGBTQ song goes viral". UDAYAVANI. 27 November 2021.
- ↑ "Gouri Kishan – Best Debut Actor | Female | List of winners for BGM Iconic Edition". Behindwoods. 16 December 2018.
- ↑ "13th Annual Edison Awards". Edison Awards. 2019. Archived from the original on 2019-12-19. Retrieved 2022-09-01.
- ↑ "SIIMA AWARDS | 2018 | winners | |". SIIMA. 2019. Archived from the original on 4 June 2020. Retrieved 8 May 2020.
- ↑ "Dhanush, Manju Warrier, Chetan Kumar, others: SIIMA Awards announces nominees". The News Minute (in ఇంగ్లీష్). 2021-08-28. Retrieved 2021-09-06.