జాను ఒక తెలుగు ప్రేమ కథా చిత్రం. ఇది తమిళంలో వచ్చిన '96 చిత్రానికి రీమేక్. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించారు. దిల్ రాజు "శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్" పై నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్, సమంత కథానాయకానాయికలుగా నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 2020 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శర్వానంద్, సమంతల నటన ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ప్రేక్షకుల వద్ద మంచి ప్రశంసలు పొందింది. [2]

జాను
సినిమా పోస్టర్
దర్శకత్వంసి.ప్రేమ్‌ కుమార్‌
రచనసి. ప్రేమ్ కుమార్
మిర్చి కిరణ్ డైలాగ్స్
నిర్మాతదిల్ రాజు , శిరీష్‌
తారాగణంశర్వానంద్, సమంత
ఛాయాగ్రహణంమహేంద్రన్ జయరాజు
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
2020 ఫిబ్రవరి 7 (2020-02-07) [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

రీమేక్ చిత్రం మార్చు

తమిళ సంచలనం సృష్టించిన క్లాసిక్‌ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో ‘99’గా రీమేక్ అయింది. దీంతో నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను తెలుగలో రీమేక్ చేయాలనుకున్నారు.[3]

కథ మార్చు

కే.రామచంద్రన్‌ (శర్వానంద్‌) ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌. ఓ జర్నీలో చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరికి వెళతాడు. అక్కడ ఒక్కొక్కటిగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తను చదువుకున్న స్కూల్‌ దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలోనే తొలిప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు మెదులుతాయి. జానకీ దేవీ (సమంత)తో ప్రేమలో పడటం.ఆమెతో గడిపిన మధుర క్షణాలు.విడిపోవటం! అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకునే కొన్ని పరిణామాలతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత స్కూల్‌ ఫ్రెండ్స్‌ ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు? సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఓ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి? అన్నదే మిగతా కథ.[4]

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • ది లైఫ్ రామ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ప్రదీప్ కుమార్
  • ప్రణం, రచన: శ్రీమణి , గానం. చిన్మయి , గౌతమ్ భరద్వాజ్
  • ఊహలే , రచన: శ్రీమణి, గానం.చిన్మయి, గోవింద్ వసంత
  • నీ కలే కలి , రచన: శ్రీమణి, గానం.బ్రిందా
  • ఇంతేనా, రచన: శ్రీమణి , గానం.చిన్మయి
  • కొమ్మ వీడి , రచన: శ్రీమణి, గానం. చిన్మయి, గోవింద్ వసంత
  • అనంతం , రచన: శ్రీమణి, గానం. చిన్మయి, గోవింద్ వసంత.

మూలాలు మార్చు

  1. "Sharwanand and Samantha's 'Jaanu' will hit screens soon - Times of India". The Times of India. Archived from the original on 2020-01-19. Retrieved 2020-01-31.
  2. "A tribute to unconditional love..." Twitter (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  3. BBC News తెలుగు (2020-02-07). "జాను సినిమా రివ్యూ: ఈ రీమేక్ చిత్రం తమిళ '96'లోని ఒరిజినల్ ఫీల్ క్యారీ చేయగలిగిందా?". BBC News తెలుగు. Archived from the original on 2021-05-31. Retrieved 2021-05-31.
  4. "'జాను' మూవీ రివ్యూ". Sakshi. 2020-02-07. Retrieved 2020-02-26.