గ్రహం (జ్యోతిష్యం)
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
జ్యోతిషంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.జ్యోతిషంలో సూర్యుని రవిగా వ్యవహరించడం అలవాటు.ఎక్కడ రవిని సూచన చేసినా అది సూర్యుడని అర్ధం.
గ్రహాల కారకత్వం
మార్చు- 1రవి:-తండ్రి,ఆత్మ,శక్తి,పితృ చింత,శివో పాసన,ధైర్యం,భుద్ధి,ఆరోగ్యం,పిత్తం,మనోశక్తి,కార్యనిర్వహణాశక్తి,బుద్ధి బలం, దుర్వ్యయం, యజ్ఞనం,దినబలం,సౌమ్యత,రాగి,దేవాలయం,గిరిగమనం,కీర్తి,అధికారం,ఎముక,స్వల్పకేశము,శిరోవ్యాధి,ప్రవర్తన,క్షత్రియాంశ,పాషాణం,భూషణం,
వ్యవహారం,లావునడుము,రక్తవర్ణం,రాజసం,రోషం,కారం,పొట్టి,తూర్పుదిశ,జ్ఞానోదయం,ప్రవాళం,రాజ్యం,స్వస్థల స్వాధికారం,పరాక్రమునకు ఘనత్, జనవిరోధం,శతృభయం,యుద్ధం,ఉద్యోగం,వైద్యం,సౌఖ్యం,భార్యాబిడ్డల హాని,పితృభృత్యాధి విరోధం,ఆత్మజ్ఞానం,వీపు పైభాగం,పక్కలు,హృదయం,స్త్రీల ఎడమకన్ను,పురుషుల కుడికన్ను పై ప్రభావం, ఆరోగ్యం,ప్రాణధాతువులు, గౌరవమైనపదవులు,బిరుదులు, అభివృద్ధి,రాజకీయములు, పరిపాలనాధికారములు మొదలైనవి కారకత్వములు.
- 2చంద్రుడు:-తల్లి,మనసు,ప్రసాదగుణం,మాతృచింత,పుష్పములు,సుగంధం,రూపం,సుఖభోజనం,సముద్రస్నానం,వెండి,తీపి,పాలు,వస్త్రం,
ఈరు,ముత్యం,ఆవులు,కంచు,పండ్లు,అపస్మారకం,గుల్మం,యశస్సు,పట్టివస్త్రం,బావి,వీర్యపుష్టి,జలసౌఖ్యం,శ్లేష్మం,బలం,పంట,యాత్ర,అశ్వసంచారం,దుర్గగమనం,శీతజ్వరం,సమదృష్టి,స్నానశాల,సత్యం,తటాకం,మణి,వైశ్యులు,చెరుకు,నడివయసు,లగ్నం,పరిహాసం,గౌరీభక్తి,దూర దేశగమనం,పడమర దిశ,వ్యాధి,కూపము,వాతం,మధువు,స్థూలం,క్షయ,స్త్రీ,ద్విజ,సౌఖ్యం,నెత్తురు,నిద్ర,ముఖం,ఉదరం,బాహువులు,వ్యవసాయం,వైద్యం,వ్యాపారం, జలసంబంధిత వ్యాపకం,బుద్ధి,సౌందర్యం,సత్యం,రంజితం,మనసు దాని స్వభావం,మనశ్శక్తి,స్తనములు,పురుషులందు ఎడమకన్ను,స్త్రీలయందు కుడికన్ను మొదలైనవి చంద్ర కారకత్వములు.
- 3కుజుడు:-కనిష్టసోదరీ సోదరులు,సేవకా గుణం,భూమి,ప్రాకారం,రోగం,వ్రణం,సాహసం,శస్రములు,అగ్ని,స్పోటకం,సందర్శనం,ఉత్పాటనం,
ర్క్తవస్త్రం,కాలినవస్త్రం,ఋణం,ఉద్యానవనం,బలం,వనచరుడు,స్వర్గకారకుడు,పిత్తం,రాగి,పొట్టి,శౌర్యం,దొంగ,యుద్ధప్రియత్వం,విరోధం,రాజు,వాక్కు,కఠినాధిపత్యం,సీసం,విదేశగమనం,దక్షిణదిశ,తర్కశాస్త్రం,శస్త్రవిద్య,శతృవృద్ధి,స్పోటకం,మూర్ఖత్వం,ఆయుధధారణ,వాగ్వాదం,మూత్రకుచ్ఛం,గణితం, కఠిన శిక్షలు విధించు ఉద్యోగం,మిల్లులు,పోలీసు,రక్షణవ్యవస్థ,విద్యుత్తు,వ్యవసాయం,ధైర్యం,శౌర్యం,ఆత్మగౌరవం,మూత్రాశయం,కండలు,తల,మజ్జ, ముఖం,ఎడమచెవి,లింగం,రసేంద్రియం మీద ప్రభావం మొదలైనవి కుజుని కారకత్వాలు.
- బుధుడు:-ప్రజ్ఞ,కర్మ,విజ్ఞానం,గణితం,కావ్యం,జ్యోతిషం,శిల్పం,విద్య,మేనమామ,చింత,బుద్ధి,సుందరస్వరూపం,శాంతం,గృహప్రవేశం,
వ్యాపారం,వ్యవహారం,వేదాంత విచారణ,సేవకులు,నాభి,గుహ్యం,విష్ణు ఉపాసన,వ్యాకరణం,నామకరణం,మైధునం,విష్ణు భక్తి,వైద్యం,యుక్తి,భుక్తి, దాసదాసీ జనవృద్ధి,పరిహాసం,జ్ఞాతులు,తంత్రం,నపుంసకుడు,పాదచారి,యువరాజు,అడ్డచూపు,పికిలిన వస్త్రం,రజోగుణం,సునేత్రం,ఆకుపచ్చ, రచన,మేడలు,వినయం,రత్నశోధన,శూద్రజాతి,యాత్ర,సమదృష్టి,భయం,భూమి,స్థిరం,వాక్కు,హాస్యం,వాయవ్యదిశ,వేదాంతం,గుమస్తా,పుస్తక రచన,అమ్ముట,తీర్పుచెప్పుట,నాటకములు,సినిమాలు,వ్యాపారం,పుత్రసుఖదు॰ఖం,మాతులసుఖం,గణితం,వేదాంతం,శిల్పశాస్త్రం,వక్తృత్వం, శరీరంలోని నాడులునరముల మీద ప్రభావం,ప్రాగులు,ముంజేయి,నోరు,నాలుక,నోరు,నాలుక,దృష్టి,భావం,ఇందియ జ్ఞానం,ఊహ భాషాంతరీకరణ, శైలి,అలవాటు మీద విద్యనభ్యసించుట,అనుకరణ బుధగ్రహ కారకత్వాలు.
- గురువు :- ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం,
వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు.