గ్రహశకలం

చిన్న గ్రహం లాంటిది, తోకచుక్క కానిది

గ్రహశకలాలు అనగా స్వల్ప గ్రహాలు, ప్రత్యేకించి అంతర్గత సౌర వ్యవస్థ లోనివి. పెద్దవి ప్లానిటోయిడ్స్ అని కూడా పిలవబడుతున్నవి. ఈ పదాలు చారిత్రకంగా ఒక గ్రహం డిస్కుగా చూపని సూర్యుని కక్ష్యలోని ఏ ఖగోళ వస్తువుకైనా వర్తించబడుతున్నాయి, చురుకైన తోకచుక్క లక్షణాలు గమనింపబడవు, కానీ బాహ్య సౌర వ్యవస్థలోను స్వల్ప గ్రహాలు కనుగొనబడ్డాయి, అయితే వాటి అస్థిర ఆధారిత ఉపరితలాలు తోకచుక్కలను తలపించేలా నిర్మితమయివుంటాయి, అందువలన తరచుగా సంప్రదాయ గ్రహశకలాలు నుండి అవి వేరు చేయబడ్డాయి[1]. గ్రహశకలాలను ఆంగ్లంలో ఆస్టరాయిడ్స్ అంటారు. ప్రతి సంవత్సరం జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం జరుపుకుంటారు.

ఆస్టెరాయిడ్

ఆస్టెరాయిడ్ అనగా సౌరవ్యవస్థలో సూర్యుని చుట్టూ ప్రయాణించే ఒక చిన్న వస్తువు. ఇది ఒక గ్రహం వంటిది, కానీ చాలా చిన్నది. పురాతన గ్రీకు భాషలో ఆస్టెరాయిడ్ అనే పేరు యొక్క అర్ధం "నక్షత్రం వంటిది" అని. గ్రహశకలాలు ఆకాశంలో చిన్న నక్షత్రాలుగా ఉండవచ్చు, కానీ అవి నిజంగా సూర్యుని చుట్టూ తరలుతుంటాయి, అయితే నక్షత్రాలూ కదులుతున్నట్టు కనిపిస్తాయి ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందున. గ్రహాల వలె గ్రహశకలాలు వాటి నుండి సొంత కాంతిని తయారు చేయలేవు.

ఆస్టెరాయిడ్ పట్టీ

మార్చు

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు.

ఇవి కూడ చుడండి

మార్చు

46 హెస్టియా

మూలాలు

మార్చు
  1. "Asteroids". NASA – Jet Propulsion Laboratory. Retrieved 13 September 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రహశకలం&oldid=4269497" నుండి వెలికితీశారు