గ్రామీణ విద్యుదీకరణ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
గ్రామీణ విద్యుదీకరణ
ఒక గ్రామాన్ని ఎప్పుడు విద్యుద్ధీకరణ గ్రామంగా పిలుస్తారంటే అక్టోబరు 1997కు ముందు 1997 అక్టోబరు తరువాత 2004-05 నుంచి అమలులోకి వచ్చిన విద్దుద్ధీకరణ గ్రామానికి కొత్త నిర్వచనం జాతీయ విద్యుచ్ఛక్తి కార్యా చరణ విధానం - 2005 జాతీయ గ్రామీణ విద్యుధీకరణ పథకాలు- 2006 సంబంధిత సంగ్రహములు :
ఒక గ్రామాన్ని ఎప్పుడు విద్యుద్ధీకరణ గ్రామంగా పిలుస్తారంటే
మార్చు1997 అక్టోబరుకు ముందు
ఒక రెవెన్యూ గ్రామ పరిధిలోనే విద్యుత్ ను ఎలాంటి అవసరం కోసమైనా వినియోగిస్తున్న గ్రామాన్ని విద్యుద్ధీకరణ గ్రామంగా పిలువడం జరిగింది. 1997 అక్టోబరు తరువాత
ఒక రెవెన్యూ గ్రామ పరిధిలో నివాసమున్న ప్రాంతమంతా విద్యుద్ధీకరణ చేసి, ఎలాంటి అవసరము కోసమైనా విద్యుత్ ను వినియోగించుకుంటుంటే ఆ గ్రామాన్ని విద్దుద్ధీకరణ గ్రామంగా భావిస్తారు. 2004-05 నుంచి అమలులోకి వచ్చిన విద్దుద్ధీకరణ గ్రామానికి కొత్త నిర్వచనం (విద్యుత్ శాఖా మంత్రిత్వ శాఖచే విడుదలైన ఉత్తర్వులు, ఉత్తరం సంఖ్య. 42/1/2001-D (RE) తారీఖు 2004 ఫిబ్రవరి 5, దానికి సంబంధించిన ఉత్తరాలు సంఖ్య 42/1/2001-D (RE) తారీఖు 2004 ఫిబ్రవరి 17.)
కొత్త నిర్వచనం ప్రకారం ఒక గ్రామాన్ని విద్యుద్ధీకరణ గ్రామమని నిర్ధారించాలంటే :
మార్చువిద్యుత్ పంపిణీకి అవసరమైన ట్రాన్స్ ఫార్మరు, పంపిణీకి అవసరమైన తీగలు, స్తంభాలు, ఆ గ్రామంతో పాటు ఆ గ్రామానికే చెందిన హరిజన కాలనీకి కూడా అందించే విధంగా విద్యుత్ కు సంబంధించిన ప్రాథమిక మౌలిక వసతులు కలిగి ఉండాలి.
పాఠశాలలు, పంచాయితీ కార్యాలయము, ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలలు, సామాజిక కేంద్రాలు మొదలగు సామాజిక పరమైన భవనాలుకు విద్యుత్ సరఫరా ఉండాలి. ఆ గ్రామంలోని మొత్తం కుటుంబాల సంఖ్యతో పోల్చి చూసినప్పుడు విద్యుద్దీకరణ పొందిన కుటుంబాల సంఖ్య కనీసం 10 శాతం అయిన ఉండి ఉండాలి.
జాతీయ విద్యుచ్ఛక్తి కార్యా చరణ విధానం - 2005
మార్చుజాతీయ విద్యుచ్ఛక్తి కార్యాచరణ విధానం, ( National Electricity Policy), సాధించదలచుకున్న లక్ష్యాలు దిగువ పేర్కొనబడ్డాయి.
విద్యుచ్ఛక్తి అందుబాటు ( Access to Electricity) :- రాబోయే ఐదు సంవత్సరాలలో, అన్ని గృహాలకు అందుబాటులో ( చేరువలో ) విద్యుచ్ఛక్తిని తీసుకుని రావడం. అందుబాటులో విద్యుత్త్ :- 2012 సంవత్సరానికి పూర్తిగా విద్యుచ్ఛక్తి అవసరాలను తీర్చగలగడం. అత్యావశ్యక సమయాల్లో విద్యుచ్ఛక్తి ప్రసారంలో వచ్చే గరిష్ఠ ప్రమాణ కొరతలను అధిగమించడం, విద్యుచ్ఛక్తి ==ప్రవాహ అదనపు నిలువలను అందుబాటులో ఉంచడం.==
- మన్నిక శ్రేష్టత గల విద్యుచ్ఛక్తి, కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలననుసరించి, మంచి సామర్ధ్యంతో సమంజసమైన ధరలలో సరఫరా చేయడం.
- 2012 సంవత్సరానికి ప్రతీ వ్యక్తీకి అందుబాటులో ఉండే విద్యుచ్ఛక్తి 1000 యూనిట్లకు పెంచగలగడం.
- 2012 సంవత్సరానికి, కనీస వినియోగం / యూనిట్ / 1 గృహానికి ఒక రోజుకు అన్న లక్ష్యం కలిగి ఉండడం.
- విద్యుత్ రంగాన్ని ఆర్థిక పరిపుష్టి, వ్యాపారపరంగా విజయం సాధించేటట్లు చేయడం.
- వినియోగదారుల అవసరాలను కాపాడడం.
జాతీయ గ్రామీణ విద్యుధీకరణ పథకాలు- 2006
మార్చుసంబంధిత సంగ్రహములు :
అన్ని గృహాలకి, 2009 సంవత్సరాంతానికి విద్యుచ్ఛక్తి అందుబాటులో ఉండడం, 2012 సంవత్సరం నాటికి, నాణ్యత, సరసమైన ధరలలో విశ్వాసభరితమైన విద్యుత్ సరఫరా చేయడం, జీవితకాల వినియోగానికి కనిష్ఠంగా ఒక ఇంటికి, రోజుకు, ఒకయూనిట్ విద్యుత్తుని ఇవ్వగలగడం వంటివి లక్ష్యాలలో ఉన్నాయి.
విద్యుత్ కేంద్రం నుండి అనుసంధానం సాధ్యం కానప్పుడు లేదా పెట్టే ధన వ్యయం లాభసాటి కానప్పుడు, గ్రామాలకు/ప్రవాస ప్రాంతాలకు, విద్యుదుత్పాదక కేంద్రం అవసరం లేని పరిష్కారాలు, స్థిరమైన వ్యవస్థ కలిగినవి, విద్యుత్ సరఫరాకు తీసుకొనవచ్చు. ఇవన్నీ కూడా సాధ్యం కానప్పుడు, ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం అయిన సోలార్ ఫోటోవోల్టాయిక్ వంటి ప్రత్యేకమైన కాంతి ప్రసార, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవచ్చు. అయినప్పటికిని, అటువంటి గ్రామాలు విద్యుధీకరణ చేయబడ్డాయని అనకపోవచ్చు.
రాష్ట్రప్రభుత్వం, ఆరునెలల లోపు, ఒక గ్రామీణ విద్యుధీకరణ పథకాన్ని, విద్యుధీకరణ చేసే వ్యవస్థ యొక్క అన్ని అంశాలతో సంగ్రహంగా తయారు చేసి ప్రకటించాలి. జిల్లా అభివృద్ధి పథకాలతో పాటు ఈ పథకాన్ని కలపి లింకు చేయవచ్చు. ఈ పథకం గురించి, సంబంధించిన సంఘానికి తెలియజేయాలి.
ఒక గ్రామం విద్యుధీకరణ అయ్యిందని ప్రకటించడానికి అర్హత కలిగినప్పుడు, మొదటి ధ్రువపత్రం గ్రామ పంచాయితి విడుదల చేయాలి. దీనిననుసరించి, గ్రామపంచాయితి ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి, ఆ గ్రామాల యొక్క విద్యుధీకరణ స్థితిని అధికారికంగా ధ్రువపరచాలి.
జిల్లా పంచాయితీ యొక్క అధ్యక్షుడి అధ్యక్షతన, జిల్లాస్థాయి సంస్థలు వినియోగదారుల సంఘాలు, ముఖ్య మైన భాగస్వాములు, తగినంత మంది స్త్రీల ప్రాతినిధ్యంతో ఒక జిల్లాస్థాయి సంఘాన్ని రాష్ట్రప్రభుత్వం, మూడు నెలల లోపు ఏర్పరచాలి.
జిల్లా సంఘం, తమ జిల్లాలోని విద్యుధీకరణ విస్తరణను వినియోగదారుల సంతృప్తిని మొదలగువాటిని సమన్వయ పరచి పరిశీలిస్తుంది.
పంచాయితీ రాజ్ సంఘాలు పర్యవేక్షణ/ సలహాలు యిచ్చే పాత్రని పోషిస్తాయి.
సంప్రదాయబద్ధంకాని శక్తి వనరుల పై ఆధారపడి చేసే వ్యవస్థలకు, సహాయ సేవలు, సాంకేతిక సహకారం అందించే సంస్థాగతమైన ఏర్పాట్లు రాష్ట్రప్రభుత్వం చేస్తుంది.