గ్రెటా థన్ బర్గ్
గ్రెటా థన్ బర్గ్ ( 2003 జనవరి 3) స్వీడన్కి చెందిన పర్యావరణ కార్యకర్త. ఈమె పాఠశాలలో చదువుతున్నప్పుడే పర్యావరణంలో ఏర్పడుతున్న పెనుమార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులను సవాలు చేసింది. 2018 ఆగస్టులో, 15 ఏళ్ల వయస్సులో, శీతోష్ణ స్థితి కోసం పాఠశాల నిరసన (స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్) అనే పలక(బోర్డు)ను పట్టుకుని వాతావరణ మార్పుల తీవ్రత తగ్గించడంకోసం బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చేందుకు ఆమె ప్రతి శుక్రవారం పాఠశాలకు వెళ్లకుండా స్వీడిష్ పార్లమెంట్ వెలుపల నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఈమె పర్యావరణ 'భవిత కోసం శుక్రవారం' (Fridays for Future) పేరుతో ఈ పోరాటం చేస్తున్నది. గతేడాది స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి సంచలనం సృష్టించింది. గ్రెటాకి మద్దతుగా పలు దేశాల్లోని పాఠశాలల పిల్లలు పోరాడుతున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల మీద గ్రెటా ప్రసంగిస్తోంది. పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి వేదిక మీదుగా గళం విప్పిన గ్రెటా ఇప్పుడొక సంచలనం అయ్యింది.[1][2]
బాల్యం
మార్చుఈమె పూర్తిపేరు గ్రేటా టిన్టిన్ ఎలియోనోరా ఎర్న్‌మాన్ థన్‌బెర్గ్. గ్రేటా థన్‌బెర్గ్ 3 జనవరి 2003న స్వీడన్, స్టాక్‌హోమ్‌లో జన్మించింది. అమె తల్లి పేరు మలేనా ఎర్న్మాన్, ఒపెరా సింగర్. తండ్రి పేరు స్వాంటే థన్‌బెర్గ్, నటుడు. ఆమెకు బీటా అనే చెల్లెలు ఉంది. తాతగారు కూడా నటుడు, దర్శకుడు. 2011లో తనకు ఎనిమిదేళ్ల వయసులో వాతావరణ మార్పుల గురించి తాను మొదటిసారిగా విన్నానని, ఎవరు ఎందుకు ఏమీ చేయడం లేదో అర్థం కాలేదని థన్‌బెర్గ్ చెప్పింది. ఈ పరిస్థితి ఆమెను నిరుత్సాహపరిచింది, దాదాపు నాలుగు సంవత్సరాలు నిరాశతో పోరాడింది. ఫలితంగా, 11 సంవత్సరాల వయస్సులో, ఆమె ఎక్కువగా మాట్లాడటం తినడం మానేసింది, రెండు నెలల్లో పది కిలోల (22 పౌండ్లు) తగ్గింది. చివరికి, ఆమెకు ఆస్పెర్గర్ సిండ్రోమ్, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD), సెలెక్టివ్ మ్యూటిజం ("అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం") వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయింది[3][4]. ఆమె తన ఆస్పెర్జర్‌ను అనారోగ్యంగా చూడలేదు, బదులుగా "సూపర్ పవర్" అని భావించింది. దానితో ఆమెను పర్యావరణ కార్యకర్తగానే కాకుండా, ఆటిజం కార్యకర్తగా కూడా వర్ణించారు.[5].
పర్యావరణ ఉద్యమాలు
మార్చుథన్బెర్గ్ క్రియాశీలత తన తల్లిదండ్రులను వారు స్వంతంగా కార్బన్ పాదముద్రను (కార్బన్ ఫుట్ ప్రింట్స్) తగ్గించే జీవనశైలి, అనుసరించమని ఒప్పించినప్పుడే ప్రారంభమైంది - అంటే శాకాహారిగా మారడం, వస్తువుల పునర్వినియోగము (అప్‌సైక్లింగ్) చేయడం, విమానాలలో ప్రయాణం (flying) మానేయడం వంటివి . ఫలితంగా ఆమె తల్లి ఒపెరా గాయనిగా అంతర్జాతీయ వృత్తిని వదులుకోవలసి వచ్చింది[6]. థన్‌బెర్గ్ తన తల్లిదండ్రుల ప్రతిస్పందన వలన తాను ఒక మార్పును తీసుకు రాగలను అను ఆశను, నమ్మకం ఏర్పడింది. తన కుటుంబ కథను "సీన్స్ ఫ్రమ్ ది హార్ట్" (2018) అను పుస్తకంలో వివరించింది.[7] ఆ పుస్తకం 2020 లో ఇంకొంతమంది కార్యకర్తల వ్యాసాలను కలుపుకుని "ఆవర్ హౌస్ ఈస్ ఆన్ ఫైర్: సీన్స్ అఫ్ ఏ ఫామిలీ అండ్ ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్" అను శీర్షికతో తిరిగి ప్రచురింపబడింది.[8]
థన్బెర్గ్ 2018 చివర్లో పాఠశాల సమ్మెలు, బహిరంగ ప్రసంగాలను ప్రారంభించింది. దీని ద్వారా ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వాతావరణ కార్యకర్తగా మారింది. ఆమె ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె 'స్వీడిష్ ప్రభుత్వం పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలి' అని కోరుకుంది. పాఠశాల సమయంలో ప్రతిరోజూ 3 వారాల పాటు "Skolstrejk för klimatet" ("'శీతోష్ణ స్థితి కోసం పాఠశాల నిరసన") అను అనే పలక (బోర్డు)ను పట్టుకుని ఆమె నిరసన వ్యక్తం చేసింది.[9][10] ఆమె పాఠశాలకు వెళ్లకుండా ఉండడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. కానీ ఆమె చేసే కార్యక్రమాల వలన తరగతులకు వెళ్లడంలో ఎక్కువ ఇబ్బంది పడలేదు కానీ తక్కువ సమయం వెచ్చిస్తోంది అని పేర్కొన్నారు. "ఆమె ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మేము గౌరవిస్తాము. నిజానికి ఆమె ఇంట్లో కూర్చుని సంతోషంగా ఉండవచ్చు. కాకపోతే నిరసన తెలుపుతుంది, సంతోషంగా ఉంటుంది" అని అన్నారు. ఆమెకు తరగతులు తప్పిపోయిన విషయం గురించి ఆమె ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలలో ఉన్నారని థన్బెర్గ్ చెప్పింది. ఇంకా ఆమె "వారు ప్రజలుగా నేను చేస్తున్నది మంచిదని భావిస్తారు, కాని ఉపాధ్యాయులుగా వారు ఈ కార్యక్రమాలు నేను ఆపాలి అని చెపుతారు." అని పేర్కొంది.
2018 మేలో, స్వీడిష్ వార్తాపత్రిక 'స్వెన్స్కా డాగ్‌బ్లాడెట్' నిర్వహించిన 'వాతావరణ మార్పు' వ్యాస పోటీలో థన్‌బెర్గ్ గెలుపొందింది. దాంట్లో ఆమె "నేను సురక్షితంగా ఉండాలనుకుంటున్నాను. కానీ మనం గొప్ప సంక్షోభంలో ఉన్నామని తెలిసినప్పుడు నేను ఎలా సురక్షితంగా ఉండగలను?" అని వ్రాసింది.[11]
ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, యు ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తన ఛాయా చిత్రాలు, ఉద్యమాలు, ఆలోచనలు అందరకు అందచేసింది. వేల సంఖ్యలో పాత్రికేయులు, మద్దత్తు దారులు, అనుచరులు ఏర్పడ్డారు. 2018 డిసెంబరు సాధారణ ఎన్నికల తర్వాత, థన్‌బెర్గ్ శుక్రవారాల్లో మాత్రమే సమ్మె కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు ఆ నెలలో, కనీసం 270 నగరాల్లో 20,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు సమ్మెలు నిర్వహించారు.[12]
ప్రపంచవ్యాప్త మహమ్మారి సమయంలో విద్యార్థులు భారతదేశములో సెప్టెంబరులో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET - అండర్ గ్రాడ్యుయేట్ 2020), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE -2020) ప్రవేశ పరీక్షలకు హాజరుకావడం అన్యాయమని థన్‌బెర్గ్ పేర్కొంది. బీహార్, అస్సాం వంటి రాష్ట్రాలను తాకిన వరదల వల్ల భారతదేశ విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యారని, ఇది భారీ విధ్వంసం కలిగించిందని ఆమె చెప్పింది. 2020–2021 లో భారత రైతుల నిరసనకు మద్దతుగా 2021 ఫిబ్రవరి 3న, థన్‌బెర్గ్ ట్వీట్ చేసింది. అయితే భారత ప్రభుత్వం ఇది తమ అంతర్గత విషయముగా పరిగణించింది. థన్‌బెర్గ్ తన కార్యక్రమాల వలన ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, పత్రికల నుండి బలమైన మద్దతు, ప్రశంసలే కాకుండా బలమైన విమర్శలను కూడా అందుకుంది.[13]
సదస్సులు, ఉపన్యాసాలు
మార్చువిలుప్త (ఎక్స్‌టింక్షన్) తిరుగుబాటు
మార్చు2018 అక్టోబరులో లండన్ లో పార్లమెంటు సభల ఎదురుగా చేసిన 'తిరుగుబాటు ప్రకటన'లో (ఎక్స్‌టింక్షన్) "మేము విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము, అయితే అది ఎన్నడూ సంక్షోభంగా పరిగణించబడలేదు, మా నాయకులు అందరూ చిన్న పిల్లలలా వ్యవహరిస్తున్నారు. మేము మేల్కొని ప్రతిదీ మార్చాలి" అని ప్రసంగించింది.
TEDxStockholm
మార్చు2018 నవంబరు 24 న, ఆమె TEDxStockholm లో మాట్లాడింది. ఆమె ఎనిమిదేళ్ల వయసులో, వాతావరణం ఏర్పడ్డ పెను మార్పు విషయం, ఎందుకు ప్రతి ఛానెల్‌లో హెడ్‌లైన్ వార్తలు కావని ఆశ్చర్యపోతున్నానని చెప్పింది.
COP24 సదస్సు
మార్చు2018 డిసెంబరు 4, న జరిగిన COP24 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో థన్‌బర్గ్ ప్రసంగించింది. 2018 డిసెంబరు 12 న ప్లీనరీ అసెంబ్లీ ముందు మాట్లాడింది. శిఖరాగ్ర సమావేశంలో, 'వి డోంట్ హావ్ టైమ్ ఫౌండేషన్' ప్రతినిధులతో కలిసి ఆమె ప్యానెల్ చర్చలో పాల్గొంది, దీనిలో పాఠశాల సమ్మె ఎలా ప్రారంభమైందనే విషయం గురించి ఆమె మాట్లాడింది.
దావోస్ సదస్సు
మార్చు2019 జనవరి 23 న, ప్రపంచ ఆర్థిక ఫోరం (World Economic Forum)లో తన వాతావరణ ప్రచారాన్ని కొనసాగించడానికి 1,500 వ్యక్తిగత ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా వచ్చిన అనేక మంది ప్రతినిధులకు భిన్నంగా థన్ బెర్గ్ 32 గంటల రైలు ప్రయాణం తరువాత దావోస్, స్విట్జర్లాండ్ చేరుకుంది. ఆమె దావోస్ ప్యానెల్‌తో మాట్లాడుతూ "కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు, ముఖ్యంగా కొంతమంది నిర్ణయాధికారులు అనూహ్యమైన మొత్తంలో డబ్బు సంపాదించడం కోసం వారు ఎంత అమూల్యమైన విలువలను త్యాగం చేస్తున్నారు. ఈ రోజు మీలో చాలా మంది ఆ సమూహానికి చెందినవారని నేను భావిస్తున్నాను." అని చెప్పింది. వారం తరువాత, ఆమె ప్రపంచ నాయకులను ఉద్దేశించి, "మీరు భయపడాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజూ నేను అనుభూతి చెందుతున్న భయాన్ని, సంక్షోభాన్ని మీరు అనుభవించాలని, వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను ". అని చెప్పింది.
యూరోపియన్ కమిటీలు
మార్చు2019 ఫిబ్రవరి 21 న, ఆమె యూరోపియన్ ఆర్థిక, సామాజిక (ఎకనామిక్, సోషల్) కమిటీ సమావేశంలో, యూరోపియన్ కమిషన్ చీఫ్ జీన్-క్లాడ్ జంకర్తో మాట్లాడింది. అక్కడ పారిస్ ఒప్పందం ప్రకారం 20 సి లక్ష్యం వరకు గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయాలని ఆమె అన్నారు. EU వారి లక్ష్యం CO ని 2030 నాటికి ఉద్గారాలు 80% తగ్గించాలి. పారిస్‌లో నిర్దేశించిన 40% లక్ష్యాన్ని రెట్టింపు చేయాలి. "మేము అలా చేయడంలో విఫలమైతే ఇది మానవ చరిత్రలో గొప్ప వైఫల్యం అవుతుంది." అని ఆమె అన్నారు. తరువాత, ఆమె బ్రస్సెల్స్ వాతావరణ నిరసనలో 7,500 బెల్జియన్ విద్యార్థులతో చేరారు.
బెర్లిన్ సదస్సు
మార్చు29– 2019 మార్చి 31 వారాంతంలో, థన్‌బర్గ్ బెర్లిన్‌ను సందర్శించింది. మార్చి 29 న బ్రాండెన్‌బర్గ్ గేట్ సమీపంలో 25 వేల మంది ప్రజల ముందు ఆమె మాట్లాడింది. అక్కడ "మేము ఒక వింత ప్రపంచంలో నివసిస్తున్నాము, అక్కడ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయడాన్ని నిరసిస్తూ వారి స్వంత చదువును త్యాగం చేయాలి. ఈ సంక్షోభానికి అక్కడ ఉన్నవారు చాలా తక్కువ మంది దోహదపడతారు. "ప్రసంగం తరువాత థన్‌బెర్గ్ తోటి వాతావరణ కార్యకర్త 'లూయిసా న్యూబౌర్' పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమయింది. మార్చి 30 న, జర్మనీ యొక్క వార్షిక చలనచిత్ర, టెలివిజన్ అవార్డు ప్రదర్శనలో థన్‌బర్గ్ 'గోల్డెన్ కెమెరా' ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. థన్‌బర్గ్ ప్రతిచోటా తన ప్రసంగాలలో ప్రముఖులను వారి ప్రభావాన్ని ఉపయోగించాలని, క్రియాశీలకమైన కార్యక్రమాలు నిర్వహించడములో ఆమెకు తమ వంతు సహాయపడాలని కోరారు.
యూరోపియన్ యూనియన్
మార్చుఏప్రిల్ 2019 లో స్ట్రాస్‌బోర్గ్‌లోని యూరోపియన్ పార్లమెంటులో, EU అధికారులతో జరిగిన సమావేశంలో థన్‌బెర్గ్ "మూడు అత్యవసర బ్రెక్సిట్ శిఖరాగ్ర సమావేశాలకు, వాతావరణం, పర్యావరణ విచ్ఛిన్నానికి సంబంధించి అత్యవసర శిఖరాగ్ర సమావేశాలకు" హాజరైన వారిని ఎన్నుకున్నారు. అయితే వాతావరణ మార్పుల చర్చలు EU శిఖరాగ్ర సమావేశాలలో ఆధిపత్యం వహించలేదు, ఎందుకంటే ఇతర సమస్యలు ప్రాధాన్యతనిచ్చాయి. "మేము దీనిని సంక్షోభంగా పరిగణించలేదు, దాన్ని పరిష్కరించాల్సిన మరో సమస్యగా మేము చూసాము. అన్నిటికంటే ముఖ్యమైనది అని ఆమె అంది.
ఆస్ట్రియన్ ప్రపంచ శిఖరాగ్ర R20
మార్చుథన్బర్గ్ మే 2019 లో, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌తో సమావేశమయింది.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు
మార్చు23 సెప్టెంబర్ 2019 న, న్యూయార్క్ నగరంలో జరిగిన 2019 ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ సమితి సమావేశంలో (యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్) ప్రపంచ నాయకుల ఉద్దేశ్యించిు థన్‌బర్గ్ ప్రసంగించింది. గ్రెటా థన్ బెర్గ్ ‘‘మీ కెంత ధైర్యం’’ అంటూ గర్జించింది. ‘‘మీకెంత ధైర్యం’’ చూపులు తిప్పుకోవడానికి, చేసేది సరిపోతోంది అని చెప్పడానకి మీకెన్ని గుండెలు అంటూ ఉద్వేగపూరిత చేసిన ఉపన్యాసం ప్రపంచవ్యాప్తంగా కదిలించింది. దాని సారాంశం - "చెప్పుకోవలసిన సంగతేమిటంటే మేం మిమ్మల్ని చూస్తూనే వున్నాం. అవును ఇందంతా తప్పే. నేనిక్కడ వుండాల్సిన పనేం లేదు. సముద్రం పక్కనున్న బడిలో నేనిప్పుడు చదువుకుంటా వుండాల్సింది. కానీ మీరందరూ మా యువత దగ్గరకు వచ్చింది కూసింత ఆశతోనే, ఎన్ని గుండెలు మీకు మీ ఉత్తుత్తి మాటలతో మా కలల్ని దొంగిలించారు, మా బాల్యాన్ని దోచుకున్నారు. నేనూ అలాంటి ఒక దురదృష్టవంతురాలినే. ప్రజలు చచ్చిపోతున్నారు. మొత్తం పర్యావరణం నాశనం అయిపోతోంది. మనమంతా మూకుమ్మడిగా అంతరించిపోయే దశలోకి అడుగుపెట్టాం. అయినా మీరింకా డబ్బుసంపాదన గురించే మాట్లాడుతారు. తాంత్రిక కథల గురించే ముచ్చట్లు చెప్తారు. ఎక్కడో పెరిగే డబ్బుల గురించే మీ కలలు. అసలు మీకెన్ని గుండెలు. ముప్పయ్యేళ్లకు ముందునుంచే విజ్ఞాన శాస్త్రం స్పష్టంగా చెప్పూనే ఉంది. అయినా మేము బాగా చేస్తున్నాం అని చెప్పడానికి ఎన్ని గుండెలు. రాజకీయంగా పరిష్కారం కావలసివున్నా, అది కనుచూపుమేరలో కనపడనివ్వడం లేదు అసలు మీకెన్ని గుండెలు. మీరు మా గోడు విన్నామనే చెప్తారు అదెంత అవసరమో మీకు తెలిసిందనే చెప్తారు. కానీ నాకెంత దుఃఖం, ఇంకెంత కోపం వుందో నీకు పట్టదు. నేను మిమ్మల్ని నమ్మదలచుకోలేదు. నీకు నిజంగా ఈ దుర్భర పరిస్థితి అర్ధం అయితే ఫలితాలు రాబట్టడంలో ఓడిపోతారా? అలాంటప్పుడు నేన్నిన్ను నమ్మను. రాబోయే పది సంవత్సరాలలో ఉద్గారాలను సగానికి తగ్గించాలనే ఆలోచన కనీసం ఒకటిన్నర డిగ్రీల సెంటిగ్రేడు నైనా తగ్గించడానికి కేవలం యాబ్బై శాతం మాత్రమే అవకాశం ఉంది. కానీ మానవ నియంత్రణలో లేని గొలుసు ప్రతిచర్యలను సృష్టించే ప్రమాదం మాత్రం ఉంటుంది. యాబై శాతం మీకు ఆమెదయోగ్యంగా అనిపించవచ్చు, కానీ ఆ యాభై శాతంలో వలయాలున్నాయి. విషపూరిత వాయుకాలుష్యం వల్ల అదనపు వేడిపుడుతుంది. వాతావరణ న్యాయం దాని పద్ధతిలో సమన్యాయం చేసినట్లు లెక్క. ఇప్పుడున్న సాంకేతికతను వాడుకుని మీరు మా తరపు భుజాలపై నిలబడి బిలియన్ టన్నుల బొగ్గుపులుసు వాయువుని మాపై వదులుతున్నారు. ఈ తదనంతర దుష్పరిణామాలలో జీవించాల్సిన మా తరానికి ఇలా యాబైశాతం ప్రమాదమే అనేది అంగీకారం కాదు. వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల (ఇంటర్ గవర్నమెంటల్) బృందం వారి నివేదికల ప్రకారం ఒకటిన్నర డిగ్రీల భూతాపం తగ్గించడానికి 67 శాతం మాత్రమే అవకాశాలున్నాయని చెప్పింది. కానీ ఈ భూమ్మిద 2018 జనవరి మొదటి తేదీ నాటికి 420 గిగాటన్నుల కార్బన్ డయాక్సైడ్ తిరిగి విడుదల చేసేందుకు సిధ్దంగా ఉంది. అదిప్పటికి 350 గిగాటన్నుల దిగువకు చేరుకుని వుంటుంది. ఇంకా నాటకాలాడటానికి మీకెన్ని గుండెలు. ఏదో మామూలుగా తూతూ మంత్రం పరిష్కారాలతో రాబోయే ఎనిమిదిన్నరేళ్ళలో కార్బన్ డయాక్సైడ్ నిల్వలు మొత్తం తగ్గించగలం అని చెప్పడానికి మీకెన్ని గుండెలుంటాలి? కొండలా పెరిగిన ఈ విపత్తును తగ్గించేందుకు ఈ రోజుకి కూడా మీరు ఒక్క పరిష్కారం చెప్పడం లేదు. ఈ అంకెలన్నీ మీకు కొరుకుడు పడవు. దాన్ని వున్నది వున్నట్టుగా చెప్పే పెద్దరికం మీకు రానేలేదు. మీరు మమ్మల్ని ఓడిస్తున్నారు. కానీ మా యువత మీ ద్రోహబుద్ధిని అర్ధంచేసుకోగలుగుతున్నాం. భవిష్యత్ తరాల కళ్ళన్నీ మీవైపే చూస్తున్నాయి. అయినా మీరింకా మమ్మల్ని ఓడించాలనే చూస్తుంటే మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించం. దీన్నితీసుకుని మేము పోనివ్వం. ఇదిగో ఇక్కడే, ఇప్పుడంటే ఇప్పుడే మేమొక లక్ష్మణరేఖ గీస్తున్నాం. ప్రపంచం కళ్ళుతెరుచుకుంది. నీకు నచ్చినా నచ్చక పోయినా మార్పు వస్తోంది. ధన్యవాదాలు.
థన్‌బర్గ్ ఉపన్యాసాలు కొన్ని సంగీతం పరంగా కూడా తయారు చేయబడ్డాయి. 2019 లో, థన్‌బర్గ్ పేరుతో ఒక ఇంగ్లీష్ బ్యాండ్ థీమ్ సాంగ్ "ది 1975" విడుదలకు ఆమె గాత్రాన్ని అందించింది, "అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ! ఇప్పుడు శాసనోల్లంఘనకు సమయం. ఇది తిరుగుబాటు చేసే సమయం." అని హెచ్చరించి విజ్ఞప్తి చేసింది.[14]
రచనలు
మార్చు- "సీన్స్ ఫ్రమ్ ది హార్ట్" (2018) తన కుటుంబ కథనుఅను పుస్తకంలో వివరించింది.
- థన్‌బెర్గ్ తన వాతావరణ చర్య ప్రసంగాల సంకలనాన్ని, "నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఎ డిఫరెన్స్" అనే పుస్తకాన్ని 2019 మేలో పెంగ్విన్ బుక్స్ ప్రచురించింది. దీని ద్వారా వచ్చిన సంపాదన ఆమె దాతృత్వంతో విరాళంగా ఇచ్చింది.
- గ్రెటా థన్‌బెర్గ్ ప్రసంగాలు, ఇంటర్వ్యూలు". గ్రేటా ఏమి చేస్తుంది? ("Greta Thunberg Speeches and Interviews". What Would Greta Do?) 2020 మార్చి వరకు థన్‌బెర్గ్ చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, IPCC నివేదికల సంకలనం
- "వాతావరణ మార్పుపై ఇప్పుడే చర్య తీసుకోవాల్సిన నిరాయుధ కేసు" (The Disarming Case to Act Right Now on Climate Change") అను పుస్తకాన్ని థన్‌బెర్గ్ TED.com, స్టాక్‌హోమ్, స్వీడన్. 2019లో ప్రచురించింది.
- థన్‌బెర్గ్ తన మొదటి ప్రచురణ "సీన్స్ ఫ్రమ్ ది హార్ట్" పుస్తకాన్ని 2020 లో ఇంకొంతమంది కార్యకర్తల వ్యాసాలతో కలిపి "ఆవర్ హౌస్ ఈస్ ఆన్ ఫైర్: సీన్స్ అఫ్ ఏ ఫామిలీ అండ్ ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్"గా తిరిగి ప్రచురించింది[8].
- అభిప్రాయం | ఇది పెద్దలు మనకు వదిలిపెట్టిన ప్రపంచం" ("Opinion | This Is the World Being Left to Us by Adults") ను ది న్యూయార్క్ టైమ్స్ 2021లో ప్రచురించింది.
- శీతోష్ణస్థితి పుస్తకం (The Climate Book) ను 2022 లో పెంగ్విన్ బుక్స్ ప్రచురించింది.
పురస్కారాలు, గుర్తింపులు
మార్చుథన్బెర్గ్ గౌరవాలు, పురస్కారాలను అందుకుంది. వేడుకలకు హాజరుకావడానికి లేదా అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి వంటి విమానంలో ప్రయాణించాల్సిన అవసరం ఉన్నట్లయితే బహుమతులు స్వీకరించడానికి నిరాకరించింది. ఆమె వివిధ NGOల నుండి కాకుండా, అవగాహన పెంచడంలో ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించిన శాస్త్రీయ సంస్థల నుండి కూడా బహుమతులు అందుకుంది.
- 2018 మేలో, ఆమె పాఠశాల సమ్మె ప్రారంభానికి ముందు, స్వెన్స్కా డాగ్‌బ్లాడెట్ (ది స్వీడిష్ వార్తా దిన పత్రిక) వారి వాతావరణ మార్పు వ్యాస పోటీ విజేతలలో ఆమె ఒకరు.[11]
- టైమ్ 2018 అత్యంత ప్రభావవంతమైన 25 మంది యువత (Time's 25 most influential teens of 2018): 2018 డిసెంబరులో ఆ సంవత్సరం ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన యువత కోసం టైమ్ మ్యాగజైన్ సంకలనం చేసిన వార్షిక జాబితా[15].
- ఫ్రైషుసెట్ (Fryshuset scholarship) ఉపకార వేతనం, 2018. ఆ సంవత్సరంలోఆదర్శ యువతకు (యంగ్ రోల్ మోడల్ ఆఫ్ ది ఇయర్) ప్రదానం చేసే ఉపకార వేతనం.
- నోబెల్ శాంతి బహుమతికి 2019, 2020, 2021, 2022, 2023 సంవత్సరాలలో ప్రతిపాదన చేయబడింది.
- స్వీడిష్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ (Årets Svenska Kvinna), 2019 మార్చి. స్వీడిష్ ఉమెన్స్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ద్వారా "తన విజయాల ద్వారా, ప్రపంచంలో నేటి స్వీడన్‌కు ప్రాతినిధ్యం వహించి, దృష్టిని ఆకర్షించిన ఒక స్వీడిష్ మహిళ కు ఇచ్చే పురస్కారం."
- రాచెల్ కార్సన్ ప్రైజ్, 2019 మార్చి. నార్వేలో లేదా అంతర్జాతీయంగా పర్యావరణం కోసం విశేష కృషి చేసిన మహిళకు ప్రదానం చేయబడింది.
- గోల్డెన్ కెమెరా ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు, 2019 మార్చి. ప్రత్యేక శీతోష్ణస్థితి చర్యకు (క్లైమేట్ యాక్షన్) అవార్డు.
- ఫ్రిట్ ఆర్డ్ అవార్డు (Fritt Ord Award), 2019 ఏప్రిల్. ఈ పురస్కారాన్ని "వాక్ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే " నేచుర్ ఓగ్ ఉంగ్‌డమ్ ( Natur og Ungdom)తో పంచుకుంది. థన్‌బెర్గ్ తన భాగం బహుమతి డబ్బును ఆర్కిటిక్‌లో నార్వేజియన్ చమురు అన్వేషణను నిలిపివేయాలని కోరుతూ వేసిన దావాకు విరాళంగా ఇచ్చింది.
- టైమ్ 100, 2019 ఏప్రిల్. టైమ్ మ్యాగజైన్ ద్వారా, ఆ సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల వార్షిక జాబితా.
- Laudato si' ప్రైజ్, 2019 ఏప్రిల్. మిలరేపా ఫౌండేషన్ ఆఫ్ చిలీచే అందించబడింది. "మా కామన్ హోమ్ కోసం సంరక్షణ" (ఆన్ కేర్ అఫ్ ఔర్ హోమ్) అంతర్జాతీయ లౌడాటో Si' గ్రూప్ సభ్యులు ఎంపిక చేసారు.
- గౌరవ డాక్టరేట్, "డాక్టర్ హానోరిస్ కాసా" (dr.h.c.), 2019 మే. బెల్జియన్ యూనివర్శిటీ ఆఫ్ మోన్స్ (మోన్స్, బెల్జియం) "సహకారాలు ... స్థిరమైన అభివృద్ధిపై అవగాహన పెంచినందుకు" ప్రదానం చేసింది
- అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్ అవార్డ్, 2019 జూన్, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వంటి వాతావరణ ఉద్యమంలో ఆమె నాయకత్వానికి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు.
- గెడ్డెస్ ఎన్విరాన్‌మెంట్ మెడల్, 2019 జూలై. రాయల్ స్కాటిష్ జియోగ్రాఫికల్ సొసైటీ, "సహజ పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత అభివృద్ధికి అత్యుత్తమ ఆచరణాత్మక, పరిశోధన లేదా సమాచార సహకారం." అనుదానికి ప్రదానం చేసింది.
- రాయల్ స్కాటిష్ జియోగ్రాఫికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్, 2019 జూలై, స్వయంచాలకంగా గెడ్డెస్ అవార్డుతో ప్రదానం చేయబడింది.
- రైట్ లైవ్లీహుడ్ అవార్డ్, 2019 సెప్టెంబరు. రైట్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ నుండి. దీనిని స్వీడన్ ప్రత్యామ్నాయ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు, ఈమె నలుగురు 2019 విజేతలలో ఒకరు, "శాస్త్రీయ వాస్తవాలను ప్రతిబింబించే తక్షణ వాతావరణ చర్యకి రాజకీయ డిమాండ్‌లను ప్రేరేపించడం, విస్తరించడం కోసం." అను అంశం మీద ఇచ్చారు.
- మాంట్రియల్ నగరానికికీ (Keys to the City of Montréal), 2019 సెప్టెంబరు. మాంట్రియల్ మేయర్ వాలెరీ ప్లాంటే ప్రదానం చేసాడు.
- ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, 2019 అక్టోబరు. కిడ్స్‌రైట్స్ ఫౌండేషన్ ద్వారా కామెరూన్‌కు చెందిన 14 ఏళ్ల దివినా మలూమ్‌కు థన్‌బెర్గ్కు సంయుక్తంగా ప్రదానం చేసారు.
- 16 ఏళ్ల టొకాటా ఐరన్ ఐస్ అనే లకోటా వాతావరణ కార్యకర్త ఈమెను ఆహ్వానించిన తర్వాత, డకోటా యాక్సెస్ పైప్‌లైన్ వ్యతిరేకతకు మద్దతు ఇచ్చినందుకు మాఫియాటా ఎచియాటన్ హిన్ విన్ (స్వర్గం నుండి వచ్చిన మహిళ), అను లకోటా గిరిజన పేరు మీద 2019 అక్టోబరులో స్టాండింగ్ రాక్ ఇండియన్ రిజర్వేషన్‌లో ప్రదానం చేయబడింది.
- నార్డిక్ కౌన్సిల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైజ్, 2019 అక్టోబరు. నార్డిక్ దేశాలు ఉద్గారాలను తగ్గించడంలో తగినంతగా చేయడం లేదని పేర్కొంటూ థన్‌బెర్గ్ అవార్డు లేదా DKK 350,000 (2019 అక్టోబరు నాటికి €47,000) బహుమతిని నిరాకరించింది.
- టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, 2019 డిసెంబరు గ్రహీత. టైమ్ మ్యాగజైన్ ద్వారా.
- గ్లామర్ మ్యాగజైన్ నుంచి గ్లామర్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2019.
- ఆమెను 2019లో BBC 100 మంది మహిళల్లో ఒకరిగా గుర్తించబడింది.
- నేచర్స్ 10, 2019, 2019 డిసెంబరు. సైన్స్‌లో "పది మంది ముఖ్యమైన వ్యక్తుల" వార్షిక జాబితా.
- వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ అవార్డ్స్, 2019. బెస్ట్ సస్టైనబుల్ ఇన్‌ఫ్లుయెన్సర్
- ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితా, 2019.
- ఫోర్బ్స్ 30. 2020. యూరోప్ లో సోషల్ ఎంట్రప్రెన్యూర్స్ అండర్ 30.
- హ్యూమన్ యాక్ట్ ఫౌండేషన్, 2020 ఏప్రిల్ 22న ఎర్త్ డే సందర్భంగా, "వాతావరణ మార్పులతో పోరాడటానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను సమీకరించడానికి ఆమె నిర్భయమైన, దృఢమైన ప్రయత్నాలకు" మానవ చట్టం అవార్డు. USD100,000 పురస్కారంగా లభించిన డబ్బు UNICEFకి విరాళంగా ఇచ్చింది.
- 2020 మే 3న జరిగిన 12వ షార్టీ అవార్డ్స్‌లో యాక్టివిజంలో బెస్ట్ (టెక్ & ఇన్నోవేషన్ కేటగిరీ నుండి).
- గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ, 2020 జూలైల. ఈ బహుమతిని మొదటి గ్రహీత. ఆమె ఫౌండేషన్ ద్వారా, థన్‌బెర్గ్ €1 మిలియన్ల ప్రైజ్ మనీని "వాతావరణ, పర్యావరణ సంక్షోభంతో పోరాడే ధార్మిక ప్రాజెక్టులకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో అత్యంత దారుణమైన ప్రభావాలను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవడానికి" విరాళంగా ఇచ్చింది.
- 2021 ఉమెన్ ఆఫ్ ఐరోపా అవార్డ్స్‌లో వుమెన్ ఇన్ యూత్ యాక్టివిజం అవార్డు. 2021 డిసెంబరు 2న "వాతావరణ న్యాయం, సామాజిక మార్పు, యువజన సంఘం నిర్వహణకు మద్దతుగా ధైర్యవంతమైన నాయకత్వం" అను సందర్భంలో ఈ పురస్కారం ప్రదానం చేసారు.[278]
- గౌరవ డాక్టర్ ఆఫ్ లాస్ (LLD), 2021 మే 31. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, ఒకానగన్ క్యాంపస్ "వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తక్షణ చర్య తీసుకోవాలని ప్రపంచ నాయకులను సవాలు చేసినందుకు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపులు" అందించారు.[279][280][281]
- హెల్సింకి విశ్వవిద్యాలయంచే గౌరవ వేదాంతశాస్త్ర వైద్యుడు. డాక్టరేట్ 2023 జూన్లో మంజూరు చేయాలని నిర్ణయించబడింది.[282]
ప్రత్యేక గుర్తింపులు
మార్చుగ్రెటా థన్బెర్గ్ గౌరవార్ధం కొన్ని జాతులకు ఆమె పేరు పెట్టారు.
- నెల్లోప్టోడ్స్ గ్రెటే (Nelloptodes gretae): ఇది పిటిలిడే కుటుంబంలో కెన్యా నుండి వచ్చిన కొత్త జాతి బీటిల్. (మైఖేల్ డార్బీ, నేచురల్ హిస్టరీ మ్యూజియం, UK, 2019 డిసెంబరు, నుంచి )[16]
- క్రాస్పెడోట్రోపిస్ గ్రెటాథన్బెర్గే (Craspedotropis gretathunbergae): సైక్లోఫోరిడే కుటుంబంలో బోర్నియో నుండి వచ్చిన కొత్త జాతి నత్త. (షిల్తుయిజెన్ (Schilthuizen et al.), 2020 ద్వారా)[17]
- థన్‌బెర్గా గ్రెటా (Thunberga greta): స్పారాసిడే కుటుంబంలోని కొత్త జాతి సాలీడు.[18] పీటర్ జాగర్, 2020 జూన్ నుంచి.
- ఒపాక్యూన్‌కోలా గ్రెటాథన్‌బెర్గే (Opacuincola gretathunbergae) : టాటిడే కుటుంబంలో న్యూజిలాండ్ నుండి వచ్చిన కొత్త మంచినీటి నత్త. వెర్హేజ్ & హాసే, 2021 ద్వారా[19],
మూలాలు
మార్చు- ↑ "It's an existential crisis. Listen to scientists". BBC. 23 April 2019. Archived from the original on 14 August 2019. Retrieved 31 August 2019.
- ↑ Nordstrom, Louise (25 January 2019). "The Swedish teen holding world leaders accountable for climate change". France 24. Archived from the original on 2 September 2019. Retrieved 30 September 2019.
- ↑ Thunberg, Greta (24 November 2018). School strike for climate – save the world by changing the rules. TEDxStockholm. Event occurs at 1:46. Archived from the original on 11 November 2019. Retrieved 29 January 2019 – via YouTube.
I was diagnosed with Asperger's syndrome, OCD, and selective mutism. That basically means I only speak when I think it's necessary. Now is one of those moments ... I think that in many ways, we autistic are the normal ones, and the rest of the people are pretty strange, especially when it comes to the sustainability crisis, where everyone keeps saying that climate change is an existential threat and the most important issue of all and yet they just carry on like before.
- ↑ Queally, Jon (19 December 2018). "Depressed and Then Diagnosed With Autism, Greta Thunberg Explains Why Hope Cannot Save Planet But Bold Climate Action Still Can". Common Dreams. Archived from the original on 28 November 2019. Retrieved 3 January 2020.
- ↑ Hattenstone, Simon (25 September 2021). "Interview: The transformation of Greta Thunberg". The Guardian. Archived from the original on 30 October 2021. Retrieved 25 September 2021.
I really see the value of friendship. Apart from the climate, almost nothing else matters
- ↑ Thunberg, Greta (11 December 2018). "School Strike for Climate: Meet 15-Year-Old Activist Greta Thunberg, Who Inspired a Global Movement". Democracy Now! (Interview). Interviewed by Amy Goodman. Archived from the original on 17 July 2019. Retrieved 22 July 2019.
- ↑ Lambeck, Petra (6 May 2019). "'Scenes From the Heart': Backstory of 16-Year-Old Climate Activist Greta Thunberg". The Wire. Archived from the original on 1 July 2019. Retrieved 31 August 2019.
- ↑ 8.0 8.1 Thunberg, Greta (2019). "Our house is on fire: Greta Thunberg, 16, urges Davos leaders to act on climate". The Guardian. Archived from the original on 25 July 2019. Retrieved 14 February 2019.
Our house is on fire. I am here to say, our house is on fire. According to the IPCC we are less than twelve years away from not being able to undo our mistakes
- ↑ Gessen, Masha (2 October 2018). "The Fifteen-Year-Old Climate Activist Who Is Demanding a New Kind of Politics". The New Yorker. Archived from the original on 5 January 2019. Retrieved 22 July 2019.
- ↑ "Time Person Of The Year Is Greta Thunberg". Tech Warrant. 12 December 2019. Archived from the original on 15 December 2019. Retrieved 15 December 2019.
- ↑ 11.0 11.1 Tait, Amelia (6 June 2019). "Greta Thunberg: How one teenager became the voice of the planet". Wired. Archived from the original on 23 August 2019. Retrieved 24 August 2019.
'I want to feel safe', she wrote. 'How can I feel safe when I know we are in the greatest crisis in human history?'
- ↑ Carrington, Damian (4 December 2018). "'Our leaders are like children', school strike founder tells climate summit". The Guardian. Archived from the original on 2 January 2019. Retrieved 22 July 2019.
- ↑ Multiple sources:
- Guterres, António (15 March 2019). "The climate strikers should inspire us all to act at the next UN summit". The Guardian. Archived from the original on 18 March 2019. Retrieved 12 April 2020.
- Bonn, Tess (24 September 2019). "Climate change activist: Thunberg 'being the face of this issue terrifies so many people'". The Hill. Archived from the original on 15 April 2020. Retrieved 12 April 2020.
- Crowe, David (25 September 2019). "Morrison warns against 'needless anxiety' after Thunberg climate speech". The Sydney Morning Herald. Archived from the original on 31 October 2019. Retrieved 12 April 2020.
- Moody, Oliver (26 September 2019). "World's leaders turn on Greta Thunberg after legal move over carbon emissions". The Times. Archived from the original on 31 October 2019. Retrieved 12 April 2020.
- Soldatkin, Vladimir; Zhdannikov, Dmitry (2 October 2019). "Putin: I don't share excitement about Greta Thunberg's U.N. speech". Reuters. Archived from the original on 17 November 2019. Retrieved 5 October 2019.
- Stracqualursi, Veronica (25 September 2019). "Trump mocks teenage climate activist Greta Thunberg". CNN. Archived from the original on 5 October 2019. Retrieved 5 October 2019.
- Waldman, Scott (9 August 2019). "Climate Deniers Launch Personal Attacks on Teen Activist". Archived from the original on 10 August 2019. Retrieved 12 April 2020.
- Chakrabortty, Aditya (1 May 2019). "The hounding of Greta Thunberg is proof that the right has run out of ideas". The Guardian. Archived from the original on 21 July 2019. Retrieved 22 July 2019.
- Connolly, Kate (14 May 2019). "Germany's AfD turns on Greta Thunberg as it embraces climate denial". The Guardian. Archived from the original on 17 July 2019. Retrieved 22 July 2019.
- Vaughan, Adam (18 December 2019). "The Year the World Woke up to Climate Change". New Scientist. Vol. 244, no. 3261/62. pp. 20–21. Archived from the original on 22 December 2019. Retrieved 12 April 2020.
- ↑ Snapes, Laura (25 July 2019). "'Time to rebel': Greta Thunberg adds voice to new song by the 1975". The Guardian. Archived from the original on 24 July 2019. Retrieved 25 July 2019.
- ↑ "Time's 25 Most Influential Teens of 2018". Time. 7 December 2018. Archived from the original on 8 December 2018. Retrieved 22 December 2018.
- ↑ "Museum scientists described 412 new species this year". www.nhm.ac.uk. Archived from the original on 2022-07-12. Retrieved 31 December 2019.
- ↑ Schilthuizen, M.; Lim, J.; van Peursen, A.; Alfano, M.; Jenging, A.B.; Cicuzza, D.; Escoubas, A.; Escoubas, P.; Grafe, U.; Ja, J.; Koomen, P.; Krotoski, A.; Lavezzari, D.; Lim, L.; Maarschall, R.; Slik, F.; Steele, D.; Ting, D.T.W.; van Zeeland, I.; Njunjić, I. (20 February 2020). "Craspedotropis gretathunbergae, a new species of Cyclophoridae (Gastropoda: Caenogastropoda), discovered and described on a field course to Kuala Belalong rainforest, Brunei". Biodiversity Data Journal. 8: e47484. doi:10.3897/BDJ.8.e47484. PMC 7046707. PMID 32132859.
- ↑ "New spider species named after Greta". France 24. 12 June 2020. Archived from the original on 12 June 2020. Retrieved 12 June 2020.
- ↑ Verhaegen, Gerlien; Haase, Martin (18 January 2021). "All-inclusive descriptions of new freshwater snail taxa of the hyperdiverse family Tateidae (Gastropoda, Caenogastropoda) from the South Island of New Zealand". European Journal of Taxonomy (731): 71–96. doi:10.5852/ejt.2021.731.1205.
బయటి లింకులు
మార్చు- ట్విట్టర్ లో గ్రెటా థన్ బర్గ్
- ఫేస్బుక్ లో గ్రెటా థన్ బర్గ్
- Mini-documentary portraying Thunberg by Great Big Story
- "Greta Thunberg speeches". FridaysForFuture. Archived from the original on 30 ఏప్రిల్ 2019. Retrieved 26 April 2019. (A compilation of Thunberg's speeches, featuring both video and text)
- "Greta Thunberg Speeches and Interviews". WhatWouldGretaDo. Archived from the original on 24 సెప్టెంబరు 2019. Retrieved 19 September 2019. (A compilation of Thunberg's speeches and interviews, along with IPCC Reports)
- Appearances on C-SPAN
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి