గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ

(గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ నుండి దారిమార్పు చెందింది)

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, అమ్రాబాద్ గ్రామ సమీపంలో 120 కిమీల పొడవున్న అతిపెద్ద గోడ. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కాకతీయుల వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ గోడ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ నుంచి ప్రారంభమై ఫరహాబాద్‌ మీదుగా కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల వరకూ విస్తరించింది.[1]

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ
ప్రదేశంమన్ననూర్‌, అమ్రాబాద్‌ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
నిర్మించినది8-13వ శతాబ్దం

చరిత్ర

మార్చు

ఎనిమిదో శతాబ్దంలో అమ్రాబాద్‌ ప్రాంత సామంత రాజు పట్టభద్రుడు అమ్రాబాద్ కోట నిర్మాణానికి పునాదివేశాడు. ఆ తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి వచ్చిన ఈ కోటను, రాణి రుద్రమదేవి కొంత నిర్మాణం చేపట్టగా, తదనంతరం ప్రతాపరుద్రుడి పాలనాకాలంలో కోట నిర్మాణం పూర్తయింది. ఆ కోటకు రక్షణగా, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా 120 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడను ప్రతాపరుద్రుడు నిర్మించాడు.

ప్రస్తుత స్థితి

మార్చు

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం శత్రురాజ్యాల దాడులనూ తట్టుకొని నిలబడిన ఈ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్తనిధుల కోసం తవ్వకాలవల్ల గోడ మొత్తం దెబ్బతిన్నది. ఐదారు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఉంది.[2] మన్ననూరుకు సమీపంలో సుమారు కిలోమీటరు వరకూ కొండపైకి ఎక్కిన తర్వాత, చుట్టూరా సుమారు రెండు కిలోమీటర్ల మేర కోటగోడ కనిపిస్తుంది. మరోవైపు ఫరహాబాద్‌ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు ఇరువైపులా కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ‌.. ఇది ఎక్క‌డుంది.. దాని ప్ర‌త్యేక‌త‌లేంటి తెలుసా?". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-26. Archived from the original on 2021-06-07. Retrieved 2022-01-28.
  2. "మనదగ్గరా..మహాకుడ్యం!". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-29. Retrieved 2022-01-28.