అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా)

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

అమ్రాబాద్, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

అమ్రాబాద్
—  రెవెన్యూ గ్రామం  —
అమ్రాబాద్ is located in తెలంగాణ
అమ్రాబాద్
అమ్రాబాద్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′34″N 78°50′02″E / 16.3762°N 78.8340°E / 16.3762; 78.8340
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం అమ్రాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,753
 - పురుషుల సంఖ్య 6,857
 - స్త్రీల సంఖ్య 6,896
 - గృహాల సంఖ్య 3,290
పిన్ కోడ్ 509201
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 75 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

చారిత్రక నేపథ్యం

మార్చు

ఈ అమ్రాబాద్ విష్ణుకుండినుల తొలి రాజధాని.[3] దీనికి అమరావతి, అమరపురి అనే పేర్లు ఉండేవి. ఇక్కడి నుండే తరువాత ఇంద్రపురికి రాజధానిని మార్చారు. విష్ణుకుండీన వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (సా.శ.358-370) స్వశక్తితో రాజై, ఇక్ష్వాకు వంశపతనానంతరం కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ఈ అమ్రాబాదును రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇతని తనయుడు మొదటి మాధవవర్మఇంద్రపాలనగరానికి రాజధానిని మార్చాడు. ఇతని అనంతరం ఇతని కుమారుడు మొదటి గోవిందవర్మ కూడా ఇక్కడి నుండే పాలన కొనసాగించాడు.[4]

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3290 ఇళ్లతో, 13753 జనాభాతో 35678 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6857, ఆడవారి సంఖ్య 6896. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5289 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1145. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 575620.[5] పిన్ కోడ్: 509201.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 20, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల నాగర్‌కర్నూల్లో ఉంది. సమీప వైద్య కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్‌ వనపర్తిలోను, మేనేజిమెంటు కళాశాల నాగర్‌కర్నూల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మన్ననూర్లోను, అనియత విద్యా కేంద్రం అచ్చంపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

అమ్రాబాద్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార సౌకర్యాలు

మార్చు

అమ్రాబాద్లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

రవాణా సదుపాయాలు

మార్చు

మహబూబ్ నగర్ పట్టణం నుంచి అమ్రాబాదుకు మంచి రవాణా సదుపాయాలున్నాయి. మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్, అచ్చంపేట పై నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి అమ్రాబాదు మండలం పైనుంచే వెళుతుంది. ఈ మండలానికి మూడు వైపుల నదులే ఉండుట, పెద్ద వారధులు లేకపోవుటచే ఇతర జిల్లాల నుంచి రవాణా సదుపాయాలు అరుదుగా ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

అమ్రాబాద్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 29169 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 165 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 3903 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 451 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1989 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2440 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

అమ్రాబాద్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, జొన్న, సజ్జలు

పురాసంస్కృతి ఆనవాళ్ళు

మార్చు

ఆంధ్రప్రదేశ్ పురావస్తు, మ్యూజియంల శాఖ వారు లోగడ ఈ మండలంలో తవ్వకాలు చేపట్టి, ప్రాచీన సంస్కృతి ఆనవాళ్ళను బయల్పరిచారు. రాయలగండి రోడ్డు మీద పద్ర గ్రామ సమీపంలో 300 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాచీన కాలపు స్మారక చిహ్నాలను గుర్తించారు. వీటిని దాల్మెన్లు గా పిలిచారు. ఇక్కడ దాదాపు 25 దాల్మెన్లను గుర్తించారు. ఈ దాల్మెన్లను విభజిస్తూ మధ్యలో మండలవాగు నది ఉంది. ప్రతి దాల్మెను ఒక్కోదానికి 10, 15 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దాల్మెన్లు చదును పలకల గోడలతో, ఒక మీటర్ ఎత్తు వరకు నిర్మించబడి ఉన్నాయి. కప్పు పలక మందం 15 నుంచి 20 సెం.మీ. వరకు ఉంటుంది. లోపలి స్థలం 40 సెం.మీ. వెడల్పు, 80 సెం.మీ.పొడువు ఉంది. లోపలి గోడల నిర్మాణం గోళాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. గోడలకు బయట ఏటవాలు తరహాలో గులకరాళ్ళో, చిన్న చితకరాళ్ళు కప్పుదాకా పేర్చి ఉన్నాయి. ప్రతి దాల్మేన్ ప్రవేశ ద్వారంలోనూ ఒక గుమ్మం ఉంది. ప్రతి గుమ్మం 10 సెం.మీ. మందంతో ఉంది. ఈ దాల్మెన్లు అన్నీ గర్భస్థ శిలల మీదనే నిలబెట్టి ఉన్నా, ఇవి శ్మశానాల కంటే ఎక్కువగా స్మారక చిహ్నాలుగా ఊహించవచ్చు.[6]

అమ్రాబాద్‌ మహాకుడ్యం

మార్చు

'గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ'గా గుర్తింపు పొందిన పెద్ద గోడ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్‌ కోటకు శత్రుదుర్భేద్యమైన రక్షణగా, నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా 120 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడ నిర్మాణం ప్రతాపరుద్రుడి పాలనాకాలంలో ఎనిమిదో శతాబ్దంలో మొదలైన 13వ శతాబ్దంలో పూర్తయింది. అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ నుంచి ప్రారంభమై ఫరహాబాద్‌ మీదుగా కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల వరకూ విస్తరించింది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం శత్రురాజ్యాల దాడులనూ తట్టుకొని నిలబడిన ఈ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్తనిధుల కోసం తవ్వకాలవల్ల గోడ మొత్తం దెబ్బతిన్నది. ఐదారు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఉంది.[7]

మండల విశిష్టతలు

మార్చు
  • జిల్లాలో వైశాల్యం పరంగా అతిపెద్ద మండలం.
  • జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న మండలం.
  • 5 జిల్లాలను సరిహద్దులుగా కలిగిన ఏకైక మండలం.
  • ఐదు జిల్లాలలో విస్తరించిన దేశంలోనే అతిపెద్ద పులుల ప్రాజెక్టు పరిధిని కలిగిన మండలం.

మూలాలు

మార్చు
  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 264
  4. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 274
  5. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  6. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి, మొదటి సంపుటం, సంపాదకులు:ఎం.ఎల్.కె. మూర్తి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రచురణలు, ఆగస్ట్,2008, పుట - 125
  7. "మనదగ్గరా..మహాకుడ్యం!". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-29. Retrieved 2021-11-29.

వెలుపలి లింకులు

మార్చు