పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వైయూకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానములు కావించిరి. అష్టాధ్యాయిలో ఉన్నవి ఉన్నట్టు సూత్రములనుంచి ఆక్రముమమున వ్యాఖ్యానములొనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గవించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణము లలో ఒకటి ఈ చంద్రవ్యాకరణము. ఇది టిబెట్టు లో తర్జుమా చేయబడ్డదట. తొలుదొలుత జర్మను పండితులు దీనిని ప్రచురించిరి. ఈ వ్యాకరణము గూర్చి భర్తృహరి గ్రంథములలోనూ మల్లినాధుని వ్యాఖ్యానములలోనూ కొంతవరకు చూడవచ్చును.బౌద్ధుడగు ఈ చంద్రుడు పాణిని, కాత్యాయనుల సూత్రములను మార్చుచు, కొన్ని ఇతర సూత్రములను రచించెను. ఈతని గ్రంథమునకు అంగభూత గ్రంథములు- ఉణాదిధాతుపాఠ గణపాఠములు- పరి భాషలు కూడా కొన్ని ఉన్నవట. ఇది ప్రస్తుతము అలభయముగా ఉన్నది.

పాణిని

మూలాలు మార్చు

1. భారతి మాస సంచిక.