చంపక రామానాయక్

శ్రీలంక మాజీ క్రికెటర్

చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1986 నుండి 1995 వరకు 18 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 62 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు[3] ఆడాడు.

చంపక రామానాయక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే
పుట్టిన తేదీ (1965-01-08) 1965 జనవరి 8 (వయసు 59)
గాలే, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 40)1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1993 సెప్టెంబరు 14 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 49)1986 మార్చి 8 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1995 ఏప్రిల్ 14 - భారతదేశం తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 18 62
చేసిన పరుగులు 143 210
బ్యాటింగు సగటు 9.53 10.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 34* 26
వేసిన బంతులు 3,654 2864
వికెట్లు 44 68
బౌలింగు సగటు 42.72 30.13
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/82 4/17
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 11/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

జననం. విద్య మార్చు

చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే 1965, జనవరి 8న శ్రీలంకలోని గాలేలో జన్మించాడు.[4] రిచ్‌మండ్ కళాశాలలో విద్యను అభ్యసించాడు.

కోచ్‌గా మార్చు

ఎంతో అనుభవం, గౌరవం ఉన్న అంతర్జాతీయ క్రికెట్ కోచ్ గా ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు జాతీయ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా 15 సంవత్సరాలు, బంగ్లాదేశ్ జాతీయ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా 2 సంవత్సరాలు పనిచేశాడు. 16 సంవత్సరాల వయస్సులో లసిత్ మలింగలోని ప్రతిభను గుర్తించి, శ్రీలంక జట్టులో ఇప్పటివరకు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా మార్గనిర్దేశం చేయడం, శిక్షణ ఇవ్వడం చంపక గర్వించదగిన, అత్యున్నత విజయంగా చెప్పవచ్చు.

ఇతర వివరాలు మార్చు

ఆస్ట్రేలియాలోని మాకేలోని రే మిచెల్ ఓవల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వేదిక 1992 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఏకైక అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది, అతని మొదటి రెండు డెలివరీల తర్వాత మ్యాచ్ వాష్ అవుట్ అయింది.[5]

మూలాలు మార్చు

  1. "Champaka Ramanayake Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  2. "AUS vs SL, Sri Lanka tour of Australia 1987/88, Only Test at Perth, February 12 - 15, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  3. "PAK vs SL, Pakistan tour of Sri Lanka 1985/86, 2nd ODI at Moratuwa, March 08, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  4. "Champaka Ramanayake Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  5. "India vs Sri Lanka". Cricket Archive. Retrieved 2023-08-17.

బాహ్య లింకులు మార్చు