చతుర్ముఖం 2021లో విడుదలైన తెలుగు సినిమా. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రంజిత్ కమల శంకర్ సలీల్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో 8 ఏప్రిల్ 2021లో విడుదలైన ‘చతుర్ముఖం’ తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి ట్రైలర్‌ను ఆగష్టు 10, 2021న విడుదల చేసి,[1] ఆహా ఓటీటీలో సినిమాను ఆగష్టు 13, 2021న విడుదల చేశారు.[2][3]

చతుర్ముఖం
దర్శకత్వంరంజిత్ కమల శంకర్
సలీల్
రచనఅభయకుమార్ కె
అనిల్ కురియన్
నిర్మాతజిస్ టామ్స్ ,
జస్టిన్ థామస్
మంజు వారియర్
తారాగణంమంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి
ఛాయాగ్రహణంఅబినందన్ రామానుజం
కూర్పుమనోజ్
సంగీతండాన్ విన్సెంట్
నిర్మాణ
సంస్థలు
జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుసెంచరీ రిలీజ్
విడుదల తేదీ
2021 ఆగస్టు 13 (2021-08-13)
సినిమా నిడివి
138 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

తేజ‌స్విని (మంజు వారియ‌ర్) మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన మ‌హిళ .ఆమె తన స్నేహితుడు ఆంటోనితో క‌లిసి సీసీటీవీ సోల్యుష‌న్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. ఆమె త‌న మొబైల్ ఫోన్‌కు విప‌రీతంగా అల‌వాటు ప‌డుంటుంది. ఓ ప్ర‌మాదంలో ఆ ఫోన్ ప‌ని చెడిపోతుంది. కొత్త ఫోన్‌ను కొన్న తేజ‌స్విని (మంజు వారియ‌ర్) జీవితంలో ఆతీంద్రియ శ‌క్తుల కార‌ణంగా అనేక ఘ‌ట‌న‌లు జ‌ర‌గుతాయి. ఆ ఘ‌ట‌న‌ల వెనుకున్న విష‌యాల‌ను తేజ‌స్విని ఎలా తెలుసుకుంది. త‌న స్నేహితులు స‌న్నీ వైనే, శ్రీకాంత్ ముర‌ళిల సాయంతో ఆ స‌మ‌స్య‌ల‌ను నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేదే క‌థ‌.

నటీనటులు మార్చు

  • మంజు వారియర్‌
  • సన్నీ వెనె
  • అలెన్సెర్ లే లోపెజ్
  • నిరంజన అనూప్
  • బాబు అన్నూర్
  • శ్యామప్రసాద్
  • రోనీ డేవిడ్
  • శ్రీకాంత్‌ మురళి
  • షాజు శ్రీధర్
  • కళాభవన్ ప్రజోద్
  • బాలాజీ శర్మ
  • నివాస్ వాళ్లిక్కును
  • సారంజిత్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియర్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: జిస్ టామ్స్, మంజు వారియర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రంజిత్ కమల శంకర్ సలీల్
  • సంగీతం: డాన్ విన్సన్ట్
  • సినిమాటోగ్రఫీ: అబినందన్ రామానుజం

మూలాలు మార్చు

  1. Eenadu (10 August 2021). "కంటికి కనిపించని దుష్టశక్తితో పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న 'చతుర్ముఖం' ట్రైలర్‌". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
  2. NTV (5 August 2021). "ఆహాలో మంజు వారియర్ 'చతుర్ముఖం'". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
  3. Andrajyothy (5 August 2021). "ఆగస్ట్ 13న 'ఆహా'లో అరుదైన హారర్ థ్రిల్లర్ చిత్రం". Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.