బ్రహ్మసూత్రముల యందు ప్రథమమున గల నాలుగు సూత్రములను "చతుస్సూత్రి" అని అంటారు. వీటిని బహు మిక్కిలి గా గురువులు తమ శిష్యులకు బోధింతురు.

అవి:

1. జిజ్ఞాసాధికరణము

అథాతో బ్రహ్మ జిజ్ఞాసా

మరి అందువలన బ్రహ్మమును తెలిసికొనగోరవలసియున్నది.


2. జన్మాద్యధికరణము

జన్మా ద్యస్య యతః

జన్మ స్థితి లయములకు కారణమైనది బ్రహ్మము.


3. శాస్త్రయోనిత్వాధికరణము

శాస్త్రయోనిత్వాత్

శాస్త్రములు ప్రమాణములుగా నుండుట వలన.


4. సమన్వయాధికరణము

తత్తు సమన్వయాత్

అవి (శాస్త్ర ప్రమాణములు) బ్రహ్మమునందే సమన్వయించుట వలన.