చమీలా గమగే
మటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత, శ్రీలంక మాజీ క్రికెటర్. 2000ల ప్రారంభంలో రెండు టెస్టులు, 7 వన్డే ఇంటర్నేషనల్‌లు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు.[1] గాలేలోని రిచ్‌మండ్ కళాశాలలో చదివాడు. 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. [2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 4 January 1979 ఉనవటున, శ్రీలంక | (age 45)|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (180 cమీ.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 90) | 2002 జూలై 28 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 111) | 2002 ఆగస్టు 4 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 జనవరి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9 |
జననం
మార్చుమటెర్బా కనాత గమగే చమిలా ప్రేమనాథ్ లక్షిత 1979, జనవరి 4న శ్రీలంక లోని ఉనవటునలో జన్మించాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2002 జూలైలో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన గమగే, అంతర్జాతీయ క్రికెట్‌లో తక్షణ ప్రభావం చూపాడు, టెస్ట్ క్రికెట్‌లో తన మొట్టమొదటి డెలివరీతో వికెట్ తీసి, ఫార్మాట్‌లో అలా చేసిన మొదటి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు.[3]
శ్రీలంక తరపున మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. బ్యాటింగ్ లో 40 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 2003లో ఆస్ట్రేలియాతో అతని చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Chamila Gamage". CricketArchive. Retrieved 2023-08-16.
- ↑ "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
- ↑ 3.0 3.1 "Player Profile: Chamila Gamage". Cricinfo. Retrieved 2023-08-16.