చరణ్‌జిత్ సింగ్ చన్నీ

చరణ్‌జిత్ సింగ్ చన్నీ (జననం 1963 మార్చి 1) [1] ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2021 సెప్టెంబరు 20న పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. గతంలో అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో సాంకేతిక విద్య, శిక్షణ మంత్రిగా, పంజాబ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

చరణ్‌జిత్ సింగ్ చన్నీ
జననం (1963-03-01) 1963 మార్చి 1 (వయసు 61)
చంకౌర్ సాహిబ్, పంజాబ్, భారతదేశం
విద్యబి.ఎ, ఎల్.ఎల్.బి , ఎం.బి.ఎ.
జీవిత భాగస్వామికమల్‌జిత్ కౌర్
పిల్లలునవజిత్ సింగ్, రిథమ్‌జిత్ సింగ్

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

చన్నీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మక్రోనా కాలన్ గ్రామంలో జన్మించాడు. అతను పంజబ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం, పిటియు జలంధర్ నుండి ఎం.బి.ఎ. చదివాడు.[2]

అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

మార్చు

చాన్నీ 2015 నుండి 2016 వరకు పంజాబ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2017లో అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు.[2]

2021 సెప్టెంబరులో, అతను కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ తొలి దళిత సిక్కు ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు.[2] చరణ్ జిత్ చన్నీ 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాలనుండి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయాడు.[4] ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Ministers". punjabassembly.nic.in. Retrieved 2021-09-20.
  2. 2.0 2.1 2.2 2.3 Sep 19, TIMESOFINDIA COM / Updated:; 2021; Ist, 20:24. "Charanjit Singh Channi: Who is Charanjit Singh Channi, the new Punjab chief minister | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. Sharma, Manraj Grewal (19 September 2021). "Who is Charanjit Singh Channi, the man all set to be next Punjab CM?". The Indian Express.
  4. Andhra Jyothy (10 March 2022). "రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  5. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.