చర్చ:అభివృద్ధి చెందిన దేశాల జాబితా

తాజా వ్యాఖ్య: తప్పు పేజీ టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

తప్పు పేజీ మార్చు

ఇది, 2030 లో అత్యధిక జిడిపి (పిపిపి) ఉంటుందని ఒక వెబ్‌సైటు అంచనా వేసిన కొన్ని దేశాల జాబితా మాత్రమే. దీన్ని "అభివృద్ధి చెందిన దేశాల జాబితా" అనడం తప్పు. "అభివృద్ధి చెందిన దేశాల జాబితా" అనడానికి క్రైటీరియా వేరే ఉంది. జిడిపి (పిపిపి) ఎక్కువగా ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశం అవదు. అంచేత ఈ పేజీ పేరు తప్పు, ఆ విషయమై ఇందులో ఇచ్చిన సమాచారం తప్పు.

అసలు ఈ పేజీలో పెద్దగా సమాచారం లేదు. ఈ పేజీలో పెద్దగా సమాచారం లేదు. ఒక వెబ్‌సైటులో ఉన్న "అంచనాల పట్టిక"ను ఉన్నదున్నట్లుగా తెచ్చిపెట్టారు, పైగా ఆ వెబ్‌సైటు ఈ అంచనాల ఎలా వేసిందో చెప్పే మూలాలనేమీ చూపలేదు. ఆ లెక్కలకు విశ్వసనీయత కనిపించలేదు. కేవలం ఈ అంచనాల కోసమే ఒక పేజీ సృష్టించాల్సినంత ప్రాముఖ్యత ఈ అంకెలకు గానీ, ఆ వెబ్‌సైటుకు గానీ లేదని నా అభిప్రాయం. అంచేత ఈ పేజీని తొలగించాలి. __ చదువరి (చర్చరచనలు) 01:52, 25 మార్చి 2023 (UTC)Reply

తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 03:37, 25 మార్చి 2023 (UTC)Reply
Return to "అభివృద్ధి చెందిన దేశాల జాబితా" page.