Chaduvari
నాది కావూరు. నేనిక్కడ తొంభయ్యేడో వాణ్ణి. ఓ నిర్వాహకుణ్ణి, ఓ అధికారినీ. |
వికీలో నే చేసిన కృషి లోంచి కొన్ని ముఖ్యమైన అంశాల షో కేసు
|
ChaduvariAWB, ChaduvariAWBNew - ఈ రెండు వాడుకరులూ కూడా నేనే |
నా ఆసక్తులుసవరించు
- తెలుగు భాష, సాహిత్యం: ఛందోబద్ధమైన పద్యాలు (కాస్తో కూస్తో రాయడం కూడా), అవధానాలు వగైరా.. కానీ వీటి గురించి వికీలో పెద్దగా రాయను.
- రాజకీయాలు: రాజకీయాలు నాకు బాగా ఇష్టం. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ - ఈ వరసలో ఉంటాయి నా ఇష్టాలు. అయితే రాజకీయాలకు సంబంధమున్న వ్యాసాలను వికీలో రాయడం మానేసాను -నిష్పాక్షికంగా రాయడం కష్టం అనిపించింది కాబట్టి.
- అంతరిక్ష యాత్రలు: అంతరిక్ష విజ్ఞానంలో అనేక అంగాలు.. వాటిలో యాత్రలు ఒకటి. నాకెంతో ఇష్టమైన విషయాల్లో ఇదొకటి. కక్ష్యలు, అంతరిక్ష నౌకలు, వాహనాలు, వాటి ఇంజన్లు.. వగైరా. వీటి గురించి వికీలో రాస్తూంటాను.
- క్షిపణులు వగైరా: భారతీయ క్షిపణులు, యుద్ధనౌకల వంటి భారత రక్షణ వ్యవస్థకు చెందిన విషయాలు నాకు ఇష్టాలు. వికీలో రాస్తూంటాను కూడా.
- చరిత్ర: భారత చరిత్రకు సంబంధించిన విషయాలు వికీలో రాస్తూంటాను.
- మానవ పరిణామం: నాకు ఆసక్తి ఉన్న మరో అంశం మానవ పరిణామం. ఇందులో నేను కొన్ని వ్యాసాలు రాసాను. అన్నీ ఇంగ్లీషు నుండి చేసిన అనువాదాలే.
- యుద్ధాలు: యుద్ధాలు, ముఖ్యంగా భారత చైనా, భారత పాకిస్తాన్ యుద్ధాల గురించి రాయడం కూడా ఇష్టం.
నా కిష్టమైన, నేను చేస్తున్న/చెయ్యాలనుకుంటున్న వికీ పనులుసవరించు
వికీపీడియాలో నాకోసం నేను నిర్దేశించుకున్న పనులు 2017 నవంబరు నాటికి ఇవి. కింది జాబితా సుమారుగా ప్రాథమ్య పరంగా తయారు చేసాను.
- భాషా నాణ్యత:
- అవసరాన్ని బట్టి కొత్త రెగెక్సులను చేర్చడం. ఇవి నిరంతరం జరిగే పనులు.
- AWB ని వాడి వ్యాసాల్లోని భాషాదోషాలను సరిచెయ్యడం.
- సమాచార నాణ్యత: వికీపీడియాలో చేరుస్తున్న సమాచారపు నాణ్యతను పరిశీలించడం, మెరుగు పరచడం. ఇది నా పనులన్నిటి లోకీ ముఖ్యమైనది. మొట్టమొదటి ప్రాథమ్యం, అత్యధిక ప్రాథమ్యమూ దీనికే.
- గ్రామాల పేజీల్లో చేర్చిన సమాచారం నాణ్యంగా ఉందో లేదో గమనించడం, అవసరమైన మార్పులను చెయ్యడం, నాణ్యతను మెరుగుపరచడం. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత సమాచారం చేర్చేటపుడు పాత సమాచారాన్ని తగు విధంగా సవరించాల్సి ఉంది.
- ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల పేజీలకు పేర్లు సరిగా లేవు. అనేక గ్రామాల పేర్లు తప్పుగా రాసాం. వాటిని సరైన పేర్లకు తరలించాలి. దాదాపు ఆరేడు వేల పేజీలను తరలించాల్సి ఉంటుందని నా అంచనా.
- విధానాలు, మార్గదర్శకాల చేర్పు,మార్పు: అవసరమైన చోట్ల విధానాలను నిర్వచించడం, అందుకోసం అవసరమైన చర్చలను నిర్వహించడం.
- నిర్వహణ పనులు
- ప్రత్యేక పేజీలు: అప్పుడప్పుడూ ప్రత్యేకపేజీలను చూస్తూ, అవసరమైన చోట్ల చర్య తీసుకోవడం. ఉదా: అనాథ పేజీలు, అగాధ పేజీలు, వికీడేటాలో అంశం లేని పేజీలు, భాషాంతర లింకులు లేని పేజీలు, అయోమయ నివృత్తి పేజీకున్న లింకులు, మూసల దిగుమతి వగైరాలు.
- సెమీ ఆటోమేషన్: అవకాశం ఉన్న అన్నిచోట్లా సెమీ ఆటోమేషన్ పద్ధతిలో మార్పు చేర్పులు చెయ్యడం.
- నాణ్యతా మూల్యాంకనం చెయ్యాలి. అందరికీ అమోదయోగ్యమైన పద్ధతులను రూపొందించాలి. ఆ పద్ధతులను విరివిగా వాడుక లోకి తేవాలి.
నేను చేసిన కొన్ని ఎన్నదగ్గ పనులుసవరించు
భాషాదోషాల సవరణసవరించు
భాషా దోషాలను సరిచేసేందుకు రెగెక్సులు రాసాను. 500 పైచిలుకు రెగెక్సుల ద్వారా వేలాది తప్పులకు సవరణలను రాసాను. ఇక AWB వాడి, ఎవరైనా, తాము ఎంచుకున్న పేజీల్లో ఈ తప్పులను సవరించవచ్చు.
గ్రామాల పేజీలుసవరించు
గ్రామాల పేజీల్లో జనగణన సమాచారం చేర్చడం: ప్రాజెక్టు పేజీలో చూపినట్లుగా అప్లికేషను తయారీ పని అయింది. తెలుగీకరణ పని, టెక్స్టు ఫైళ్ళ తయారీ పనిని పూర్తి చెయ్యాలి. పేజీల్లో సమాచారాన్ని చేర్చాలన్న ఆసక్తి కలిగిన వారికి టెక్స్టు ఫైళ్ళను పంపించాను. నేను కొన్ని గ్రామాల పేజీల్లో పని చేసాను. భాస్కరనాయుడు, వెంకటరమణ, సుజాత, పవన్ సంతోష్, జెవిఆర్‌కె ప్రసాద్, యర్రా రామారావు, అజయ్ బండి మొదలైనవారు ఈ పనిఉలో విశేషమైన కృషి చేసారు. ముఖ్యంగా యర్రా రామారావు గారు - అందరూ ఈ పని నుండి పక్కకు తప్పుకున్నాక, ఒంటిచేత్తో వేలాది పేజీలను తీర్చిదిద్దారు.
తెలంగాణ కొత్త మండలాలు, జిల్లాలుసవరించు
తెలంగాణలో జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ తరువాతి పరిస్థితిని ఇక్కడి వ్యాసాల్లో చేర్చాలి. ఇదొక పెద్ద పని. గ్రామాలు, మండలాల వ్యాసాలు, మండలాల మూసలు, జిల్లాల మూసలు, సంబంధిత వర్గాలు మొదలైన చోట్ల మార్పుచేర్పులు చెయ్యాలి. యర్రా రామారావు గారే ఈ పని చేసారు. అజయ్ బండి గారు కొంత చేసారు. నేను కొద్దిగా చేసాను.
మరియు ల తొలగింపుసవరించు
"మరియు", "యొక్క" - ఈ రెండు పదాలు భాషకు అసహజంగా ఉంటాయి - ముఖ్యంగా "మరియు". 2018 ఆగస్టు 17 నాటికి వికీలో 20539 "మరియు"లు, 31427 "యొక్క"లు ఉన్నాయి. "మరియు"ను వాడకూడదు, ఉన్నవాటిని తొలగించాలి అనేది నా సంకల్పం. 2020 మార్చి 22 ఈ పని పూర్తైంది. "మరియు"ల ఏరివేతపై చేసిన పని గురించి క్లుప్తంగా ఇక్కడ చూడవచ్చు,
నాణ్యతా మూల్యాంకనంసవరించు
ఈ పనిలో భాగంగా.. పవన్ సంతోష్ గారితో కలిసి, ఎన్వికీలో ఉన్న మంచి వ్యాసం ప్రమాణాలను ఇక్కడికి తెచ్చాను. ప్రాసెస్‌ను పరీక్షించి చూసాం. అంతా బానే ఉంది.
గూగుల్ యాంత్రికానువాదాల తొలగింపు - కొన్ని పేజీల పునఃసృష్టిసవరించు
అనేక చర్చోపచర్చల తరవాత గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలను 2020 ఫిబ్రవరి 5 న తొలగించాను. ఆ మేరకు వికీ నాణ్యత మెరుగుపడింది. వ్యాసాలను తొలగించేటపుడు వాటన్నిటినీ ఒక జాబితాగా చేసాను. ఆ జాబితాలోంచి మార్చి 31 లోపు రాయడానికి 20 వ్యాసాలను ఎంచుకున్నాను. ఆ వ్యాసాలన్నిటినీ ఆ గడువు లోపునే ప్రచురించేసాను. ఆ వ్యాసాలివి:
చమురు ఒలకడం, గ్రీన్హౌస్ వాయువు, బ్లాక్ హోల్, గ్రీన్హౌస్ ప్రభావం, చిలికా సరస్సు , పారిశ్రామికీకరణ, పారిశ్రామిక విప్లవం, భారతదేశ జాతీయ రహదారులు , భూ సర్వే, శబ్ద కాలుష్యం, జల వనరులు , ఓజోన్ క్షీణత, నియాండర్తల్ , పులి, గ్లోబల్ వార్మింగ్, అగ్నిపర్వతం , తేజస్ (యుద్ధ విమానం) , మున్నార్ , భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు , నీటి కాలుష్యం
మొత్తం ఎంచుకున్న వ్యాసాలు 20. రాసినవి 20. వీటిలో 19 కొత్త పేజీలు, ఒకటి -రాజశేఖర్ గారు సృష్టించిన దారిమార్పు పేజీలో ఓవర్రైట్ చేసాను. ప్రచురించినపుడు పేజీల మొత్తం పరిమాణం (ఇప్పుడు పెరిగి ఉంటుంది): 18,22,802 బైట్లు. అంటే ఒక్కో పేజీ సగటు పరిమాణం: 91,140 బైట్లు.
రెండు వేల వ్యాసాలను తొలగించేందుకు రెణ్ణిముషాలు పడితే, రెండు పదుల వ్యాసాలను సృష్టించేందుకు రెణ్ణెల్లు పట్టింది.
ఈ రెండు నెలల్లో పైవి కాకుండా మరో 11 కొత్త వ్యాసాలను కూడా ప్రచురించాను. ఇవి తొలగించిన వ్యాసాలతో సంబంధం లేనివి. ఆ వ్యాసాలు:
సెరెంగెటి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, పీర్ పంజాల్ కనుమ, పీర్ పంజాల్ శ్రేణి, కెన్యాంత్రోపస్ , భారతదేశంలో అగ్నిపర్వతాల జాబితా, నార్కోండం ద్వీపం, బ్యారెన్ ఐలాండ్, కోట హరినారాయణ , టెర్రాఫార్మింగ్, పారాంత్రోపస్ రోబస్టస్
వీటి సగటు పరిమాణం: 26,710 బైట్లు
*** మొత్తం అన్నీ కూడా గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువదించినవే. ***
నేను చేసిన పనుల గురించిన వివరాలున్న పేజీలుసవరించు
- 2020 సంవత్సరంలో నేను చేసిన పనులు
- వ్యాసాల అభివృద్ధి ఉద్యమం: 2020 ఏప్రిల్లో తలపెట్టిన వ్యాసాల అభివృద్ధి ఉద్యమంలో పనిచేసాను. ఉద్యమం నడిచే నెల రోజుల్లోనూ (ఏప్రిల్ 1 నుండి 30 వరకూ) మొత్తం 6 లక్షల బైట్లను చేర్చాలనే లక్ష్యం పెట్టుకుని పని మొదలు పెట్టాను. కానీ దానికి ఐదు రెట్లు సాధించాను. లక్ష్యాన్ని నిర్ణయించుకోడంలో దారుణంగా విఫలమయ్యాను. ఆ నెలలో నా రోజువారీ పని ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.
- మొలకల విస్తరణ ఋతువు 2020 లో కృషి: 2020 జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల పాటు జరిగిన మొలకల విస్తరణ ఋతువులో పాల్గొన్నాను. యర్రా రామారావు గారు 6500 మొలకలను జాబితా చేసి, వాటిలో సగం దాకా రెండు వర్గాల్లోకి (సినిమాలు, గ్రామాలు) చేర్చేసారు. మిగతా మొలకలను 40 వర్గాల్లోకి వర్గీకరించాను. ఆ తరువాత ప్రాజెక్టును మొదలైంది. ప్రాజెక్టు ప్రగతిని రోజువారీగా గమనిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్టులు తయారు చేసి పెట్టాను. నెలవారీ నివేదికలు, తుది నివేదిక తయారు చేసి పెట్టాను. వికీలో అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ విజయంలో నావంతు కృషి చేసాను. 900 మొలకలను విస్తరించాను. నేను విస్తరించిన పేజీల పట్టిక చూడండి