చర్చ:అమరావతి కథలు
వ్యాసం లక్ష్యం
మార్చుకథల జాబితా ఇవ్వటంలో ఉద్దేశ్యం, ప్రతి కథ గురించి కొద్ది కొద్ది గా వ్రాద్దామని. --SIVA 18:07, 30 అక్టోబర్ 2008 (UTC)
ఆబినందనలు
మార్చుశివా! ఈ వ్యాసం మొదలు పెట్టినందుకు అభినందనలు. చాలా రోజులుగా ఈ వ్యాసం వ్రాయాలని నేను అనుకొంటున్నాను కాని చేయలేకపోయాను. నేను ఇంటర్మీడియెట్‌లో ఉన్నపుడు ఆంధ్ర జ్యోతిలో ఈ కధలు వచ్చేవి. అప్పుడు చదివాను. తరువాత పుస్తకం కొన్నాను. మొన్నీ మధ్య మళ్ళీ కొన్నాను కేవలం వికీలో వ్యాసం వ్రాయడం కోసం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:25, 30 అక్టోబర్ 2008 (UTC)
- కాసుబాబుగారు! చాలా రోజుల తరువాత ఒక వ్యాసం వ్రాయాలనిపించింది. మీకు లాగానె నేను కూడ కాలేజీలో చదువుకునే రోజులలో ఈ కథలు చదివాను. ఈ కథల రచయిత శంకరమంచి సత్యంగారి అబ్బాయి, మా క్లాసులోనే చదివాడు. వికీలో వ్యాసం వ్రాద్దామని కాక పోయినా, విజయవాడ వెళ్ళీనప్పుడల్లా, విశాలాంధ్ర, అరుణా లేదా నవొదయా పుబ్లిషర్స్ దుకాణాలకు వెళ్ళి పుస్తకాలు కొనటం అలవాటు. ఇప్పుడు వ్యాసం వ్రాయటానికి చక్కగా ఉపయోగపడింది. ఈ వ్యాసాన్ని విస్తరించటానికి, ఇంకా ఇతర వివరాలు పొందుపరిస్తే బాగుంటుందో తెలియచేయగలరు. నేను 2-3 రోజులలో హైదరాబాదు వెల్తున్నాను. వీలయితే వివరాలు సంపాయించటానికి ప్రయత్నిస్తాను. --SIVA 19:12, 30 అక్టోబర్ 2008 (UTC)
- శివ గారు, అమరావతి కథలు గురించి చక్కని వ్యాసం వ్రాస్తున్నందుకు అభినందనలు. నా కాలేజీ రోజులలో వచ్చిన ఈ కథలు నా మనోఫలకముపై చెరగని ముద్ర వేశాయి. తదుపరి నవోదయా వారి పుస్తకము కొనుక్కొన్నాను. తీరిక దొరికినప్పుడల్లా ఎదో ఒక కథ చదువుతుంటాను. ఎన్నిసార్లు చదివినా ఒక కొత్త అనుభూతే. అమరావతి వెళ్ళి వీధులన్ని కలియతిరిగాను. కృష్ణాతీరం, అర్ఛకుల వీధి, రాజమార్గం, స్తూపం, మ్యూజియం వగైరా ప్రదేశాలు చూసి కథలు నెమరువేసుకున్నాను. అదొక చెప్పలేని ఉల్లాసం, అనుభూతి. అమరావతి కథలు వ్రాసిన సత్యం గారి జన్మ ధన్యం. చదివిన వారి బ్రతుకులు కూడ ధన్యం. హృదయాన్ని స్పృశించి, మానవుని లోని సున్నితమైన భావాలను స్పందింప చేసే ఇలాంటి సాహిత్యానికే నోబెల్ బహుమతులివ్వాలి.Kumarrao 07:53, 2 నవంబర్ 2008 (UTC)
- వ్యాసం బాగానే వస్తున్నది. తోడుగా నేను కూడా నాకు వీలయినంత వ్రాస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 30 అక్టోబర్ 2008 (UTC)
చేయవలసిన పనులు
మార్చుచేర్చవలసినవి, టీవీ సీరియల్ వివరాలు, ప్రముఖుల అభిప్రాయాలు, ఇతర రచయితల పై ఈ పుస్తకం ప్రభావం, ఈ పుస్తకంపై ఇతర రచయితల ప్రభావం. Chavakiran 03:58, 31 అక్టోబర్ 2008 (UTC)
- నాఉద్దేశ్యంలో ఎక్కడైనా పాత ఆంధ్ర జ్యోతి వార పత్రికలు (ఈ కథలు ప్రచురించబడినప్పటివి) దొరికితే, అప్పటి చదువరుల అభిప్రాయాలు, సమీక్షలు ఇతరుల అభిప్రాయాలు దొరుకుతాయి. హైదరాబాదులో నివాసం ఉండే సభ్యులు ఎవరైనా చిక్కడపల్లిలో ఉన్న సెంట్రల్ గ్రంధాలయానికి వెళ్ళి ప్రయత్నిస్తే తప్పక దొరుకుతాయి. కాబట్టి, హైదరాబదులోని సభ్యులు చొరవ తీసుకొని ఈ ప్రయత్నం చెయ్యగలరని కు నా విన్నపం.--SIVA 01:14, 1 నవంబర్ 2008 (UTC)
కథలకు ప్రత్యేక పుట
మార్చు- శివా! వ్యాసం పెద్దదవుతున్నది. మీరు ఇంకొంత వ్రాయాలనుకొంటే ఈ వ్యాసాన్ని విభజించడం మంచిదనుకొంటాను. ప్రధాన వ్యాసంలో కథల పట్టిక మాత్రం ఉంచవచ్చును. అమరావతి కథలు - టూకీగా అనే మరోవ్యాసం మొదలుపెట్టి అందులో కథల వివరాలు వ్రాయవచ్చును. మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:19, 3 నవంబర్ 2008 (UTC)
- కాసుబాబు గారూ! అమరావతి కథలన్నీ కూడా టూకీగా వ్రాద్దామని ఉన్నది. కొంత సమయం పట్టవచ్చును. మనం గుడిపాటి వెంకటచలం గురించి వ్యాం వ్రాస్తున్నప్పుడు, కొంతమంది నటులగురించి వ్రాస్తున్నప్పుడు వారివారి చిత్రాల జాబితాలు ప్రత్యేకంగ ఉంచటం గురించి కొంత చర్చ జరిగింది. ఆ చర్చననుసరించి, కథలను టూకీగా వ్యాసంలోనే వ్రాస్తున్నాను. కాదు, ప్రత్యేక వ్యాసంగా పెడదామంటే, అలాగే. ఒక మంచి పేరు సూచించండి. ఏది ఏమయినా, అమరావతి కథలగురించి, ఆ కథలను చదవని వారికి సంపూర్ణ సమాచారం ఇవ్వటమే నా ఉద్దేశ్యం. ప్రస్తుతం నేను హైదరాబాదులో, బంధువుల ఇంటినుండి ఈ వాఖ్య వ్రాస్తున్నాను. 3-4 రోజులలో ముంబాయికి తిరిగి వెళ్ళి మిగిలిన కథలగురించి వ్రాస్తాను. దయచేసి మీ నిర్ణయం తెలియచేయగలరు.--SIVA 09:21, 4 నవంబర్ 2008 (UTC)
- కాసుబాబుగారూ! మొదటినుండీ నా అభిప్రాయం ఒక రచయిత కథల గురించి గాని, ఒక నటుడి పాత్రల గురించి గాని, ప్రత్యేక పుట ఉంచటమే సరయిన పద్ధతి అని. కాని ఇంతకు ముందు (ఎస్వీ రంగారావు వ్యాసం గురించి అనుకుంటాను)జరిగిన వాదోపవాదాలలో, అదే పుటలో ఉంచటం భావ్యమని, వేరొక పుటలో కాదని, నొక్కి వక్కాణించటం జరిగింది. సరే! నలుగురితోబాటు అని, అదే వ్యాసంలో కథల గురించి వ్రాస్తుంటే, పత్యేక పుట అని సూచించారు. ఏది ఏమయినా, ఇటువంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు, ఏదో ఒక పంధాను అనుసరించి, ఆ పంధాను ఒక నియమంగా చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. అలాగయితే, ఒక కోవకు చెందిన వ్యాసాలన్నీ ఒక పద్ధతిలో వస్తాయి.--SIVA 00:50, 7 నవంబర్ 2008 (UTC)
- కథలను అమరావతి కథా సంగ్రహం అన్న కొత్త పుట ఏర్పరిచి అక్కడకు మార్చాను. ఇక్కడ, కథల జాబితా మాత్రం ఉంచాను. కథల జాబితా కూడా, ఒక టేబుల్ ఫార్మాట్ లో నాలుగు వరుసలుగా (4 columns, 25 rows)గా మారిస్తే చూడటానికి, రెఫరెన్సుకు బాగుంటుందని నా అభిప్రాయం. టేబుల్ ఫార్మాట్ నాకు సరిగా చేతగాదు, ఎవరయినా సహాయం చేయగలరు.--SIVA 01:00, 7 నవంబర్ 2008 (UTC)
కథలెన్ని??
మార్చుకొన్ని చోట్ల 100 అని మరి కొన్ని చోట్ల 101 అని ఉంటోంది. కథా సంపుటిలో చూస్తే 100 కథలున్నాయి (జాగ్రత్తగా 2-3 సార్లు లెక్కపెట్టాను, చివరకు కథలకు వరుసక్రమంగా సంఖ్యలను వేస్తూ వెళ్ళాను). నూటొక్క కథలు నిజమైతే, సంపుటిలో లేని ఆ కథ ఏమిటి, అది ఎందుకు సంపుటిలో లేదు, ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతుందా ఇత్యాది విషయాలు, "నూటొక్క కథలు" అని వ్రాసిన సభ్యులు తెలియ చేయగలరు. లేదా, నూరు కథలే అయితే, వ్యాసంలో 101 అని వ్రాసిన చోటల్లా 100 గా మార్చటం సబబు.--SIVA 00:50, 7 నవంబర్ 2008 (UTC)
- ప్రస్తుతానికి 100 కథలుగానె వ్యాసంలో మార్పు చెయ్యటం జరిగింది. 101వ కథ గురించి వివరాలు దొరికిన తరువాత అప్పుడు తగిన మార్పులు చెయ్యవచ్చు.--SIVA 22:50, 26 నవంబర్ 2008 (UTC)
సాహిత్యాభిమనుల అభిప్రాయాలు
మార్చుసామాన్యంగా, వ్యాసాలలో సాహితీ వేత్తలు, సమకాలీన రచయితల అభిప్రాయాలు మాత్రమే చూస్తూ ఉంటాము. అందుకు భిన్నంగా,సాహిత్యాభిమానుల అభిప్రాయాలు వ్యాసంలో చేర్చటం మంచి సంప్రదాయం.--SIVA 22:50, 26 నవంబర్ 2008 (UTC)
వావిలాల సుబ్బారావుగారి అభిప్రాయం
మార్చు"అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ"
పై అభిప్రాయంతో నేను ఏకీభవించలేక పోతున్నాను. అమరావతి కథలలో అనేకం-"ఒక రోజెళ్ళిపోయింది", "పుణుకుల బుట్టలో లచ్చితల్లి" "ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే", "తులసి తాంబూలం" ఇత్యాదిగా అనేకం కాలేజీ రోజులలో ఒకరికొకరు చెప్పుకుని ఎంతగానో అనందించి, ఒకరు చదవని కథను మరొకరు చదవటాని ప్రొత్సహించుకునేవాళ్ళం. నా ఉద్దేశ్యంలో అతి కొద్ది కథలను మరొకరికి చెప్పలేక పోవటం జరగవచ్చు, ఏ కథ గురించి మనం చదివిన తరువాత ఇతరులకు చెప్పలేము అని అలోచిస్తే అతి తక్కువ కథలు తట్టినాయి. వేరొక చోటునుండి వారి వ్యాఖ్యను ఇక్కడ ఉట్టంగించటంలో ఏమైనా communication gap వచ్చిందా? --SIVA 01:23, 6 డిసెంబర్ 2008 (UTC)
- శివా! ఈ వ్యాఖ్య నేనిప్పుడే చూశాను. అమరావతి కథలు, శతవసంత సాహితీ మంజీరాలు - రెండు పుస్తకాలూ నా దగ్గరున్నాయి. ఉన్నదున్నట్లు వ్రాశాను గాని అంతకంటే నేను ఆలోచించలేదు. మరొకసారి చూస్తాను. ఏకీభవించడం అనేది మన యిష్టమనుకోండి. ఇప్పుడు మీ వ్యాఖ్య చూశాక నేను కూడా పాతరోజులు నెమరు వేసుకొంటున్నాను. నేను కాలేజీలో ఇంటర్ చదివేప్పడు ఈ కథలు వచ్చాయి. ప్రత్యేకంగా ఈ కథల కోసం ఆంధ్రజ్యోతి కొనేవాళ్ళం కొందరుఉ మిత్రులం. ఇద్దరూ కథలు చదివితే డిస్కషన్ బాగుండేది కాని ఒక్కరే చదివితే ఆ కథలో ఉన్న సౌందర్యం చెప్పడం కష్టమే అనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:23, 26 మార్చి 2009 (UTC)